antarcitica
-
International Youth Day 2022: చైతన్యతరంగాలు.. ఈ ప్రపంచమే నా ఊరు!
‘నా ఊరే నా ప్రపంచం’ అనే పరిమిత భావనకు భిన్నంగా– ‘ఈ ప్రపంచమే నా ఊరు’ అంటూ వివిధ రకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది యువతరం... నిధి మయూరిక బెంగళూరుకు చెందిన నిధి మయూరికకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే అంతులేని ఆసక్తి. పదకొండు సంవత్సరాల వయసులోనే ‘ఆస్ట్రోబయోలజీ’ చదవడం మొదలుపెట్టింది. 2016లో నాసా ఏమ్స్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో పాల్గొంది. ‘సైకతం’ పేరుతో డిజైన్ చేసిన త్రీ లెవెల్ స్పేస్ కాలనీ, ఆ తరువాత రూపొందించిన ‘స్వస్తికం’.. ‘సొహం’ డిజైన్లు మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఈ బహుమతులతో సైన్స్‌పై తన ఆసక్తి రెట్టింపు అయింది. గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టింది. స్పేస్సైన్స్ను ప్రమోట్ చేయడానికి రకరకాలుగా కృషి చేస్తున్న సొసైటీ ఫర్ స్పేస్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌లో టీమ్‌లీడర్‌గా పనిచేస్తుంది నిధి. యూఎన్ ఉమెన్ ఇండియా సొసైటీ ఫర్ స్పేస్‌లాంటి ఆర్గనైజేషన్లలోని యంగ్ లీడర్స్‌తో కలిసి పనిచేస్తోంది. జెండర్–సెన్సిటివిటీ ప్రకటనలు, సినిమాలు, సాహిత్యంలో ఉదాత్తమైన మహిళల పాత్రలు, స్త్రీల హక్కులు...ఇలా ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగలదు నిధి. ‘నేను పయనిస్తున్న దారిపై నమ్మకం ఉంది. నేను ఆశావాదిని. మార్పు త్వరలోనే సాధ్యపడుతుందని నమ్ముతున్నాను’ అంటున్న నిధి మయూరిక ‘ఐయామ్ జనరేషన్ ఈక్వాలిటీ’ అని నినదిస్తోంది. పాత, కొత్తతరం అనే తేడా లేకుండా అందరం ఎడ్యుకేట్ కావాలి అంటుంది నిధి మయూరిక. దేవిష్ ఝా 19 సంవత్సరాల దేవిష్ ఝా హైస్కూల్లో చదివేరోజుల నుంచే ఇంటర్నేషనల్ క్లైమెట్ ఆర్గనైజేషన్ ‘జీరో అవర్’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. పర్యావరణ విధ్వంసం గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే ఈతరం, భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలి అంటుంది దేవిష్. ‘ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయకార్యక్రమాల్లో పాల్గొనాలి. జీరో అవర్లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి ప్రచారం చేయాలి. వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో పంచుకోవాలి... ఇవి క్లైమెట్ యాక్టివిస్ట్ ప్రధానబాధ్యతలు’ అంటుంది దేవిష్. ‘యువతరంలో ప్రతి ఒక్కరికీ సంకల్పబలం ఉంది. బలమైన గొంతుక ఉంది. అది సామాజిక మార్పుకు ఉపయోగపడాలి’ అంటుంది దేవిష్. ఈతరం ప్రతినిధులందరూ సుందర భవిష్యత్ నిర్మాణానికి తమవంతుగా కృషి చేయాలని అంటుంది 23 సంవత్సరాల అవని అవస్తి. అంటార్కిటికా యాత్రకు అవకాశం వచ్చినప్పుడు తన వయసు 18 సంవత్సరాలు. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ‘అక్కడి వాతావరణం తట్టుకోవడం కష్టం. నువ్వు ఏమైనా అబ్బాయివా! ఈ డబ్బును నీ పెళ్లి కోసం బ్యాంకులో పొదుపు చేస్తే మంచిది’ అన్నారు. ఇలాంటి సంఘటనలు తన ఉత్సాహాన్ని నీరుగార్చలేకపోయాయి. అంటార్కిటికాలో దేశదేశాల నుంచి వచ్చిన యువతరంతో మాట్లాడే అవకాశం అవనికి లభించింది. ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. విస్తృతప్రపంచాన్ని దర్శించినట్లు అనిపించింది. ‘రీసైకిల్ ఆర్మీ’ ద్వారా రీసైకిలింగ్, జలసంరక్షణ....మొదలైన విషయాలపై విస్తృత ప్రచారం చేసిన అవని– ‘వయసుతో నిమిత్తం లేకుండా అన్ని తరాల వాళ్లు పర్యావరణ పరిరక్షణకు తమవంతు ఆలోచన చేయాలి. ఆచరించాలి’ అంటుంది. త్రిష శెట్టి.. ‘షీ సే’ ముంబైకి చెందిన త్రిష శెట్టి ‘షీ సే’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా స్త్రీ చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్త్రీల భద్రతపై ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘ఆన్లైన్లో బార్ల గురించి సమాచారం వెదికితే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. బాధితులకు సంబంధించిన సమాచారం మాత్రం కనిపించదు’ అంటున్న త్రిష బాధితులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఐక్యరాజ్య సమితి ‘యంగ్ లీడర్స్’ జాబితాలో చోటు సంపాదించిన త్రిష శెట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ సదస్సులలో పాల్గొనడం ద్వారా తన ఉద్యమ కార్యచరణకు పదును పెడుతుంది. ..... రకరకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి పనిచేస్తున్న యువతరంలో వీరు కొందరు మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారికి ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం. చదవండి: సమ గౌరవమే సరైన రక్ష -
అధిక ఉష్ణోగ్రత! కారణం ఏంటంటే..
అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్వో. న్యూయార్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు. వేడికి కారణం మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. ఇంతకు ముందు.. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు. చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట! -
అంటార్కిటికాలో ల్యాండ్ అయిన కరోనా
శాంటియాగో: ఇప్పటి వరకు కరోనా దూరని ప్రదేశం, ప్రాంతం ఏదైనా ఉందా అంటే అంటార్కిటికాగా చెప్పేవాళ్లం. పూర్తిగా మంచుతో కప్పబడి.. సామాన్యులు ఎవరు నివసించని ఈ ఖండం కరోనా రహిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. కానీ ఇక మీదట ఇలా పిలవడానికి వీలు లేదు. అంటార్కిటికాలో చిలీకి చెందిన ఓ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న 36 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు చిలీ సైన్యం, ఆరోగ్య అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వీరందరిని ఇక్కడ నుంచి తరలించి.. క్వారంటైన్లో ఉంచినట్లు వెల్లడించారు. ఇక కరోనా సోకిన 36 మందిలో సైన్యానికి చెందిన వారు 26 మంది కాగా, మిగిలినవారు నిర్వహణ సిబ్బంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరినీ వెనక్కి రప్పించినట్టు సమాచారం. చిలీ సైన్యం అంటార్కిటికాలో శాశ్వత సిబ్బంది పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇది ఉత్తర అంటార్కిటికాలోని ఒక ద్వీపకల్పం కొన దగ్గర ఉంది. చిలీ పటాగోనియాలోని మాగల్లెన్స్లో ఆరోగ్య అధికారులు "కరోనా బారిన పడ్డవారిని ఇప్పటికే ఇక్కడి నుంచి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని.. ఎవరి పరిస్థితి విషమంగా లేదని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంటార్కిటికాకు పర్యాటకుల రాకను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. గత నెల 27న చిలీ నుంచి కొన్ని సామాన్లను అంటార్కిటికాకు చేరవేశారు. ఇక్కడ వైరస్ వెలుగు చూడడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతకంటే ముందు అక్కడి పర్యాటకులకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ అనే తేలింది. అంటార్కిటికాలో చాలా దేశాలు తమ క్యాంపులు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 38 క్యాంపుల్లో 1000మంది వరకు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఇప్పటికే సురక్షితంగా తరలించినట్లు బ్రిటీష్ అంటార్కిటికా సర్వే పరిశోధకులు తెలిపారు. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!) -
కేప్‌టౌన్‌కు ఐస్‌బర్గ్స్ ఉపశమనం..!!
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఏర్పడిన తీవ్ర నీటి కొరతను తగ్గించేందుకు మెరైన్ నిపుణులు ఆ దేశ ప్రభుత్వం ముందు పరిష్కారాన్ని ఉంచారు. అంటార్కిటికా ఖండం నుంచి భారీ మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకువచ్చి, కరువు ప్రాంతాల్లోని నీటి కుంటలు, సరస్సులు, నదుల్లో వాటిని కరిగించాలనేది ప్రతిపాదన. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద కరువుగా కేప్‌టౌన్ కరువును అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే. మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకురావడ తప్ప కరువుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 2015 నుంచి కేప్‌టౌన్‌లో తీవ్రదుర్భిక్షం నెలకొంది. దీంతో ఈ కరువును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కేప్‌టౌన్‌లో ఇప్పటికే నీటిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోతే తాగునీరు పూర్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంది. అనుమతిస్తే అంటార్కిటికా నుంచి మంచు తునకలను త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని కేప్‌టౌన్‌కు తీసుకువస్తామని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నివేదించారు. ఒక భారీ ఐస్‌బర్గ్ ఏడాది పాటు కరుగుతూ రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీటిని ఇస్తుందని పేర్కొన్నారు. -
దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ జపాన్
టోక్యో : దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ జపాన్.. పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఏకంగా 300 నీలి తిమింగలాను వేటాడి, అతిక్రూరంగా చంపింది. అంటార్కిటిక్ మహాసముద్రంలో ఈ ఆపరేషన్‌ను నిర్వహించగా.. ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం జపాన్ ప్రకటించుకుంది. తిమింగలాలపై పరిశోధనల పేరిట గత నవంబర్‌లో మొత్తం ఐదు నావలు దక్షిణమహా సముద్రం నుంచి బయలుదేరాయి. అయితే అది వెళ్లింది పరిశోధనకు కాదని.. వారికి హతమార్చేందుకని ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సమయంలో పలు దేశాలు జపాన్ చేష్టలను తీవ్రంగా ఖండించాయి. మొత్తం 333 తిమింగలాలను హతమార్చి వాటి మృతదేహాలను నావల్లో వేసుకుని వచ్చాయి. శనివారం ఉదయం పశ్చిమ జపాన్‌లోని షిమోనోసెకి పోర్ట్‌కు చేరుకున్నాయి. అయితే తిమింగలాల ప్రవర్తన, జీవశాస్త్రీయ అధ్యయనం కోసమే ఈ ఆపరేషన్ చేపట్టామని జపాన్ ప్రభుత్వం తమ చేష్టలను సమర్థించుకుంటుండగా.. తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమైపోయింది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతీయేటా జరిగే తంతేనని కొట్టిపారేసేవాళ్లు లేకపోలేదు. -
రికార్డు స్థాయిలో పెరిగిన ఓజోన్ రంధ్రం
వాషింగ్టన్: అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ పొరలోని రంధ్రం పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగింది. స్ట్రాటో ఆవరణంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా భూమిని చేరే అవకాశముందని నాసా పేర్కొంది. ఇటీవల ఏర్పడిన ఈ రంధ్రం విస్తీర్ణం ప్రస్తుతం 2.82 కోట్ల చదరపు కి.మీ.కి చేరింది. ఉత్తర అమెరికాపై ఉన్న రంధ్రం కన్నా ఇది పెద్దది. స్ట్రాటో ఆవరణంలో క్లోరిన్, బ్రోమిన్ రసాయనాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది పెరిగిందని అంచనా వేస్తున్నారు. మానవులు తయారుచేసే రసాయనాల వల్ల ఈ క్లోరిన్, బ్రోమిన్ స్థాయి పెరుగుతోంది.