ఓజోన్ పొరను దాటిన కత్తి..
వినీలాకాశంలో అల్లంత ఎత్తులో ఎగురు తూ కనిపిస్తున్న ఈ స్విస్ ఆర్మీ కత్తి.. ఏకంగా ఓజోన్ పొరనే దాటి వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన శామ్యూ ల్ హెస్ అనే 15 ఏళ్ల కుర్రాడు పంపించిన ఈ కత్తి 30 కి.మీ. ఎత్తుకు చేరి.. తర్వాత భూమికి తిరిగి చేరుకుంది. 50 కి.మీ. ఎత్తు వరకూ వెళ్లగల వెదర్ బెలూన్‌కు వేలాడదీసి దీనిని హెస్ పంపాడు. దారి పొడవునా ఈ కత్తిని వీడియో తీసేందుకు ఓ కెమెరాను, జీపీఎస్ పరికరాన్ని, ఓ పారాచూట్‌ను కూడా అమర్చాడు.
స్విస్ ఆర్మీ కత్తుల్ని తయారుచేసే విక్టర్ఐనాక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో ఫిబ్రవరి 15న ఈ ప్రయోగం నిర్వహించా డు. గంటన్నర సమయంలోనే ట్రోపోస్పియర్‌ను, దానిపైన స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొరనూ(20-30 కి.మీ. మధ్యలో ఉంటుంది) దాటి 30 కి.మీ. ఎత్తు వరకూ ఇది చేరుకుంది. స్ట్రాటోస్పియర్కు చేరగానే ఊహించినట్లుగా వెదర్ బెలూన్ పగిలిపోయింది. దీంతో పారాచూట్ విచ్చుకుని కత్తి నెమ్మదిగా కిందికి దిగుతూ స్విట్జర్లాండ్ సమీపంలోని దక్షిణ జర్మనీ పట్టణం ఆగ్స్‌బర్గ్ పొలాల్లో పడిందట.