పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం షాక్
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊహించని షాకిచ్చింది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక పాక్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అమెరికా.. గట్టి ఝలక్ ఇచ్చింది. ఇంతకుముందు ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపి వేస్తామని అమెరికా పాకిస్తాన్‌కు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఉగ్రవాదంపై పాక్‌ను అంతర్జాతియంగా దోషిగా నిలబెట్టింది అమెరికా.
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను అమెరికా చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. 2016లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలు పాక్‌లో స్వేచ్ఛగా విహరిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ, నిధులు సేకరించాయని అమెరికా నిర్ధారించింది. దీంతో ఉగ్రవాదులకు సేఫ్ హెవెన్స్‌గా భావిస్తున్న ఆప్ఘనిస్తాన్, సోమాలియా, ట్రాన్స్ సహారా, సులవేసీ సీస్ లిట్టోరల్, దక్షిణ ఫిలిప్పైన్స్, ఈజిప్టు, ఇరాక్, లెబనాన్, లిబియా, యెమన్, కొలంబియా, వెనెజువెలా సరసన పాకిస్తాన్‌ను చేర్చినట్లయింది.