ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మద్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయించిందని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.అంతకుముందు జూలైలో తొలి అమెరికా పర్యటన సందర్భంగా, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశంలో 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నట్లు తెలిపారు. వీరంతా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడారని చెప్పుకొచ్చారు. ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ తమ సరిహద్దుల్లో 40 వేర్వేరు మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ఇమ్రాన్‌ఖాన్ పాలన తమ దేశాన్ని నాశనం చేస్తోందని, పాక్‌ను పాలిస్తున్న నేతల తీరుతో దేశం భ్రష్టు పడుతోందని అహ్మద్‌షా విమర్శించారు. సెస్టెంబర్ 10న జెనీవాలో జరిగిన 42వ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను భూమి మీదే అతిపెద్ద జైలుగా మార్చేశారని ఖురేషీ వ్యాఖ్యానించడమే ఇమ్రాన్ పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చని అహ్మద్ షా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment