Ozone layer
-
చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త!
'చలిగా ఉండే ఈ సీజన్లో ఎంత వ్యాయామం చేసినా వెంటనే చెమట పట్టనందున ఎంతసేపైనా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు అనేది ఫిట్నెస్ ఫ్రీక్ల ఆసక్తి. అయితే ఈ సీజన్లో ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ తాలూకు ప్రభావం ఉంటుంది. అంతేకాదు.. చలికాలంలో ‘ఇన్వర్షన్’తో పాటు ఈ ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ల ప్రభావంతో ఊపిరితిత్తుల మీదా, ఆ అంశం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలుంటాయి. అందుకే చలిలో చెమట పట్టదనీ, అలసట రాదనీ వ్యాయామాలు చేసేవాళ్లూ, అలాగే చల్లటి వాతావరణంలో హాయిగా ఆరుబయట తిరగాలనుకునే వాళ్లు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్లెవల్ ఓజోన్’ ప్రభావమేమిటో, అది ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది.' రోడ్డు మీద పొగలు చాలా ఎక్కువగా వెలువరుస్తూ వాహనాలు వెళ్లాక.. చాలాసేపటివరకు ఆ పొగ చెదిరిపోదనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆ పొగనుంచి పయనించే వాహనదారులంతా కాసేపు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం కూడా సహజమే. మామూలుగానే ఉండే ఈ పరిస్థితికి తోడు.. శీతకాలంలోని చలివాతావరణంలో ఈ పొగ మరింత ఎక్కువ సేపు అలముకుని ఉంటుంది. ఇందులో పొగమంచూ, కాలుష్యం కలిసిపోయి ఉండటం వల్ల ‘స్మాగ్’ అనే కాలుష్య మేఘం చాలాసేపు కొనసాగుతూ.. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’లనే వాతావరణ అంశాలు ఈ ‘స్మాగ్’ను, దాంతో సమస్యలనూ మరింత తీవ్రతరం చేస్తాయి. ఇన్వర్షన్ అంటే.. మామూలుగా ఎత్తుకుపోయిన కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది తెలిసిందే. ఎత్తులకు వెళ్లినకొద్దీ నిర్ణీతమైన రీతిలో ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని ‘ల్యాప్స్ రేట్’ అని కూడా అంటారు. ఇది వాతావరణ సహజ నియమం. కానీ కొన్నిసార్లు దీనికి వ్యతిరేకమైన ప్రభావం చోటు చేసుకుంటుంది. అంటే.. నేలమీదనే బాగా చల్లగా ఉండి, పైభాగంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది. సహజ వాతావరణ నియమానికి భిన్నంగా ఉండటం వల్లనే.. ఈ ప్రక్రియకు ‘ఇన్వర్షన్’ అని పేరు. కాలుష్యమేఘంతో ఊపిరితిత్తులూ, ఓవరాల్ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఇలా.. ముక్కు ముందుగా ఓ ఏసీ యూనిట్లా పనిచేస్తుంది. అతి చల్లటి గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా తొలుత ముక్కులోకి వెళ్లిన గాలి కాస్తంత వేడిగా మారి, దేహ ఉష్ణోగ్రతకు కాస్త అటు ఇటుగా సమానంగా ఉండేలా మారాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అంత చల్లటిగాలి ఊపిరితిత్తులకు నష్టం చేయకుండా ఉండేందుకే ముక్కు ఈ పనిచేస్తుంది. కానీ గాల్లోని రసాయనాల వల్ల తొలుత ముక్కులోని సున్నితమైన పొరలపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో ముక్కులో మంటగా అనిపిస్తుంది. అలర్జీలూ కనిపిస్తాయి. అటు తర్వాత గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే ట్రాకియా, బ్రాంకియాలో ఇరిటేషన్ రావచ్చు. కాలుష్యాలను ముక్కు చాలావరకు వడపోసినప్పటికీ, కొన్ని లంగ్స్‌లోకి వచ్చేస్తాయి. వాటిని బయటకు పంపేందుకు ఊపిరితిత్తుల్లో మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్ అనే నిర్మాణాలు కొవ్వొత్తి మంటలా కదులుతూ కాలుష్యాలను పైవైపునకు నెడుతుంటాయి. సీలియరీ ఎస్కలేటర్స్ పని మాత్రమే కాకుండా.. అక్కడ కొన్ని స్రావాలు (మ్యూకస్) ఊరుతూ, అవి కూడా కాలుష్యాలను బయటకు నెడుతుంటాయి. సీలియా చుట్టూ ఉండే స్రావాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్స్, తెల్లరక్త కణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్‌లనుంచి మాత్రమే కాకుండా కాలుష్యాల బారి నుంచీ చాలావరకు కాపాడుతుంటాయి. సన్నటి వెంట్రుకల్లాంటి కదులుతూ ఉండే ఈ సీలియాలు అలల్లా వేగంగా కదలడం ద్వారా శ్వాస వ్యవస్థలోకి చేరిన కాలుష్య పదార్థాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియా, ఇతర కణాలను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. ఈ సీలియా సమర్థంగా పనిచేయడానికి వీటి చుట్టూ ఉత్పత్తి అయ్యే మ్యూకస్‌తో శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ (ఫ్లెమ్) తయారవుతూ ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ముక్కు వరకు చేరిన మ్యూకస్ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. కాలుష్యాల వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు గళ్ల/తెమడలా పడటం, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్లగా ఉండటం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ సీజన్లో ఊపిరితిత్తులతో పాటు ఆరోగ్య రక్షణ కోసం చేయాల్సినవి.. కాలుష్యాల నుంచి దూరంగా ఉండాలి. అందుకోసం వీలైనంతవరకు సూర్యుడు బాగా పైకొచ్చి చలి తగ్గే వరకు ఇంట్లోంచి బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు అడ్డుగా మాస్క్ లేదా మఫ్లర్ లేదా పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి. ఈ సీజన్లో వాకింగ్, ఇతర వ్యాయామాలను కాలుష్యం లేని చోట మాత్రమే చేయాలి. లేదా చలికాలంలో కేవలం ఇన్డోర్ వ్యాయామాలకు పరిమితమైతే మేలు. ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థలో భాగంగా సీలియాలు సమర్థంగా పనిచేయడానికి గాలిలో తేమ బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం చలి వాతావరణంలో ఆవిరి పట్టడం మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో స్రావాలు ఎక్కువగా చేరినా, శ్వాసకు ఇబ్బంది అయినా తొలుత ఆవిరిపట్టడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. తెమడ / గళ్ల (స్పుటమ్)ను బయటకు తెచ్చేందుకు దోహదపడే దగ్గును మందులతో అణచకూడదు. మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు క్రమంగా దగ్గును తగ్గించేలా చేసే మందులు వాడాలి. దగ్గుతో పాటు కఫం పడుతున్నప్పుడు.. ఆ కఫం తేలిగ్గా బయట పడేందుకు కఫాన్ని పలచబార్చే మందుల్ని డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఈ చలికాలంలో కాలుష్యాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), ఆస్తమా వంటి మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సమస్యకు అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవల్ ఓజోన్ అంటే.. వాతావరణం పైపొరల్లో ఓజోన్ లేయర్ ఉంటుందనీ, అది ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. భూమి మీదా ఓజోన్ ఉంటుంది. దీన్ని ‘స్మాగ్ ఓజోన్’ లేదా ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ అంటారు. ఇది వాతావరణంలోని కొన్ని వాయువులతో పాటు మరికొన్ని రసాయనాల చర్యల వల్ల ఆవిర్భవిస్తుంది. కొంతమేర సూర్యరశ్మి కూడా ఈ కాలుష్యమేఘం ఆవరించేందుకు దోహదపడుతుంది. ఫలితంగా.. పొగ, మంచు (ఫాగ్ ప్లస్ స్మోక్) కలిసి ఉండే స్మాగ్‌తో పాటు ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్ కూడా కలసిపోతుంది. దీనికి తోడు వాతావరణంలోని నల్లటి నుసి, ధూళి కణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్), పుప్పొడీ.. ఇవన్నీ కలగలసి దట్టమైన కాలుష్య మేఘం ఏర్పడుతుంది. వాతావరణంలోని ఇన్వర్షన్తో ఏర్పడ్డ చల్లదనం కారణంగా ఈ కాలుష్యమేఘం చాలాసేపు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ కాలుష్యంలోంచి ప్రయాణాలు చేసేవారిలో.. తొలుత అక్కడి కాలుష్య రసాయనాలో ముక్కులో ఇరిటేషన్, ఆ తర్వాత ఊపిరి తిత్తులూ దుష్ప్రభావానికి లోనవుతాయి. ముక్కు, శ్వాసమార్గంలో మంట, ఊపిరి తేలిగ్గా అందకపోవడం, శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతులో మంట, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలూ, వృద్ధుల్లో కొంతమేర ప్రాణాపాయం కలిగే అవకాశాలూ లేకపోలేదు. మరికొన్ని సందర్భాల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీయడం లేదా ఆస్తమా ఉన్నవారిలో ఇది అటాక్‌ను ట్రిగ్గర్ చేయడం వంటి అనర్థాలు సంభవిస్తాయి. - డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఇవి చదవండి: మావాడు ఎవరితోనూ కలవడండీ -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్‌కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్‌కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్‌కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్‌టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇతర గ్రహాలపై జీవజాలం.. ఓజోన్ పొర ఆధారం
అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే. ► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. ► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు. ► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు. ► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు. ► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు. ► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు. ► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచానికి ఇదొక శుభవార్త.. ఓజోన్ పొర స్వయం చికిత్స
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తద్వారా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స చేసుకుంటోంది. ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదికలో తెలిపింది. ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని పేర్కొన్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్ ప్రోటోకాల్ నిర్ధేశిస్తోంది. -
హైదరాబాద్ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీలో వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో ‘భూస్థాయి ఓజోన్ (పొగ కారణంగా విడుదలయ్యే వాయువు)’ మోతాదు ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగింది. మూడు నెలల్లో సుమారు 43 రోజులపాటు భూస్థాయి ఓజోన్ మోతాదు పరిమితులు దాటింది. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గత మూడేళ్లుగా వేసవిలో భూస్థాయి ఓజోన్ మోతాదుపై ఆరు నగరాల డేటాను పరిశీలించింది. ఇందులో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా మెట్రో నగరాలు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో గ్రేటర్ సిటీ నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహించిందని పేర్కొంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 మైక్రోగ్రాములుగా నమోదయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... ►అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ►గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. ►ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. కట్టడి ఇలా.. ►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. ►కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్ వల్ల కలి గే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ►కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. ►గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ►పతీ వాహనాని కి ఏటా పొల్యూషన్ చెక్ పరీక్ష లను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. ►ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. -
ఈ గాయం అంత ఈజీగా మానేది కాదు!
World Ozone Day 2021: శరీరానికి తగిలిన గాయం త్వరగా మానిపోతుంది. మనసుకు తగిలిన గాయం కాస్త కష్టంగా మానుతుంది అన్నాడో కవి. కానీ, ప్రకృతికి తగిలే గాయాలు మానిపోవడం అంత ఈజీకాదని చెప్తున్నారు సైంటిస్టులు. భూమిపై కాలుష్యాల్ని తగ్గించే చర్యలెన్ని చేపడుతున్నా.. ఏదో ఒక రూపంలో అది పెరిగిపోతూ వస్తోంది. ఆఖరికి లాక్డౌన్ లాంటి చర్యలు కూడా కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయాయి. ఈ పరిణామాలు భూమికి రక్షణ కవచంగా భావించే ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్: ►సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ పొర(సంరక్షణ) దినోత్సవం ► ఓజోన్ పొర.. భూ ఉపరితలం నుంచి 11-40 కిలోమీటర్ల పైన స్ట్రాటోస్పియర్లో విస్తరించి ఉంది. ► సూర్యుడి నుంచి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు(అల్ట్రావయెలెట్–యూవీ) నేరుగా భూమి మీద పడకుండా కాపాడే రక్షణ కవచం లాంటిది ఓజోన్ పొర. ► ఈ కిరణాల వల్ల స్కిన్ క్యాన్సర్ లక్షల మందికి సోకుతోంది. అంతేకాదు మంచు కరగడం వల్ల ముంపు ముప్పు పొంచి ఉంది. ► అలాంటి ఓజోన్ లేయర్.. దక్షిణ ధృవంలో సాధారణం కంటే ఎక్కువగా దెబ్బతింటోంది. అందుకే రీసెర్చర్లు ఎక్కువగా ఇక్కడి నుంచే పరిశోధనలు, అధ్యయనాలు చేపడుతుంటారు. ► ప్రతీ ఏటా ఆగస్టు-నవంబర్ మధ్య హెమిస్పియర్(న్యూజిలాండ్) దక్షిణ భాగం వద్ద ఓజోన్ పొర దెబ్బతినే స్థాయిని లెక్కగడతారు. ► ఉష్టోగ్రతల ప్రభావం తగ్గాక.. తిరిగి డిసెంబర్లో క్షీణత సాధారణ స్థితిలో కొనసాగుతుంది. ► ఓజోన్ పొరను తీవ్రంగా దెబ్బతీసే క్లోరోఫ్లోరోకార్బన్ రసాయనాలను (ఫ్రిడ్జ్‌లు, విమానాలు, ఏసీల్లో వాడతారు) దాదాపు 197 దేశాలు నిషేధించాయి. ► అయినా అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, పైగా ఇతర కాలుష్య కారకాల వల్ల ఓజోన్ దెబ్బతినడం కొనసాగుతూ వస్తోంది. ► కొపర్నికస్ ఎట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ ప్రకారం.. 1979 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాది(2021) 75 శాతం ఓజోన్ పొర దెబ్బతిందట!. ► ఎంతలా అంటే అంటార్కిటికా ఖండం కంటే వెడల్పైన పొర దెబ్బతిందని సైంటిస్టులు చెప్తున్నారు. ► 1979 తర్వాత ఇంత మొత్తంలో ఓజోన్‌పొర దెబ్బతినడం చూస్తున్నామని సీఏఎంఎస్ డైరెక్టర్ హెన్రీ ప్యూయెచ్ చెప్తున్నారు. ► ఇది ఇంతకు ముందు కంటే 25 శాతం పెరిగిందని చెప్తున్నారు. #ozoneday#Donttouchmyclothes pic.twitter.com/qy7LMzm0sg — Zoologist♀ (@Zoologi35626956) September 15, 2021 ► నిజానికి 2060-70 లోపు ఓజోన్ పొర తిరిగి పూడ్చుకుంటుందని భావించారు. కానీ... ►2020 నాటికి 24 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మందం చిల్లు పడింది. ఇది అమెరికా కంటే మూడు రెట్లు ఎక్కువ. ► ఓజోన్ పొర ఒకే ఏడాదిలో పుంజుకోలేదు. అది మానడానికి చాలా ఏండ్లు పడుతుందని హెన్రీ అంటున్నారు. ► ఓజోన్ పరిరక్షణ దినోత్సవం రోజున పర్యావరణానికి హాని చేసే అంశాల చర్చ.. వాటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. Our survival relies on the ozone layer. On Thursday's #OzoneDay, @UNEP explains why the ozone layer is so important and how we can all #ActNow to help protect it: https://t.co/uU16zDPLQD pic.twitter.com/W9VbWuL59X — United Nations (@UN) September 15, 2021 ► 1994 నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 16ను ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్‌గా గుర్తించింది. 1995లో ప్రపంచ దేశాలు ‘మాంట్రియల్ ప్రోటోకాల్’(ఒప్పందం)ను రూపొందించాయి. ►2021 థీమ్.. ‘మాంట్రియల్ ప్రొటోకాల్- ఆహార భద్రత విషయంలో కూలింగ్ సెక్టార్లపై దృష్టి సారించడం(అదీ పర్యావరణానికి హాని జరగకుండా). -
హైదరాబాద్‌లో ఓజోన్ కమ్మేస్తోంది.. అవస్థలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా అధికమవుతోంది. ఈ విపరిణామంతో నగరవాసులు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటిజన్ల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై వాహనాలు వెదజల్లే పొగలోని ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో తరచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులకు ఊపిరిసలపడంలేదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిశీలనలో తేలింది. చదవండి: విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి ప్రమాణాల మేరకు ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 80–100 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓజోన్‌తో అవస్థలు ఇవే.. ► అస్తమా, బ్రాంకైటిస్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ► ట్రాఫిక్ రద్దీలో వేలాది మంది తరచూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ► గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ► ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతీలో అసౌకర్యం. చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’ ధూళి కాలుష్యం సైతం ► ఓజోన్తోపాటు మోటారు వాహనాల పొగలో ఉన్న సూక్ష్మ, స్థూల ధూళికణాలైన పీఎం10, పీఎం 2.5, ఆర్ఎస్పీఎంలు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ► దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది. ► చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. ► తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి. ► ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. ► ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమేనని నిపుణులు అంటున్నారు. -
గరిష్ట వార్షిక పరిమాణానికి చేరుకున్న ఓజోన్ రంధ్రం
అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం దాని ‘గరిష్ట వార్షిక పరిమాణానికి’ చేరుకుందని ఓజోన్ పొరను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవల సంవత్సరాలలో ఇది అతిపెద్ద, లోతైన వాటిలో ఒకటి అని వారు తెలిపారు. ఓజోన్ పొర భూ ఆవరణలలో ఒకటైన స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఆ కిరణాల నుంచి మానవాళిని ఇతర ప్రాణులను కాపాడుతుంది. ఇండిపెండెంట్.కో. యూకే నివేదిక ప్రకారం, కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) శాస్త్రవేత్తలు ఓజోన్ సాంద్రతలు అంటార్కిటికాపై 20 - 25 కిలోమీటర్ల ఎత్తులో సున్న విలువకు పడిపోయాయని కనుగొన్నారు. ఈ జోన్‌ను ట్రైఆక్సిజన్ అని కూడా పిలుస్తారు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఓజోన్ పొరలో చిన్న రంధ్రం ఏర్పడిందని, అది తరువాత పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. రసాయనాలైన క్లోరో ఫ్లోరో కార్భన్ల( సీఎఫ్‌సీ)పై నిషేధాన్ని అమలు చేయాలని సైంటిస్ట్‌లు 2019లో చాలా బలంగా చెప్పారు. సీఎఫ్‌సీ ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. గత వారం నుంచి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి బాగా పెరగడంతో ఈ ప్రాంతంలో ఓజోన్ క్షీణత ఎక్కువ అయ్యిందని సైంటిస్ట్‌లు తెలిపారు. 2019లో స్వల్ప ఓజోన్ పొర క్షీణతను గుర్తించిన తాము ఈ ఏడాది కొంచెం పెద్ద రంధ్రాన్నే కనుగొన్నామని వారు చెప్పారు. దీనిని ఆపాలంటే మాంట్రియల్ ప్రోటోకాల్‌ను అన్ని దేశాలు తప్పకుండా పాటించాలని సైంటిస్ట్‌లు విజ్ఞప్తి చేశారు. చదవండి: షాకింగ్: ఓజోన్ పొరకు అతిపెద్ద చిల్లు.. -
సమస్త జీవకోటికి రక్షణ కవచం!
ముచ్చటపడి కొనుక్కున్న చొక్కాకు చిల్లు పడితే ప్రాణం విలవిల్లాడుతుంది కదా.. మరి భూగోళంపై కవచంలా ఉంటూ సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్ పొరకు రంధ్రం పడితే బాధపడిన వారెందరు? పర్యావరణ ప్రేమికులు తప్ప ఒక్కరు కూడా ‘అయ్యో..’ అని కూడా అనుండరు.! ఓజోన్ పొర మానవాళికి చేసే మేలు గురించి అవగాహన ఉంటే.. దానికి కీడు తలపెట్టే విధంగా ఎవరూ ప్రవర్తించరు!! నేడు ఓజోన్ పరిరక్షణ దినం.. ఈ సందర్భంగా ఓజోన్ విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, ఒంగోలు: భూమికి రక్షణ కవచంగా ‘ఓజోన్’ను చెప్పుకుంటాం. భూమి నుంచి వెలువడే అతి శక్తివంతమైన, ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలను శోషించుకుని సకల జీవకోటికి రక్షణగా నిలిచేది ‘ఓజోన్’. కాలుష్యం కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర క్రమంగా దెబ్బతింటోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, ప్లాస్టిక్, ఫోమ్, దోమల నాశనం కోసం వాడే కాయిల్స్, జెట్ బిళ్లల లాంటి వాటి వినియోగం వల్ల ఏర్పడే పొగ, డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీ వల్ల ఏర్పడే క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొరను ధ్వంసం చేస్తున్నాయి. స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ అతినీలలోహిత కిరణాలను సంగ్రహించుకుంటోందని, క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల స్ట్రాటోస్పియర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని 1930లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఏటా 20 లక్షల మందికి తగ్గకుండా చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఓజోన్ను రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 16వ తేదీన వరల్డ్ ఓజోన్ డేను నిర్వహించుకుంటున్నాం. ఓజోన్ పొరకు చిల్లు పడిందని, భవిష్యత్తులో ఇది ప్రమాదకారి కావచ్చని 1980లో పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఓజోన్ అంటే ఆక్సిజన్‌కు మరో రూపమే. ఆక్సిజన్‌లో రెండు పరమాణువులు ఉంటే ఓజోన్‌లో మూడు పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు పరమాణువు కలవడం ద్వారా ఓజోన్ తయారవుతుంది. భూమిపైన వాతావరణం నాలుగు పొరలుగా ఉంటుంది. అవి వరుసగా ట్రోపో, స్ట్రాటో, మోజో, ఐనో ఆవరణాలు. వీటిలో ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో మాత్రమే ఉంటుంది. ఇది పది నుంచి 30 మైళ్ల మందంతో, భూమిచుట్టూ ఆవరించి ఉంటుంది. సూర్యకాంతి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు(అల్ట్రావయెలెట్–యూవీ) భూమిపై ప్రసరించకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఓజోన్ను దెబ్బతీస్తున్నవి ఇవే.. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఏసీలు, కాస్మొటిక్స్, స్ప్రేలు, ప్లాస్టిక్ లాంటివి మనం విచ్చలవిడిగా వాడుతున్నాం. వీటిని వినియోగించడం తగ్గిస్తేనే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించటం ద్వారా కూడా మరింత కాలుష్యం తగ్గించవచ్చు. రసాయనాలతోనే ప్రమాదం ఓజోన్ వాయువు పలుచబడటాన్ని ఈ పొరకు రంధ్రంగా పేర్కొంటారు. క్లోరిన్ వాయువు ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీస్తోంది. ఒక్కో క్లోరిన్ పరమాణువు ఓజోన్‌తో లక్షసార్లు చర్య జరిపి ఆక్సిజన్‌ను విడగొడుతోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రధానంగా క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్‌సీ), క్లోరోడైఫ్లోరో మీథేన్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు ఓజోన్ను నాశనం చేస్తున్నాయి. 1995లో ప్రపంచ దేశాలు ‘మాంట్రియల్ ప్రోటోకాల్’(ఒప్పందం)ను రూపొందించాయి. ఈ ప్రోటాకాల్ మీద మొత్తం 140 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ విభాగంతో కలిసి ఓజోన్ సంరక్షణకు కృషి చేస్తామని ప్రతినబూనాయి. 2010 నాటికి ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. కానీ, రసాయనాల వాడకం ప్రణాళికాబద్ధంగా తగ్గించింది అంతంత మాత్రమే. ఇందుకోసం 1994, డిసెంబర్ 19న 49/114 అనే తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 16వ తేదీని ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంగా నిర్వహించాలని ప్రకటించింది. ఓజోన్ పరిరక్షణ ఎలా? గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు, కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించడంతో ఓజోన్ పొరకు ఉన్న చిల్లులు మూసుకుపోయినట్టు ‘నాసా’ ఇటీవల తీసిన ఫొటోల్లో వెల్లడైంది. లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే భారీ పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. వాహనాల రవాణా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొర మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ తయారీని, వినియోగాన్ని నిషేధించాలి. అసవరమైన మేరకే డియోడ్రెంట్లు, రూమ్ ఫ్రెషనర్ స్ప్రేలు వాడాలి. ఏసీల వాడకం భారీగా తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, వస్తువుల కోసం మార్కెట్‌కు వెళ్లే వాళ్లంతా పాలిథిన్ సంచుల స్ధానంలో వస్త్ర సంచులు వినియోగించాలి. ఏసీలు పెద్దగా ఉండనవసరం లేని కార్యాలయాలు, ఇళ్లు నిర్మించే విధంగా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి. రోడ్ల వెడల్పునకు, ఇళ్లకు, పరిశ్రమలకు అడ్డు వస్తున్నాయని చెట్లు నరకడం లాంటి దుశ్చర్యలకు శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి. రక్షణ కోసం వన మహోత్సవం ఓజోన్ పరిరక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయాల సిబ్బంది భాగస్వాములయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ నేతృత్వంలతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ స్థాయిలో ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలకు వలంటీర్ల ద్వారా మొక్కలు పంపిణీ చేయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో స్కూళ్లు, మైదానాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. డిగ్రీ సిలబస్‌లో మొక్కల పెంపకాన్ని ప్రత్యేకంగా అప్రెంటిస్‌షిప్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. -
ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్ పొర
జెనీవా: హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది. -
షాకింగ్: ఓజోన్ పొరకు అతిపెద్ద చిల్లు..
భూ గ్రహ సహజ కవచం ఓజోన్ పొరకు మరో పెద్ద చిల్లు పడినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. భూ ఉత్తరార్థ గోళంలో కనుగొన్న ఈ రంధ్రం... గ్రీన్‌ల్యాండ్ కంటే మూడు రెట్ల అధిక పరిమాణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే ప్రజలపై దుష్పభావం పడుతుందని.. అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ రంధ్రం తొందర్లోనే దానంతట అదే పూడుకుపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తాజాగా జర్నల్ నేచర్‌తో మాట్లాడిన యూరోపియన్ అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. ఇక ఈ విషయం గురించి జర్మన్ గగనతల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న శాస్త్రవేత్త మార్టిన్ డేమ్రీస్ మాట్లాడుతూ..‘‘నా ఉద్దేశం ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పొరలో అతి పెద్ద రంధ్రాన్ని గుర్తించడం ఇదే తొలిసారి’’అని పేర్కొన్నారు. కాగా కాలుష్యం వల్ల ఓజోన్ పొర రోజురోజుకీ పలుచబడుతున్న విషయం తెలిసిందే. దీంతో సాధారణంగా ప్రతీ ఏడాది అంటార్కిటికాపై కాలుష్య మేఘాలు కమ్ముకోవడం వల్ల ఓజోన్‌లో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. దీంతో దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. అయితే ఆర్కిటిక్‌లో మాత్రం ఇలాంటి పరిణామాలు అరుదు. ఈ ఏడాది బలమైన పవనాలు వీచి.. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై మేఘాలు దట్టంగా కమ్ముకున్నందు వల్ల అక్కడ ఇలాంటి అరుదైన విషయం చోటుచేసుకుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం నెమ్మదిగా సూర్య కిరణాల తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ పరిస్థితిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఓజోన్ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా మానవుల్లో చర్మ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. ఇక పంటలు కూడా దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడి వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఆహార లభ్యతకు విఘాతం కలుగుతుంది. అంతేగాకుండా అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. పెంపుడు జంతువులకు కూడా వివిధ క్యాన్సర్లు సోకుతాయి. అన్నీ వెరసి ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు కూడా త్వరగా నశిస్తాయి. ఇక ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి కరోనా ఉద్భవించి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వేళ.. ఇప్పటికైనా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలని ప్రకృతి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కలుషితమైన గాలిని పీలిస్తే..
వాషింగ్టన్: కలుషితమైన గాలిని పీల్చడం ఒబెసిటీ (ఊబకాయం), డయాబెటిస్, జీర్ణాశయాంతర రుగ్మతలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైంది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు సూర్మరశ్మికి గురైనప్పుడు ఓ ప్రమాదకరమైన వాయు కాలుష్య ఓజోన్ వీరు గుర్తించారు. ఈ గాలి, అందులో ఉండే కారకాలు ఊబకాయ వ్యాధికి కారణమవుతాయని వారు పేర్కొన్నారు. (చదవండి: వణికిపోతున్న అమెరికా..) ‘వాయు కాలుష్య కారకాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని గత అధ్యయనాలు వెల్లడించినట్లు మనకు తెలిసిందే’ అని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తాన్యా అల్డిరీట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 88 లక్షల మంది ఈ వాయు కాలుష్య బారిన పడి మృతి చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. శ్వాసకోశ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరిచినప్పటికీ.. వాయు కాలుష్యం రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే ఊబకాయం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది. (మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు) -
రక్షణ కవచాన్ని రక్షించుకుందాం!
-
ప్రమాదంలో పుడమి కవచం
పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ కవచానికి చిల్లు పడింది. ఈ చిల్లు నానాటికీ విస్తరిస్తోంది. కవచానికి ఏర్పడిన ఈ చిల్లులోంచి తీక్షణమైన అతి నీలలోహిత కిరణాలు నేలను తాకుతున్నాయి. వీటి తాకిడి వల్ల మనుషులు చర్మ కేన్సర్ బారిన పడుతున్నారు. సముద్రజీవులు ముప్పు అంచుకు చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోకుంటే, భూమ్మీద ఉన్న సమస్త జీవరాశులకూ ముప్పతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పుడమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ సహజ కవచమే ‘ఓజోన్ పొర’. ఒక ఆక్సిజన్ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ అణువుకు మరో ఆక్సిజన్ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్’ను ‘ట్రైయాక్సిజన్’ అని కూడా అంటారు. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్ పొర మందం మారుతూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటోంది. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, హెడ్రాక్సిల్, క్లోరిన్, బ్రోమిన్ వంటి వాటి వల్ల ఓజోన్ పొర దారుణంగా తరిగిపోతోంది. ఓజోన్ పొర సహజమందాన్ని పోగొట్టుకున్నా, పూర్తిగా నాశనమైనా ఓజోన్ పొరకు చిల్లు పడిందని అంటాం. ధ్రువప్రాంతాల్లో ఓజోన్ పొర పలచబడటం వల్ల సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతానికి మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా, అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, సముద్రాల్లో నీటిమట్టం అమాంతం పెరిగి తీరాలు మునిగిపోతాయి. విపరీతమైన ఇంధన వినియోగం, ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజరేటర్లలో వాడే వాయువులు విపరీత పరిమాణంలో వెలువడుతుండటం వల్ల ఓజోన్ పొరకు చిల్లుపడి, అది నానాటికీ విస్తరిస్తోంది. భూమ్మీద అక్కడక్కడా చెలరేగే కార్చిచ్చులు కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల అమెజాన్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపగలదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీ అనర్థాలు ఓజోన్ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మనుషులకు చర్మ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడుతుంది. గోధుమలు, వరి, బార్లీ వంటి తిండిగింజల పంటలకు, కూరగాయల పంటలకు తీరని నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు కూడా నశించి, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు క్యాన్సర్లకు గురవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు త్వరగా నశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల మనుషుల జీవితం దుర్భరంగా మారుతుంది. ప్రపంచానికి ఊపిరితిత్తుల్లో మంటలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులను ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు. ప్రపంచ జనాభాకు అవసరమైన ఆక్సిజన్‌లో దాదాపు ఇరవై శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే అందుతోంది. ప్రపంచంలోనే అత్యంత దట్టమైన సువిశాలమైన వర్షారణ్యాలు అమెజాన్ అడవులు. ఇవి బ్రెజిల్ సహా తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. గత ఆగస్టులో బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఒక వ్యక్తి దమ్ముకొట్టి, ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేసిన సిగరెట్ పీక కారణంగానే దావానలం వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. వారాల తరబడి రగులుతున్న ఈ కార్చిచ్చును ఆర్పడానికి బ్రెజిల్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించినా, ఇప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు బ్రెజిల్లో 77 వేల కార్చిచ్చు సంఘటనలు జరిగాయి. వాటిని రోజుల వ్యవ«ధిలోనే ఆర్పేశారు. అయితే, ఆగస్టులో చెలరేగిన కార్చిచ్చు మాత్రం ఇప్పటికీ అదుపులోకి రాకపోవడం యావత్ ప్రపంచాన్నే ఆందోళనలో ముంచెత్తుతోంది. అమెజాన్ అడవుల్లో వేలాది ఎకరాల మేరకు వృక్షసంపద మంటలకు ఆహుతవుతోంది. మంటలను చల్లార్చేందుకు బ్రెజిల్ సైనిక విమానాలు గగనతలం నుంచి భారీస్థాయిలో నీటిని గుమ్మరిస్తున్నాయి. అమెజాన్ కార్చిచ్చుపై ఐక్యరాజ్య సమితి సహా వివిధ అంతర్జాతీయ కూటములు, వివిధ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చల్లారని మంటల కారణంగా అమెజాన్ అడవుల్లో ఏ మేరకు విస్తీర్ణంలో చెట్లు నాశనమయ్యాయో కచ్చితంగా తెలియడం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అమెజాన్ కార్చిచ్చును ‘అంతర్జాతీయ సంక్షోభం’గా అభివర్ణించారు. ఈ సమస్య పరిష్కారానికి పారిశ్రామిక దేశాలన్నీ ముందకు రావాలని ఆయన జీ–7 సమావేశాల్లో పిలుపునిచ్చారు. అమెజాన్ కార్చిచ్చును చల్లార్చే ప్రక్రియకు సాయం చేయడానికి జీ–7 దేశాలు సంసిద్ధత వ్యక్తం చేసినా, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో మాత్రం వాటి సాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అమెజాన్ కార్చిచ్చును అడ్డుపెట్టుకుని పారిశ్రామిక దేశాలన్నీ బ్రెజిల్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయాలని భావిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను పర్యావరణాన్ని నాశనం చేయాలనుకోవడం లేదని, బ్రెజిల్‌ను కాపాడుకోవాలనుకుంటున్నానని అన్నారు. అమెజాన్ కార్చిచ్చుపై అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా, ఈ కార్చిచ్చు వల్ల చెలరేగే పొగలు వాతావరణంలోని ఎగువభాగానికి– అంటే స్ట్రాటోస్పియర్ వరకు చేరుకుంటాయని, దీనివల్ల ఓజోన్ పొరకు మరింత ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓజోన్ ఉపయోగాలూ అనర్థాలూ ఓజోన్ పొర సాధారణంగా వాతావరణానికి ఎగువ భాగమైన స్ట్రాటోస్పియర్ వద్ద ఉంటుంది. అది అక్కడ ఉండటమే క్షేమం. అక్కడి నుంచి ఓజోన్ పొర భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు చేరుకోకుండా అడ్డు పడుతుంది. వాతావరణంలోని దిగువభాగమైన స్ట్రాటోస్పియర్లో ఓజోన్ అతి స్వల్పంగా ఉంటుంది. భూమ్మీద పరిసరాల్లో ఆక్సిజన్ 21 శాతం ఉంటుంది. మనం పీల్చేది ఆక్సిజన్ (ఓ2) మాత్రమే. మనుషులతో పాటు సమస్త జీవరాశుల శ్వాసక్రియకు ఓ2 రూపంలో ఉన్న ఆక్సిజన్ మాత్రమే అవసరం. భూమ్మీద పరిసరాల్లో ఓజోన్ అత్యంత స్వల్పస్థాయిలో– అంటే, పది లక్షల భాగాలకు ఒక వంతు (0.0001 శాతం) మాత్రమే ఉంటుంది. శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్‌కు ఎలాంటి వాసనా ఉండదుగాని, ఓజోన్‌కు వాసన ఉంటుంది. ఈ వాసన దాదాపు క్లోరిన్ వాసననుపోలి ఉంటుంది. భూమి పరిసరాల్లోని వాతావరణం దిగువ పొరలో ఓజోన్ పరిమాణం ఎక్కువైతే, దానివల్ల జీవరాశికి మేలు బదులు కీడే ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. మనుషులకు, జంతువులకు శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. ఓజోన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు సజావుగా పండని పరిస్థితులు తలెత్తుతాయి. స్ట్రాటోస్పియర్ వద్ద షార్ట్వేవ్ అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల ఆక్సిజన్ ఓజోన్‌గా పరిణామం చెందుతుంది. భూమికి చేరువలో ఆవరించి ఉన్న వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్పై అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఏర్పడితే, భూవాతావరణానికి చేరువలోనే ఓజోన్ సాంద్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే పర్యావరణానికి చాలా అనర్థాలు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఓజోన్ పొర ఎందుకు అవసరం? అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్లనే ఏర్పడే ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్లో భూమి చుట్టూ ఆవరించి ఉండటం భూమ్మీద మనుగడ సాగించే జీవరాశికి అత్యంత అవసరం. ఓజోన్ పొర సూర్యుడి నుంచి 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యంతో (వేవ్‌లెంగ్త్) వెలువడే అతి నీలలోహిత కిరణాలను సమర్థంగా అడ్డుకోగలదు. ఫలితంగా అతి నీలలోహిత కిరణాల ప్రమాదకర రేడియేషన్ ప్రభావం నుంచి జీవరాశికి రక్షణ ఏర్పడుతుంది. సహజమైన ఈ రక్షణ కొరవడితే మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకే ముప్పు తప్పదు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్ర పరికరాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించడం వల్ల ఓజోన్ పొర ఇప్పటికే దెబ్బతింది. ముఖ్యంగా దక్షిణార్ధగోళంలో ఓజోన్ పొరకు చిల్లుపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపించే ప్రమాదకర రసాయనాల వల్ల ఓజోన్ పొరకు నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు దశాబ్దాల కిందటే తమ పరిశోధనల్లో గుర్తించారు. ఫలితంగా ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 1987లో ప్రపంచంలోని ప్రధాన దేశాలు మాంట్రియల్ ఒడంబడికపై సంతకాలు చేశాయి. ఓజోన్ పొరకు 1 శాతం విఘాతం ఏర్పడితే, భూమ్మీద నివసించే మనుషుల్లో వ్యాపించే క్యాన్సర్లు 2–5 శాతం మేరకు పెరుగుతాయి. క్యాటరాక్ట్ వంటి కంటి సమస్యలు గణనీయంగా పెరగడమే కాకుండా, మనుషుల్లోను, జంతువుల్లోను రోగనిరోధక శక్తి దారుణంగా దెబ్బతింటుంది. భూమ్మీద నివసించే మనుషులకు, పశుపక్ష్యాదులకు, సముద్రాల్లోను, నదుల్లోను జీవించే జలచరాలకు ఆహారాన్ని ఇచ్చే వృక్షజాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఫలితంగా జీవజాతులు క్రమంగా అంతరించిపోయే ప్రమాదం తలెత్తుతుంది. ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటోంది? పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక యంత్రపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రపరికరాలు పనిచేయడానికి రసాయనాలు, ఇంధనం వాడుక కూడా పెరిగింది. అధునాతన యంత్రపరికాలలో వాడే కొన్ని రసాయనాలు ఓజోన్ పొరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాదాపు ఐదుదశాబ్దాల కిందటే ఈ సంగతిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ రసాయనాలన్నింటినీ స్థూలంగా ‘ఓజోన్ డెప్లీటింగ్ సబ్‌స్టన్సెస్’ (ఓడీఎస్) అని పేరు పెట్టారు. ఈ ఓడీఎస్ రసాయనాలలో చాలావరకు రసాయనాలు పర్యావరణానికి నేరుగా ముప్పు కలిగించవు. భూమికి చేరువగా ఉన్న వాతావరణంలో ఇవి ఉన్నంత సేపూ వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇవి భూమిని ఆవరించి ఉన్న తొలి వాతావరణ పొర అయిన ట్రాపోస్పియర్ను దాటుకుని, స్ట్రాటోస్పియర్ను చేరుకున్నప్పుడే, అక్కడ ఓజోన్ పొరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఓజోన్‌తో జరిపే రసాయనిక చర్యల వల్లనే సమస్య తలెత్తుతోంది. ఇవి ఓజోన్ అణువు నుంచి ఒక్కో ఆక్సిజన్ పరమాణువును కాజేస్తాయి. ఫలితంగా ఓజోన్ తన సహజమైన ట్రైయాక్సైడ్ రూపాన్ని కోల్పోయి మామూలు ఆక్సిజన్ (డయాక్సైడ్–ఓ2) రూపంలో మిగులుతుంది. స్ట్రాటోస్పియర్కు చేరిన రసాయనాలు ఓజోన్ నుంచి కాజేసిన ఆక్సిజన్ పరమాణువును కలుపుకొని కొత్తగా రూపాంతరం చెందుతాయి. వీటి ప్రభావంతో ఓజోన్ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిన ప్రదేశంలో ఖాళీ ఏర్పడి, సూర్యుడి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు దూసుకొస్తాయి. క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరోక్లోరో కార్బన్లు, కార్బన్ టెట్రా క్లోరైడ్, బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్లు వంటి రసాయనాలను ఓజోన్ పొరను దెబ్బతీసే ‘ఓడీఎస్’ రసాయనాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల ఓజోన్ పొరకు ఏర్పడే ముప్పును గుర్తించిన తర్వాత వీటిలో ‘హాలోన్స్’గా పిలిచే బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్ల వాడకాన్ని కేవలం అగ్నిమాపక యంత్రాలకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఓజోన్ను దెబ్బతీసే ఇతర రసాయనాలతో పోల్చుకుంటే, హాలోన్స్ పదిరెట్లు ఎక్కువగా ఓజోన్ను దెబ్బతీస్తాయి. భారీ ఎత్తున అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులు చెలరేగిన ప్రాంతాల్లో అనివార్యంగా హాలోన్స్ను ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఓజోన్ పొర దెబ్బతినక తప్పని పరిస్థితులు ఉంటాయి. రెండు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఓజోన్ పొర ఓజోన్ పొర ఇప్పటికే రెండు ప్రాంతాల్లో బాగా దెబ్బతింది. ఆస్ట్రేలియా భూభాగానికి ఎగువన వాతావరణ పరిధిలో ఓజోన్ పొర మందం దాదాపు 5–9 శాతం మేరకు తగ్గింది. దీనివల్ల అక్కడ భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు తగినంత వడబోత లేకుండానే, నేరుగా ప్రసరించే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ ఆరుబయట ఎక్కువసేపు గడిపేవారు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా వద్ద కూడా ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సెప్టెంబర్–నవంబర్ నెలల మధ్య కాలంలో ఓజోన్ పొరకు రంధ్రం మరింతగా విస్తరిస్తోంది. దక్షిణార్ధగోళంలో అక్కడక్కడా సంభవించిన భారీస్థాయి అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా ఈ ప్రాంతంలో ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ వంటి ‘ఓడీఎస్’ రసాయనాల వినియోగం ఓజోన్ పొరకు మనుషుల వల్ల ఏర్పడుతున్న ముప్పు కిందకే వస్తాయి. ఇవి వర్షాలు కురిసినప్పుడు భూమ్మీదకు తిరిగి చేరుకునే పరిస్థితి ఉండదు. భూమ్మీద నుంచి పైకెగసిన ఈ రసాయనాలు స్ట్రాటోస్పియర్ వద్ద దీర్ఘకాలం అలాగే ఉంటాయి. ఓజోన్ పొరకు ఇవి కలిగించే అనర్థం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక క్లోరిన్ పరమాణువు ఏకంగా లక్ష ‘ఓజోన్’ అణువులను దెబ్బతీయగలదు. ఇక బ్రోమిన్ అయితే క్లోరిన్ కంటే 40 రెట్లు ఎక్కువగా హాని చెయ్యగలదు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న ‘ఓడీఎస్’ రసాయనాలలో క్లోరోఫ్లోరో కార్బన్స్ రసాయనాలదే సింహభాగం. ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల్లో వీటి వాటా 80 శాతానికి పైగానే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 1995 సంవత్సరానికి ముందుగా తయారైన రిఫ్రిజిరేటర్లు, ఇళ్లల్లోను, వాహనాల్లోను ఉపయోగించే ఎయిర్ కండిషనర్ల లోను వీటి వాడుక విపరీతంగా ఉండేది. వీటితో పాటు ఆస్పత్రులలో ఉపయోగించే క్లీనింగ్ ఏజెంట్లు, స్టెరిలంట్స్, పరుపులు, కుషన్ల తయారీకి వాడే ఫోమ్, హోమ్ ఇన్సులేషన్ పదార్థాలను తయారు చేసే పరిశ్రమల్లోను క్లోరోఫ్లోరో కార్బన్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ తెచ్చిపెడుతున్న ముప్పును గుర్తించిన తర్వాత వీటి స్థానంలో హైడ్రోఫ్లోరో కార్బన్లు వాడటం మొదలైంది. ఇవి క్లోర్లోఫ్లోరో కార్బన్స్‌తో పోల్చు కుంటే కొంత తక్కువ హానికరమైనవి. ఇవే కాకుండా, భారీ అగ్నిమాపక యంత్రాలలో వాడే హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కోల్డ్ క్లీనింగ్, వేపర్ డీగ్రీజింగ్, కెమికల్ ప్రాసెసింగ్, పరిశ్రమల్లో వాడే జిగురు వంటి పదార్థాల తయారీలో ఉపయోగించే మీథైల్ క్లోరోఫామ్ వంటివి కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఎలా నివారించగలం? ఓజోన్ పొర మరింతగా దెబ్బతినకుండా చూడాలంటే అదంతా మనుషుల చేతుల్లోనే ఉంది. మనుషులు కాస్త మెలకువ తెచ్చుకుని, ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ఓజోన్ పొరను కాపాడుకోవడానికి మనుషులు ముఖ్యంగా తగ్గించుకోవాల్సినవేవంటే... రసాయనిక ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. రసాయన పురుగు మందులకు బదులు సేంద్రియ పురుగు మందులను వాడాలి. పెట్రోలియం ఉత్పత్తుల వాడుకను తగ్గించుకోవాలి. ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలను విచ్చలవిడిగా వాడే బదులు వీలైనంతగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి వెలువడే పొగ ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో రసాయనాలతో తయారైన క్లీనింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. వీటిలో వినియోగించే రసాయనాలు ఓజోన్ పొరకు తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి బదులు పర్యావరణానికి చేటు చెయ్యని క్లీనింగ్ ఉత్పత్తులను వాడుకోవాలి. మాంట్రియల్ ఒడంబడిక తర్వాత దానిపై సంతకాలు చేసిన దేశాలు క్లోరోఫ్లోరో కార్బన్ రసాయనాల వాడుకను గణనీయంగా తగ్గించుకున్నాయి. అయితే, ఈ ఒడంబడికలో ఓజోన్ పొరకు ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్‌ను చేర్చలేదు. నైట్రస్ ఆక్సైడ్ వాడుకను కూడా కట్టడి చేస్తేనే ఓజోన్ పొరను కాపాడుకోగలుగుతాం. -
ఓజోన్ గాయం మానుతోంది
కోల్‌కతా: ఓజోన్‌పొర గాయం మానుతోంది. ఓవైపు వాతావరణ మార్పులతో కలుగుతున్న దుష్ప్రవాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. తాజా పరిశోధనలో సంతోషం కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. దక్షిణ ధ్రువంలో ఓజోన్‌కు పడిన రంధ్రం నెమ్మదిగా పూడుతున్నట్లు శుక్రవారం భారత పరిశోధకులు ప్రకటించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన సెంటర్ ఆఫ్ ఓషియన్, రివర్స్, అట్మాస్పియర్ అండ్ లా సైన్స్ (కొరల్) పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. తొలుత వారు 1979 నుంచి 2017 మధ్య దక్షిణ ధ్రువంలోని ఓజోన్‌కు సంబంధించిన డేటాను తీసుకుని అధ్యయనం చేశారు. ఓజోన్ రంధ్రం 2001 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా రిడెక్షన్ ఆఫ్ ఓజోన్ లాస్ సాచురేషన్ 20 నుంచి 60కి చేరినట్లు వివరించారు. ‘4 దశాబ్దాలుగా ఓజోన్‌లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశాం. ఇందుకు అంటార్కిటికాలోని భారత్‌కు చెందిన మైత్రి స్టేషన్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన స్టేషన్ల నుంచి డేటా సేకరించి విశ్లేషించగా..1998, 2002ల్లో మినహాయించి, ప్రతి ఏడాది శీతలకాలంలో ఓజోన్‌కు అధికంగా తూట్లు పడుతున్నట్లు తేలింది. కాగా, 2001–17 మధ్య ఓజోన్ రంధ్రం కొంతమేరకు పూడుతూ వస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది’అని శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయనారాయణ కుట్టిప్పురత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రభావం చూపుతాయా? అని పరిశోధకుడు ప్రొఫెసర్ పీసీ పాండేను ప్రశ్నించగా.. ఓజోన్ మునుపటిలా సహజస్థితికి రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కాబట్టి ఓజోన్ ఒప్పందాలు రద్దు చేయడం క్షేమం కాదని హెచ్చరించారు. -
ఎర్త్ పెట్టకండి
అనంత విశ్వంలో మన ఆవాసం భూమి. భూమి మీద దాదాపు డెబ్బయిశాతం నీరు. మిగిలిన ముప్పయి శాతం నేల. నీరూ నేలా నిండిన ఈ భూమండలమే సమస్త జీవరాశులకు ఆవాసం. మనిషి కంటే ముందే భూమి మీద చాలా జీవరాశులు ఆవిర్భవించాయి. మనిషి పుట్టక ముందే వాటిలో కొన్ని అంతరించాయి. మనిషి పుట్టిన తర్వాత, ఆధునిక నాగరికత వ్యాపించిన తర్వాత ఇంకొన్ని జీవరాశులు అంతరించాయి. ఇప్పుడు చూసుకుంటే మరిన్ని జీవరాశులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. కన్నూ మిన్నూ కానని మనిషి దూకుడుకు భూమి సహజ స్వభావంలోను, వాతావరణంలోను చాలా మార్పులే వచ్చాయి. భూతాపం గణనీయంగా పెరిగింది. భూమికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు చిల్లు పడింది. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే, చివరకు మనిషి మనుగడకే ముప్పు వాటిల్లగలదు. ఇకనైనా భూమిని కాపాడుకోవడానికి చర్యలు ప్రారంభించడం మంచిది. ఎర్త్‌కు ఎర్త్ పెట్టకుండా ఉంటేనే మంచిది. మితిమీరిన జనాభా, ఇష్టానుసారం సాగుతున్న అడవుల నరికివేత, పట్టణీకరణ, వీటి పర్యవసానంగా తలెత్తిన వాతావరణ కాలుష్యం, పెరిగిన భూతాపం, మంచుఖండాల కరుగుదల, ఎడారుల పెరుగుదల, భూగర్భ జలాల తరుగుదల వంటి నానా సమస్యలు ఇప్పుడు భూమండలాన్ని పట్టి పీడిస్తున్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి భూమి చాలా మార్పులనే చవిచూసింది. సుదీర్ఘ గతం సంగతి వదిలేస్తే, గడచిన యాభయ్యేళ్ల కాలంలోనే భూమిపై అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జనాభా రెట్టింపైంది. జనాభాతో పాటే భూమిని చుట్టుముడుతున్న సమస్యలూ రెట్టింపయ్యాయి. భూతాపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సగటు వర్షపాతాలు తగ్గుతున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. గడచిన యాభయ్యేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కరువు ప్రాంతాల విస్తీర్ణంలో దాదాపు 20 శాతం పెరుగుదల నమోదైంది. భూతాపం ఇదే తీరులో పెరుగుతూ పోతే, 2090 నాటికి కరువు ప్రాంతాల విస్తీర్ణం దాదాపు 40 శాతానికి చేరుకోగలదని బ్రిటన్‌లోని హ్యాడ్లీ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇదివరకే హెచ్చరిక చేశారు. అధిక జనాభా గల దేశాలు మాత్రమే కాదు, అగ్రరాజ్యాలు, యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాలు మితిమీరిన కాలుష్యాన్ని విడుదల చేస్తూ భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి. భూతాపం పెరుగుదల వల్ల 1880 నాటితో పోలిస్తే ప్రస్తుతం ఆర్కిటిక్ ధ్రువప్రాంతంలో మంచు విస్తీర్ణం 13 శాతం మేరకు తగ్గింది. మంచు ఖండాలు కరుగుతుండటంతో సముద్ర మట్టాలు దాదాపు ఏడు అంగుళాల మేరకు పెరిగాయి. ఈ పరిస్థితుల వల్ల రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు వంటివి విజృంభిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం ఎడాపెడా వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు భూసారాన్ని దెబ్బతీయడమే కాకుండా, మనుషుల ఆరోగ్యానికి కూడా ఎసరు పెడుతున్నాయి. భూసార క్షీణత వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత వృత్తులపై ఆధారపడుతున్న దాదాపు 150 కోట్ల మంది జీవనాధారానికే ఇక్కట్లు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా. తరిగిపోతున్న అడవులు నాగరికతలు అభివృద్ధి చెంది జనావాసాలు ఏర్పడినప్పటి నుంచి మనుషులు ఇంధన అవసరాల కోసం, భవన నిర్మాణ అవసరాల కోసం అడవులను నరకడం మొదలైంది. పారిశ్రామికీకరణ మొదలయ్యాక అడవుల నరికివేత మరింత ఎక్కువైంది. ప్రత్యామ్నాయంగా తగినన్ని మొక్కలు నాటకుండా అడవులు నరికేస్తూ పోవడం వల్ల వాటి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల అడవుల్లోని అరుదైన వృక్ష జాతులు, అడవులనే ఆవాసంగా చేసుకుని జీవించే జంతుజాతుల మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే కొన్ని అరుదైన జీవజాతులు కనుమరుగయ్యాయి. మరికొన్ని అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అడవుల నరికివేత వల్ల ప్రపంచంలో చాలా చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, ప్రపంచవ్యాప్తంగా వంటచెరకు కోసం ఇప్పటికీ అడవులపై ఆధారపడుతున్న జనాభా 240 కోట్లకు పైగానే ఉన్నారని, దాదాపు 70 కోట్ల మంది వంట చెరకు సేకరణతోనే మనుగడ సాగిస్తున్నారని అమెరికాకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వెల్లడించింది. ఇంధన అవసరాల కోసం కలపను సేకరించడంపై ఆధారపడే వారి సంఖ్య 2030 నాటికి 90 కోట్లకు చేరుకోగలదని అంచనా వేసింది. నానాటికీ పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చడానికి తగినంతగా ఆహార ఉత్పత్తి కోసం వ్యవసాయ క్షేత్రాల విస్తీర్ణం పెంచుకోవాల్సి వస్తోంది. ఏటా వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరుగుతూ వస్తుంటే, అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటా 60 లక్షల హెక్టార్ల మేరకు అడవులు కనుమరుగైపోతున్నాయి. కనుమరుగవుతున్న అడవుల స్థానంలో మొక్కలు నాటి కొత్తగా అడవులను సృష్టించుకోవాలని అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలన్నీ దశాబ్దాల కిందటే తీర్మానాలు చేశాయి. ఆ తీర్మానాల మేరకు కేవలం పన్నెండు దేశాలు మాత్రమే 1990 సంవత్సరం తర్వాత తమ తమ పరిధిలో అడవుల విస్తీర్ణాన్ని పది శాతానికి పైగా పెంచుకోగలిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల లక్ష్యాలను సాధిస్తూనే అడవుల విస్తీర్ణం పెంచుకున్న ఆ పన్నెండు దేశాలు: అల్జీరియా, చిలీ, చైనా, డోమినికన్ రిపబ్లిక్, గాంబియా, ఇరాన్, మొరాకో, థాయ్‌లాండ్, తునీసియా, టర్కీ, ఉరుగ్వే, వియత్నాం. మిగిలిన దేశాల్లో మాత్రం అడవుల నరికివేత యథావిధిగా కొనసాగుతూనే ఉంది. అడవుల నరికివేత వల్ల ఇవీ అనర్థాలు అడవుల నరికివేత వల్ల అక్కడక్కడా కార్చిచ్చు ప్రమాదాలు జరుగుతున్నాయి. భూమ్మీద ఉండే జంతు, వృక్ష జాతుల్లో దాదాపు 80 శాతం జీవజాతులు అడవుల్లోనే ఉంటాయి. అడవుల నరికివేత వల్ల వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పచ్చదనం లేకపోవడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి, భూతాపం పెరుగుతోంది. గడచిన శతాబ్ద కాలంలో జరిగిన అడవుల నరికివేత వల్ల కర్బన ఉద్గారాల పరిమాణం 15 శాతం మేరకు పెరిగింది. ఇంతేకాదు, ఏటా దాదాపు యాభైవేల వరకు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలో ప్రతి నిమిషానికి 36 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలోని అడవులు కనుమరుగవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో వందేళ్లలో ప్రపంచంలో వర్షారణ్యాలే అంతరించే పరిస్థితి వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మిని అడ్డుకునే భారీ వృక్షాలను నరికేస్తూ పోతే, అటవీ భూముల్లో తేమ నశించి, కొంత కాలానికి అవి ఎడారులుగా మారే ప్రమాదం ఉందని కూడా వారు చెబుతున్నారు. వ్యవసాయ కాలుష్యం భూమ్మీద కాలుష్యానికి దారితీసే అతిపెద్ద కారణం అడవుల నరికివేత అయితే, వ్యవసాయం వల్ల కూడా ఎక్కువ స్థాయిలోనే కాలుష్యం ఏర్పడుతోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల యురేనియం, కాడ్మియం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, క్రోమియం, నికెల్, పాదరసం వంటి ప్రమాదకరమైన పదార్థాలు నేలలోకి చేరుతున్నాయి. వీటిలో కొన్ని పదార్థాలు తిండిగింజల్లోకి చేరుతున్నాయి. అనివార్యంగా వీటిని తింటున్న జనం రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. సాగు కోసం నేలను అతిగా దున్నడం, తవ్వడం వంటి పనుల వల్ల మట్టి కోతకు గురవుతోంది. ఇలాంటి చర్యల వల్ల భూసారం క్షీణిస్తోంది. రసాయనాలతో కలుషితమైన మట్టి వర్షాలు కురిసినప్పుడు నీటిలోకి చేరి, జల కాలుష్యానికి కారణమవుతోంది. సేంద్రియ వ్యవసాయంపై ఇటీవలి కాలంలో కొంత అవగాహన పెరుగుతున్నా, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం మాత్రం తగ్గాల్సినంతగా తగ్గలేదు. వ్యవసాయ రసాయనాల వల్ల మనుషులకు స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు కరువయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. చీడ పీడలను తట్టుకుంటాయని చెబుతూ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న జన్యు మార్పిడి విత్తనాల వల్ల సహజ సిద్ధమైన వృక్ష జాతులకు ముప్పు వాటిల్లుతోందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఎరువులుగా వాడే రసాయనాలలో పోషకాలు ఉంటాయేమో గాని, పురుగు మందులైతే నేరుగా విష పదార్థాలే. పర్యావరణ కాలుష్యంపై ప్రపంచానికి నీతులు చెప్పే అగ్రరాజ్యాలే పురుగు మందుల వాడకంలో ముందంజలో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే పురుగు మందుల్లో 45 శాతం యూరోప్ దేశాలే వాడుతున్నాయి. అమెరికా 25 శాతం పురుగు మందులు వాడుతుండగా, మిగిలిన దేశాలన్నీ కలిపి మరో 25 శాతం మేరకు పురుగు మందులు వాడుతున్నాయి. భారత్ 7.5 శాతం మేరకు మాత్రమే పురుగు మందులు వాడుతోంది. ఇదిలా ఉంటే, పశువుల పెంపకం, కోళ్ల పరిశ్రమల కారణంగా కూడా గణనీయమైన కాలుష్యం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెలువడే కర్బన ఉద్గారాల్లో 18 శాతం కేవలం వీటివల్లనే వెలువడుతున్నట్లు ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక కాలుష్యం ఆధునిక పరిశ్రమలు అభివృద్ధిని వేగవంతం చేసినా, భూమిని కాలుష్యంతో నింపడంలో ఇవి ముందంజలో ఉంటున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్లాస్టిక్ వాడకం, పాలిథిన్ వాడకం మొదలయ్యాయి. మట్టిలో కలవని ఈ పదార్థాల వాడకం ఏమాత్రం తగ్గకపోగా, నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద ఉన్న నేలనే కాదు, మహాసముద్రాలకు సైతం బెడదగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగం ఇదే తీరులో కొనసాగితే, 2026 నాటికి సముద్రాల్లో 1.80 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగా సముద్రంలో జీవించే జలచరాలకు ముప్పు ఏర్పడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగానే ఆస్ట్రేలియా సముద్ర ప్రాంతంలోని పగడపు దీవులు చాలావరకు నాశనమయ్యాయి. కొన్ని అరుదైన జాతుల తాబేళ్లు, చేపలు అంతరించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు వాడుకలో ఉన్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఏటా పోగు పడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9 శాతం వ్యర్థాలను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. మరో 12 శాతం వ్యర్థాలను పర్యావరణానికి తక్కువ హాని కలిగే పద్ధతుల్లో దహనం చేస్తున్నారు. మిగిలిన 79 శాతం వ్యర్థాలు మాత్రం నేలపైనా, సముద్రాల్లోను పోగుపడుతున్నాయి. నేలపై పోగుపడిన ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలను తినడం వల్ల పెద్దసంఖ్యలో మూగజీవాలు మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ సంగతి ఇలా ఉంచితే, ఇక పరిశ్రమలు విడుదల చేసే విషవాయువులు జనావాసాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనసమ్మర్దం గల నగరాల్లో నివసించే ప్రజలు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు నేలలోకి చేరి భూసారాన్ని, భూగర్భ జలాలను, నీటిలోకి చేరి నదులను, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. ఇష్టానుసారం కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలు జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుండటమే కాకుండా, మనుషుల అకాల మరణాలకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు తయారు చేస్తున్న మోటారు వాహనాల వినియోగం ఏటేటా పెరుగుతుండటంతో వాయు కాలుష్యం మరింతగా పెరుగుతోంది. వాయు కాలుష్యం కలిగించే వ్యాధులు వాయు కాలుష్యం వల్ల చిన్నా చితకా శ్వాసకోశ వ్యాధులే కాదు, కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లోని జనం ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), లుకీమియా, న్యుమోనియా, గుండెజబ్బులు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అంతేకాదు, వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుట్టే పిల్లలు రోగనిరోధక శక్తి లోపాలు, ఆటిజం వంటి పుట్టుకతో వచ్చే లోపాలతో బాధపడుతున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతోనూ చేటు ప్లాస్టిక్ తర్వాత ఈ రోజుల్లో భూమ్మీద భారీగా పోగుపడుతున్నవి ఎలక్ట్రానిక్ వ్యర్థాలే. టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటివే కాదు, విద్యుత్తుతో పనిచేసే గృçహోపకరణాలు సైతం పనికి రాకుండా పోతే చెత్తలో పడేస్తున్నారు. నిజానికి కొన్ని పూర్తిగా పనికి రాకుండా పోయినా, కొత్త కొత్త మోడల్స్ వస్తుండటంతో కొత్తవి కొనుగోలు చేసేవారు, పాత వస్తువులను వాడకుండా పడేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతే, వాటిని మరమ్మతులు చేయించడానికి పెట్టే ఖర్చు కంటే కొత్తవి కొనేయడమే మంచిదనే ఉద్దేశంతో చాలామంది ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను కొంటున్నారు. ఫలితంగా పాతబడిన ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యర్థాలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రధానంగా వాడేవి ప్లాస్టిక్, లోహాలు, గాజు వంటి పదార్థాలే. తేలికగా మట్టిలో కలిసిపోని ఈ పదార్థాలు భారీ స్థాయిలో కాలుష్యానికి దారితీస్తున్నాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధికంగా ఆసియా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పోగు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల గాలి, నీరు, నేల కలుషితంగా మారి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, ముఖ్యంగా పిల్లలు వీటి వల్ల ప్రాణాంతక పరిస్థితుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. ఎర్త్ డే ఎందుకంటే..? ఆధునిక పర్యావరణ ఉద్యమం 1970 ఏప్రిల్ 22న అమెరికాలో మొదలైంది. పర్యావరణ ఉద్యమకారులు భూగోళానికి ఎదురవుతున్న సమస్యలపై గొంతెత్తారు. అంతకు ముందు రాచెల్ కార్సన్ 1962లో పర్యావరణ సమస్యలను ప్రస్తావిస్తూ రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకం పర్యావరణ సమస్యలపై ప్రజలు ఆలోచించేలా చేసింది. భూగోళానికి ముప్పు తెచ్చిపెడుతున్న సమస్యలపై ఉద్యమానికి జనం నడుం బిగించే నాటికి ఆ పుస్తకం 24 దేశాల్లో 5 లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది. అదే సమయంలో భూగోళానికి ఎదురవుతున్న సమస్యలపై జనం ఆలోచించేలా చేసేందుకు ఏటా ఒక రోజును ‘ఎర్త్ డే’గా పాటించాలని అప్పటి సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రస్తావించారు. ఆయన ప్రస్తావన మేరకు పర్యావరణ ఉద్యమం మొదలైన ఏప్రిల్ 22వ తేదీనే ‘ఎర్త్ డే’గా నిర్ణయించారు. – పన్యాల జగన్నాథదాసు -
కాలుష్య జాబితాలో ఆ నగరం టాప్..
వాషింగ్టన్: అత్యంత ఓజోన్ కాలుష్యం గల పది అమెరికా నగరాల్లో కాలిఫోర్నియా ఎనిమిదో స్థానంలో ఉందని అమెరికన్ లంగ్ అసోసియేషన్ వార్షిక నివేదిక ‘ స్టేట్ ఆఫ్ ది ఎయిర్’ వెల్లడించింది. ఈ అసోసియేషన్ బుధవారం అత్యంత కాలుష్య నగరాల వివరాలను ప్రకటించింది. ఈ నివేదికలో లాస్ ఏంజలెస్-లాంగ్ బీచ్ ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. 19 ఏళ్లుగా అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రతి ఏటా ‘స్టేట్ ఆఫ్ ది’ పేరుతో కాలుష్య నగరాల నివేదికను వెల్లడిస్తోంది. గత నివేదికతో పోలీస్తే ఈసారి అన్ని రాష్ట్రాల్లో ఓజోన్ కాలుష్యం పెరిగింది. ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 133 మిలియన్ల అమెరికన్లలో ప్రతి 10 మందిలో నలుగురు కలుషిత వాయువును పీల్చుకుంటున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యం, అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా , గుండె జబ్బులు వంటి రోగాలకు గురవుతున్నారని నివేదిక తెలిపింది. ‘మారుతున్న వాతావరణ పరిస్థితులు చూస్తే ఓజోన్ పొర మరింత ప్రమాదంలో ఉంది. ఇప్పటికే అన్ని నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికన్లు ఆరోగ్య సమస్యలకు గురవుతార’ని అసోసియేషన్ అధ్యక్షుడు హెరోల్డ్ పి. విమ్మెర్ తెలిపారు. కాగా వాయుకాలుష్య నివారణకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, అన్ని రాష్ట్రాల్లో కాలుష్యాన్ని తగ్గించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెల్తీ ఎయిర్ క్యాంపెయింగ్ డైరెక్టర్ లిండ్సే మోస్లే అలెగ్జాండర్ పేర్కొన్నారు. -
ఎండకావరం... కన్ను కలవరం!
సమ్మర్ కేర్ కన్ను కండకావరం అన్న మాటను కాస్త ఎండకూ వర్తింపజేద్దాం. అప్పుడది ఎండకావరం అవుతుంది. కంటికి వెలుగు కావల్సిందే. చూపు కోసం కాంతి అవసరమే. కానీ వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కంటికీ కొన్ని సమస్యలు రావచ్చు. రకరకాల రేడియేషన్ల ఉగ్రత వల్ల నేత్రాలకు అనర్థాలు కలగవచ్చు. వాటి నుంచి రక్షణ పొందడం ఎలాగో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం. కాంతి అంటే ఏమిటంటే? మన భూమికి చేరే అనంతమైన రేడియేషన్లలో కేవలం మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ రేడియేషన్స్ అన్నీ... తరంగాల రూపంలో మనకు చేరుతుంటాయి. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా ఎన్నో ఉంటాయి. దీన్నంతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. కాంతి కిరణంలో పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంగ్త్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్లెంగ్త్తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 380 – 780 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్ ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్ ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. యూవీ కిరణాల ప్రభావం ఇలా... సూర్యుడి నుంచి వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్ పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల కంటిపై దుష్ప్రభావాలు రెండు రకాలు. తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్ అనర్థాలు’గా చెప్పవచ్చు. రేడియేషన్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు వచ్చే సమస్యలు ‘క్రానిక్ దుష్ప్రభావాలు’. యూవీ–ఏ దుష్ప్రభావాలు తాత్కాలికమైనవి. యూవీ–బీ వల్ల కలిగే అనర్థాలను వైద్య చికిత్స ద్వారా చక్కదిద్దవచ్చు. యూవీ–సి అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొర నిరోధిస్తుంది. ఈ కాంతి కిరణాలు నేరుగానూ, కొన్ని సందర్భాల్లో కింద నుంచి రిఫ్లక్షన్ చెంది కంటిపై పడుతుంటాయి. మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతుంది. సాధారణంగా కిందివైపుకు ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్ కిరణాలతో ఇలా ప్రభావం పడుతుంది. టోపీ, గొడుగు ధరించినా సరే... రిఫ్లెక్టెడ్ కిరణాల నుంచి రక్షణ ఉండదు. యూవీ దుష్ప్రభావాలు... తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాలు సోకినప్పుడు కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలా సందర్భాల్లో తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. అయితే చాలా సందర్భాల్లో సుదీర్ఘకాలం పాటు యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్లనే అనర్థాలు సంభవిస్తాయి. కంటిపై పడే ఇతర దుష్ప్రభావాలు కనురెప్ప క్యాన్సర్లు: కంటి రెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల కారణంగా కొన్ని తీవ్రమైన అనర్థాలు కనిపించే అవకాశాలున్నాయి. అవి... బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్, స్క్వామోజ్ సెల్ కార్సినోమా క్యాన్సర్, మెలనోమా అనే ఇంకోరకం క్యాన్సర్. కంటిపై ఉండే పొర (కంజెంక్టివా)కు వచ్చే అనర్థాలు: కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో కంటిపై పొర మందంగా, ఒకింత పసుపు రంగు లోకి మారుతుంది. నల్లపొర అంచుల పైకి రెండువైపుల నుంచి ఈ పొర పాకివస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్ ఇన్ ఐ’ అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారి ‘పింగ్వెక్యులా’ రావచ్చు. అలాగే కొంతమందిలో కంటిలో గడ్డలు (ట్యూమర్స్) కూడా కనిపించవచ్చు. కార్నియా పై: కొందరిలో ఫొటోకెరటైటిస్ సమస్య రావచ్చు. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్ వంటివి చేసేవారిలో ఈ ఫొటో కెరటైటిస్ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్ చేసే వారిలో సైతం రిఫ్లెక్షన్ వల్ల పడే కాంతి కిరణాలు వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్నెస్’ అంటారు. రెటీనా పై: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్ బర్న్ అని పేర్కొంటారు. దీనివల్ల కొందరిలో హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. ఇది మనం సాధారణంగా సూర్యగ్రహణం పట్టినప్పుడు, దాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం. ఎవరెవరిలో... అత్యంత కాంతిమంతమైన వాతావరణంలో పనిచేయడం... ఉదాహరణకు డ్రైవర్లు అదేపనిగా అత్యంత ఎక్కువ కాంతిని చూస్తూ ఉండాల్సి వస్తుంది. అలాగే పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు అదేపనిగా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. వీరిలో పైన పేర్కొన్న అనర్థాలు కనిపించే అవకాశం ఎక్కువ. ఇక అత్యంత ఎక్కువ కాంతిని వెలువరిచే నదీప్రాంతాలు, సముద్రజలాలు వంటి చోట్ల సంచరించే వారిలో. కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారిలోనూ. చాలా ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో ఉండేవారిలో. తెల్లని దేహఛాయ (మెలనిన్ తక్కువ) ఉండే వారిలో. సాధారణంగా కంటిలోకి కాంతి ప్రవేశించగానే ఐరిస్/ప్యూపిల్ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోయేలా మన దేహనిర్మాణం ఉంటుంది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మన కన్ను దానికి అడ్జెస్ట్ అయ్యే వరకు మనం కంటిని చికిలించి చూస్తాం. పిల్లల్లో కంటి పాప పెద్దదిగా ఉంటుంది. దాంతో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ. పైగా ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. కాటరాక్ట్ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్ లేని ‘ఇంట్రా ఆక్యులార్ లెన్స్’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్, గర్భనిరోధక మాత్రలు, యాంటీ మలేరియా మందులు వాడే వారితో పాటు, ఇబూప్రొఫేన్ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో కూడా యూవీ దుష్ప్రభావాలు ఎక్కువ. మబ్బులు పట్టినా... వరండాల్లో ఉన్నాసురక్షితం కాదు! మబ్బు పట్టి ఉన్నప్పుడు... అల్ట్రా వయొలెట్ కిరణాలు వడపోతకు గురవుతాయనీ, దాంతో వీటి దుష్ప్రభావం మనపై అంతగా ఉండకపోవచ్చని చాలామంది ఊహిస్తారు. కానీ... అది అంత వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండా లేక బయటి గదుల్లో (ఎండతగిలే గదులు) ఉన్నా దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. అయితే యూవీ–బి తరహా కిరణాలను మన కంటిలోపల ఉండే లెన్స్ చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి దాన్ని సోలార్ బర్న్ రూపంలో దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. యూవీ వల్ల కలిగే అనర్థాలివి... టెరీజియమ్: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున మనకు కాస్తంత పింక్ రంగులో ఉండే కండలాంటి భాగం కనిపిస్తూ ఉంటుంది. ఈ కండ క్రమంగా నల్లగుడ్డును మూసివేసేలా పెరుగుతుంది. దీనివల్ల కనుచూపు పూర్తిగా తగ్గుతుంది. ఇది పట్టపగలు ఆరుబయట పనిచేసే వారిలో కనిపించే సమస్య. అలాగే సముద్రం అలలపై సర్ఫింగ్ చేసేవారిలోనూ టెరీజియమ్ చాలా తరచూగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్ ఐ’ అని కూడా అంటారు. సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉండటం వల్ల వారిలో టెరీజియమ్ ఎక్కువగా వస్తుంది. క్యాటరాక్ట్: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్‌గా పేర్కొంటారు. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే క్యాటరాక్ట్‌లు ఎలాగూ వస్తాయి. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్పోజ్ కావడం వల్ల కాటరాక్ట్ త్వరగా వస్తుంది. దాదాపు 10 శాతం కాటరాక్ట్ కేసులు ఇలా యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్లనే అని పరిశోధనలు చెబుతున్నాయి. మాక్యులార్ డీజనరేషన్: మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థం ఒంట్లోనూ, కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తుంటుంది. ఈ మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థం ఒంటి రంగు నల్లగా ఉండేవారిలో ఎక్కువగానూ, తెల్లటి దేహఛాయ ఉండేవారిలో తక్కువగానూ ఉంటుంది. ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు, రెటీనాలో ఉండే ఎపిధీలియానికీ యూవీ కిరణాలను వడపోసే సామర్థం తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటి చూపు కూడా క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు. వేసవిలో కంటి రక్షణ ఇలా... నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావల నుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కంటిని మరింతగా తెరచుకుని చూడాల్సి వస్తుంది. దాంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే నియమిత ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్ వాడాలి. 100 శాతం లేదా 400 యూవీ ప్రొటెక్షన్ ఇచ్చే లేబుల్డ్ గ్లాసెస్ కూడా వాడవచ్చు. ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట చిన్నఫ్రేమ్ వాటికంటే... ఒకింత పెద్ద ఫ్రేమ్ గ్లాసెస్ వాడడం మంచిది. కొందరు ఏ రంగు గ్లాసెస్ అయితే మేలు... అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది కంటికి పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ అంత సురక్షితమైనవి కావని గ్రహించండి. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే కంటికి రక్షణనిస్తాయి. ఒకింత తెల్లని దేహ ఛాయ ఉన్నవారు చర్మానికి మంచి సన్ స్క్రీన్ లోషన్స్‌ను మూడు గంటలకు ఒకసారి రాసుకుంటూ ఉండాలి. అప్పుడే చర్మాన్ని కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలనుంచి కాపాడుకునే అవకాశం ఉంది. కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్లు తప్పనిసరిగా యూవీ ప్రొటెక్షన్ ఉన్న ఇంట్రా ఆక్యులార్ లెన్స్ (ఐఓఎల్స్)నే ఎంచుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అంచుపెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్) ధరించడం మేలు. ఫొటో కెరటైటిస్ వంటి కండిషన్ ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవిలోనే కాదు, అన్ని కాలాలకూ వర్తిస్తుందని గుర్తుంచుకోండి. మిట్ట మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. వీలైనంత వరకు కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. అలాగే పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. సూర్యగ్రహణం చూడాలనుకునేవారు డాక్టర్లు సిఫార్సు చేసిన ఫిల్టర్ గ్లాసెస్‌నే వాడాలి. తరచూ కంటి పరీక్షలు చేయించుకోండి. వేసవిలో ఒకసారి రొటీన్ కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. అల్ట్రా వయొలెట్... ఇన్ఫ్రా రెడ్లతో కంటికి హాని! మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన కంటికి హాని చేకూరే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి హాని చేసే అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్) ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... యూవీ – ఏ... వేవ్‌లెంగ్త్ 315 – 400 న్యానో మీటర్లు (ఇవి తక్కువ శక్తి కలిగినవి). యూవీ – బీ...æ వేవ్‌లెంగ్త్ 280 – 315 న్యానో మీటర్లు (ఇవి ప్రమాదకరమైనవి). యూవీ – సీ... వీటి వేవ్‌లెంగ్త్ 100 – 280 న్యానో మీటర్లు (ఇవి అత్యంత ప్రమాదకరం). ఇన్ఫ్రా రెడ్ కిరణాలు ఇన్ఫ్రారెడ్ – ఏ వేవ్‌లెంగ్త్ 700 – 1400 న్యానో మీటర్లు ఇన్ఫ్రారెడ్ – బీ వేవ్‌లెంగ్త్ 1400 – 3000 న్యానో మీటర్లు ఇన్ఫ్రారెడ్ – సీ వేవ్‌లెంగ్త్ 3000 న్యానో మీటర్లు నుంచి 1 మిల్లీమీటరు వరకు ఇన్ఫ్రారెడ్ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది. -
రికార్డు స్థాయిలో పెరిగిన ఓజోన్ రంధ్రం
వాషింగ్టన్: అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ పొరలోని రంధ్రం పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగింది. స్ట్రాటో ఆవరణంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా భూమిని చేరే అవకాశముందని నాసా పేర్కొంది. ఇటీవల ఏర్పడిన ఈ రంధ్రం విస్తీర్ణం ప్రస్తుతం 2.82 కోట్ల చదరపు కి.మీ.కి చేరింది. ఉత్తర అమెరికాపై ఉన్న రంధ్రం కన్నా ఇది పెద్దది. స్ట్రాటో ఆవరణంలో క్లోరిన్, బ్రోమిన్ రసాయనాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది పెరిగిందని అంచనా వేస్తున్నారు. మానవులు తయారుచేసే రసాయనాల వల్ల ఈ క్లోరిన్, బ్రోమిన్ స్థాయి పెరుగుతోంది. -
ఓజోన్ పొరను దాటిన కత్తి..
వినీలాకాశంలో అల్లంత ఎత్తులో ఎగురు తూ కనిపిస్తున్న ఈ స్విస్ ఆర్మీ కత్తి.. ఏకంగా ఓజోన్ పొరనే దాటి వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన శామ్యూ ల్ హెస్ అనే 15 ఏళ్ల కుర్రాడు పంపించిన ఈ కత్తి 30 కి.మీ. ఎత్తుకు చేరి.. తర్వాత భూమికి తిరిగి చేరుకుంది. 50 కి.మీ. ఎత్తు వరకూ వెళ్లగల వెదర్ బెలూన్‌కు వేలాడదీసి దీనిని హెస్ పంపాడు. దారి పొడవునా ఈ కత్తిని వీడియో తీసేందుకు ఓ కెమెరాను, జీపీఎస్ పరికరాన్ని, ఓ పారాచూట్‌ను కూడా అమర్చాడు. స్విస్ ఆర్మీ కత్తుల్ని తయారుచేసే విక్టర్ఐనాక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో ఫిబ్రవరి 15న ఈ ప్రయోగం నిర్వహించా డు. గంటన్నర సమయంలోనే ట్రోపోస్పియర్‌ను, దానిపైన స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొరనూ(20-30 కి.మీ. మధ్యలో ఉంటుంది) దాటి 30 కి.మీ. ఎత్తు వరకూ ఇది చేరుకుంది. స్ట్రాటోస్పియర్కు చేరగానే ఊహించినట్లుగా వెదర్ బెలూన్ పగిలిపోయింది. దీంతో పారాచూట్ విచ్చుకుని కత్తి నెమ్మదిగా కిందికి దిగుతూ స్విట్జర్లాండ్ సమీపంలోని దక్షిణ జర్మనీ పట్టణం ఆగ్స్‌బర్గ్ పొలాల్లో పడిందట. -
ఉత్తర ధ్రువంపై రగులుతున్న చిచ్చు
వనరులను దుర్వినియోగపరచే జీవన శైలిని వ్యసనంగా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హానిని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషిలోని స్వీయ విధ్యంసక శక్తి ఉత్తర ధ్రువ ప్రాంతంలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోం ది. మంచు ఖండంగా భ్రమింపజేసే ఆర్కిటిక్ సముద్రం అతి వేగంగా కరిగిపోతున్నా, పెను ఉపద్రవాలు ముంచుకొస్తున్నా పట్టింపు లేకుండా లాభాల వేటలో మునిగిపోవడం ‘మనిషి’కే చెల్లింది. ఐదు మహా సముద్రాల్లోకెల్లా అతి చిన్న సముద్రమైన ఆర్కిటిక్ విస్తీ ర్ణం 54.27 లక్షల చదరపు మైళ్లు. ఏటి పొడవునా గడ్డకట్టి పోయి ఉండే ఏకైక హిమ సము ద్రంలో 2020 నాటికి వేసవిలో మంచన్నదే కనిపించకుండా పోతుంది. 2040 నాటికి సాధారణ జల సముద్రంగా మారిపోతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల అంచనా. ఆర్కిటిక్ కరిగిపోవడం వల్ల సంభవించే ప్రకృ తి వైపరీత్యాల గురించి, అంతరించిపోతున్న జీవరాశి గురించి ఆందోళనే లేకుండా ప్రధాన ప్రపంచ శక్తులన్నీ ఆర్కిటిక్ కరిగి బయటపడే భూభాగాలపై ఆధిపత్యం కోసం పరుగులు తీస్తున్నాయి. అక్కడ ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాల కోసం పోటీకి దిగుతున్నాయి. ఆర్కిటిక్ మరింత వేగంగా కరిగిపోయేలా విధ్వం సాన్ని సృష్టిస్త్నునాయి. తీవ్ర ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్న కారణంగా ప్రపంచ దేశాలు, బహుళజాతి చమురు కంపెనీలు ఆర్కిటిక్పైకి దృష్టిని సారించాయి. మిగతా ప్రపంచం అం తటా ఉన్న ఇంకా గుర్తించని మొత్తం చము రు, సహజవాయు నిక్షేపాల కంటే 25 శాతం ఎక్కువ నిక్షేపాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని శాస్త్రజ్ఞుల అంచనా. రష్యా, కెనడా, అమెరికా, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లు ఆర్కిటిక్ తీర దేశాలు. అయితే రష్యా ప్రధానంగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం వహిస్తోంది. 2007లో రష్యా శాస్త్రజ్ఞుల బృందం తూర్పు ఆర్కిటిక్ సముద్ర ఆంతర్భాగంలోని ‘లామొనొసోవ్ రిడ్జి’ను కనుగొంది. అది రష్యా భూభాగంతో అనుసంధానమై ఉంది. నేటి అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం దానిపై హక్కులు రష్యాకే దఖలు పడాల్సి ఉంటుంది. దీంతో రష్యా ఆ హక్కుల కోసం ఐస్‌ల్యాండ్, కెనడాలతో కయ్యానికి దిగుతోంది. లామొనొసోవ్ రిడ్జిలో ఉన్న సహజవాయువు, చమురు నిక్షేపాలు కనీసం 10,000 కోట్ల టన్నులు! దీంతో రష్యా ప్రిచోరాలో ఎంతటి హిమపాతాలనైనా తట్టుకొనే ఆయిల్ రిగ్ ప్లాట్‌ఫాం ‘ప్రిరాజ్లొమన్య’ను 2012లో నిర్మించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అది అలాంటి మొట్టమొదటి రిగ్ అవుతుంది. ఆర్కిటిక్ అలాస్కా, అమెరాసియా బేసిన్, తూర్పు గ్రీన్‌ల్యాండ్, రిఫ్టీ బేసిన్లలోని 25 భారీ చమురు, సహజవాయు క్షేత్రాలను అమెరికా భూగర్భ సర్వే కనుగొంది. అమెరికా, బ్రిటన్ల చమురు గుత్త సంస్థ ‘షెల్’ ఆర్కిటిక్ హిమసముద్రానికి తూట్లు పొడ వటాన్ని నిరసిస్తూ ‘గ్రీన్ పీస్’ పర్యావరణ కార్యకర్తలు ఆం దోళన సాగిస్తున్నారు. కాలిఫోర్నియా న్యాయస్థానంలో వారి కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో షెల్‌కు అనుకూలంగా తీర్పు రావడమే తర్వాయి, ఇతర చమురు కార్పొరేషన్లు కూడా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అత్యంత సున్నితమైన జీవ పర్యావరణ వ్యవస్థలకు నిలయమైన అర్కిటిక్ ప్రాంతం లో చమురు వెలికితీత కార్యకలాపాలు ఇప్పటికే విషమించిన అక్కడి వాతావరణాన్ని మరింతగా పాడు చేస్తాయని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా నుంచి నైజీరియా వరకు ప్రతి దేశంలోనూ చమురు, వాయు క్షేత్రాలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. భారీ ఎత్తున పచ్చటి పంట చేలు, హరితారణ్యాలు నాశమమైపోతున్నాయి, సముద్రజలాలు కలుషితమై జీవ, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ఆర్కిటిక్ తిమింగ లం వంటి జీవరాశి ముప్పను ఎదుర్కొం టోంది. ఇక ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి కూడా అంతరించిపోతుందని భావిస్తున్నారు. వనరుల దుర్వినియోగ జీవన శైలిని వ్యసనం గా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం ఎంతకైనా బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హాని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్కిటిక్ ఆధిపత్యపు పోరులో తలమునకలై ఉన్న అమెరికా, రష్యా, కెనడా, నార్వే, డెన్మా ర్క్ తదితర దేశాలు విచ్చలవిడిగా చమురు, వాయు బావుల తవ్వకానికి దిగుతున్నాయి. భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిం చాల్సిన వనరులను కూడా కొల్లగొడుతున్నా యి. పైగా భావి తరాల మనుగడకే ముప్పును కలుగజేస్తున్నాయి. అన్నిటికీ మించి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయి. నవనాగరిక సమాజం ఆర్కిటిక్ ఇంధన వనరులపై, ఖనిజసంపదపై ఆధారపడటం తప్పనిసరే అయినా అందుకు మార్గం ఆధిపత్యవా దం, యుద్ధం కారాదు. సమానత్వం, సామరస్యాలపై ఆధారపడిన ఒప్పందాలపై ఆధారపడి శాంతియుతంగా వనరుల పంపకానికి కృషి చేయడం ఉత్తమం. - జయసూర్య సీనియర్ జర్నలిస్టు