ప్రియాంక చోప్రా
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులను కొనియాడుతూ ‘జై హింద్’ అని ట్వీట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై దాయాదీ దేశం ఆగ్రహంగా ఉంది. ఆర్మీ వైద్యులైన డాక్టర్ అశోక్ చోప్రా, మధు చోప్రాల కూతురైన ప్రియాంక కూడా భారత వాయుసేన మెరుపు దాడులను కొనియాడుతూ తన దేశంపై ఉన్న ప్రేమను చాటుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన పాకిస్తానీయులు ఆమెను వెంటనే యునిసెఫ్ ప్రచారకర్తగా తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆన్‌లైన్‌లో ఓ పిటషన్ కూడా దాఖలు చేశారు.
ఇరుదేశాల మధ్య యుద్దాన్ని తలపించే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో శాంతిని కోరుకోవాల్సిన యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక.. ఇలా ఒక దేశానికి మద్దతుగా ఎలా మాట్లాడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో తటస్థంగానన్న ఉండాలి.. కానీ భారత వాయుసేనను యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ కొనియాడుతారని, ఆమె యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా అనర్హురాలన్నారు. ఇక ఈ పిటిషన్ వేల సంతకాలు చేయగా.. దానిలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది భారత జవాన్ల విషయాన్ని ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment