లండన్: పార్సిల్స్ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు బయటపడటం లండన్‌లో కలకలం సృష్టించింది. మూడు వేర్వేరు ప్రదేశాల్లో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటనల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఒకటి హీత్రూ విమానాశ్రయం సమీపంలోని గదిలో బయటపడింది. దాన్ని తెరిచిన తరువాత స్వల్పంగా మంటలు వెలువడ్డాయి. ముందస్తు చర్యగా ఆ గదిని ఖాళీచేయించారు. విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు.
మరొక పేలుడు పదార్థాన్ని వేరే విమానాశ్రయంలో, మూడో దాన్ని వాటర్‌లూ అనే రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. మెయిలింగ్ బ్యాగుల్లో బాంబులు బయటపడటంపై ఉగ్ర వ్యతిరేక పోలీసు సిబ్బంది విచారణ జరుపుతున్నారు. పేలుడు పదార్థాలు కలిగిన పార్సిల్స్‌పై ఐర్లాండ్ స్టాంపులు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ఎవరు పంపారు, ఎక్కడి నుంచి పంపించారనే దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి ఐర్లాండ్ పోలీసులు సహకారం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment