World Ozone Day 2021: శరీరానికి తగిలిన గాయం త్వరగా మానిపోతుంది. మనసుకు తగిలిన గాయం కాస్త కష్టంగా మానుతుంది అన్నాడో కవి. కానీ, ప్రకృతికి తగిలే గాయాలు మానిపోవడం అంత ఈజీకాదని చెప్తున్నారు సైంటిస్టులు. భూమిపై కాలుష్యాల్ని తగ్గించే చర్యలెన్ని చేపడుతున్నా.. ఏదో ఒక రూపంలో అది పెరిగిపోతూ వస్తోంది. ఆఖరికి లాక్‌డౌన్ లాంటి చర్యలు కూడా కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయాయి. ఈ పరిణామాలు భూమికి రక్షణ కవచంగా భావించే ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
సాక్షి, వెబ్‌డెస్క్: ►సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ పొర(సంరక్షణ) దినోత్సవం
► ఓజోన్ పొర.. భూ ఉపరితలం నుంచి 11-40 కిలోమీటర్ల పైన స్ట్రాటోస్పియర్‌లో విస్తరించి ఉంది.
► సూర్యుడి నుంచి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు(అల్ట్రావయెలెట్–యూవీ) నేరుగా భూమి మీద పడకుండా కాపాడే రక్షణ కవచం లాంటిది ఓజోన్ పొర.
► ఈ కిరణాల వల్ల స్కిన్ క్యాన్సర్ లక్షల మందికి సోకుతోంది. అంతేకాదు మంచు కరగడం వల్ల ముంపు ముప్పు పొంచి ఉంది.
► అలాంటి ఓజోన్ లేయర్.. దక్షిణ ధృవంలో సాధారణం కంటే ఎక్కువగా దెబ్బతింటోంది. అందుకే రీసెర్చర్లు ఎక్కువగా ఇక్కడి నుంచే పరిశోధనలు, అధ్యయనాలు చేపడుతుంటారు.
► ప్రతీ ఏటా ఆగస్టు-నవంబర్ మధ్య హెమిస్పియర్(న్యూజిలాండ్) దక్షిణ భాగం వద్ద ఓజోన్ పొర దెబ్బతినే స్థాయిని లెక్కగడతారు.
► ఉష్టోగ్రతల ప్రభావం తగ్గాక.. తిరిగి డిసెంబర్‌లో క్షీణత సాధారణ స్థితిలో కొనసాగుతుంది.
► ఓజోన్ పొరను తీవ్రంగా దెబ్బతీసే క్లోరోఫ్లోరోకార్బన్ రసాయనాలను (ఫ్రిడ్జ్‌లు, విమానాలు, ఏసీల్లో వాడతారు) దాదాపు 197 దేశాలు నిషేధించాయి.
► అయినా అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, పైగా ఇతర కాలుష్య కారకాల వల్ల ఓజోన్ దెబ్బతినడం కొనసాగుతూ వస్తోంది.
► కొపర్నికస్ ఎట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ ప్రకారం.. 1979 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాది(2021) 75 శాతం ఓజోన్ పొర దెబ్బతిందట!.
► ఎంతలా అంటే అంటార్కిటికా ఖండం కంటే వెడల్పైన పొర దెబ్బతిందని సైంటిస్టులు చెప్తున్నారు.
► 1979 తర్వాత ఇంత మొత్తంలో ఓజోన్‌పొర దెబ్బతినడం చూస్తున్నామని సీఏఎంఎస్ డైరెక్టర్ హెన్రీ ప్యూయెచ్ చెప్తున్నారు.
► ఇది ఇంతకు ముందు కంటే 25 శాతం పెరిగిందని చెప్తున్నారు.
#ozoneday#Donttouchmyclothes pic.twitter.com/qy7LMzm0sg
— Zoologist♀ (@Zoologi35626956) September 15, 2021
► నిజానికి 2060-70 లోపు ఓజోన్ పొర తిరిగి పూడ్చుకుంటుందని భావించారు. కానీ...
►2020 నాటికి 24 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మందం చిల్లు పడింది. ఇది అమెరికా కంటే మూడు రెట్లు ఎక్కువ.
► ఓజోన్ పొర ఒకే ఏడాదిలో పుంజుకోలేదు. అది మానడానికి చాలా ఏండ్లు పడుతుందని హెన్రీ అంటున్నారు.
► ఓజోన్ పరిరక్షణ దినోత్సవం రోజున పర్యావరణానికి హాని చేసే అంశాల చర్చ.. వాటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.
Our survival relies on the ozone layer.
— United Nations (@UN) September 15, 2021
On Thursday's #OzoneDay, @UNEP explains why the ozone layer is so important and how we can all #ActNow to help protect it: https://t.co/uU16zDPLQD pic.twitter.com/W9VbWuL59X
► 1994 నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 16ను ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్‌గా గుర్తించింది. 1995లో ప్రపంచ దేశాలు ‘మాంట్రియల్ ప్రోటోకాల్’(ఒప్పందం)ను రూపొందించాయి.
►2021 థీమ్.. ‘మాంట్రియల్ ప్రొటోకాల్- ఆహార భద్రత విషయంలో కూలింగ్ సెక్టార్‌లపై దృష్టి సారించడం(అదీ పర్యావరణానికి హాని జరగకుండా).
Comments
Please login to add a commentAdd a comment