ఓజోన్ పొరను దాటిన కత్తి.. | ozone layer pass the knife | Sakshi
Sakshi News home page

ఓజోన్ పొరను దాటిన కత్తి..

Published Mon, Apr 7 2014 5:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

ఓజోన్ పొరను దాటిన కత్తి..

ఓజోన్ పొరను దాటిన కత్తి..

 వినీలాకాశంలో అల్లంత ఎత్తులో ఎగురు తూ కనిపిస్తున్న ఈ స్విస్ ఆర్మీ కత్తి.. ఏకంగా ఓజోన్ పొరనే దాటి వచ్చింది.  స్విట్జర్లాండ్‌కు చెందిన శామ్యూ ల్ హెస్ అనే 15 ఏళ్ల కుర్రాడు పంపించిన ఈ కత్తి 30 కి.మీ. ఎత్తుకు చేరి.. తర్వాత భూమికి తిరిగి చేరుకుంది. 50 కి.మీ. ఎత్తు వరకూ వెళ్లగల వెదర్ బెలూన్‌కు వేలాడదీసి దీనిని హెస్ పంపాడు. దారి పొడవునా ఈ కత్తిని వీడియో తీసేందుకు ఓ కెమెరాను, జీపీఎస్ పరికరాన్ని, ఓ పారాచూట్‌ను కూడా అమర్చాడు.
 
 
 స్విస్ ఆర్మీ కత్తుల్ని తయారుచేసే విక్టర్‌ఐనాక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో ఫిబ్రవరి 15న ఈ ప్రయోగం నిర్వహించా డు. గంటన్నర సమయంలోనే ట్రోపోస్పియర్‌ను, దానిపైన స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్ పొరనూ(20-30 కి.మీ. మధ్యలో ఉంటుంది) దాటి 30 కి.మీ. ఎత్తు వరకూ ఇది చేరుకుంది. స్ట్రాటోస్పియర్‌కు చేరగానే ఊహించినట్లుగా వెదర్ బెలూన్ పగిలిపోయింది. దీంతో పారాచూట్ విచ్చుకుని కత్తి నెమ్మదిగా కిందికి దిగుతూ స్విట్జర్లాండ్ సమీపంలోని దక్షిణ జర్మనీ పట్టణం ఆగ్స్‌బర్గ్ పొలాల్లో పడిందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement