వాషింగ్టన్ : పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ క్యాంపులపై భారత్ చేసిన మెరుపు దాడులను అమెరికా ఖండించకపోవడం విచారకరమని అమెరికాలో పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ అన్నారు. ఈ కారణంగానే భారత్‌కు మరింత బలం చేకూరిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి ఊతమిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ అమెరికా.. పాకిస్తాన్‌ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన అసద్... ‘భారత దేశ స్థాయిని, శక్తిని పెంచే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది. అందుకే ఢిల్లీ మరింత పటిష్టంగా తయారవడానికి అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. పుల్వామా ఘటన, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రికత్తను తొలగించడంలో అమెరికా కంటే ఇతర ఏ దేశమూ కూడా పెద్దన్న పాత్ర పోషించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాతో తమ దేశానికి మెరుగైన సంబంధాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దౌత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.(మెరుపు దాడులపై స్పందించిన అమెరికా)
కాగా ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ.. భారత్‌తో యుద్ధానికి కాలుదువ్వుతోన్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసే అంశంలో భారత్ పైచేయి సాధించింది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనాలు ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ పాక్‌కు సూచించిన విషయం తెలిసిందే. తాజాగా పుల్వామా ఉగ్రదాడి రూపకర్త జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. అతడి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్ చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. వీటన్నింటితో పాటు...పుల్వామా దాడిలో మసూద్ ప్రమేయానికి సంబంధించి ఆడియో టేపులను భారత్ అందజేయడంతో పాక్‌పై ఒత్తిడి పెరుగుతోంది.(పాక్.. ఉగ్రవాదాన్ని విడనాడాల్సిందే : చైనా, రష్యా)
Comments
Please login to add a commentAdd a comment