parcel bomb
-
దర్బంగా పేలుడు కేసులో కీలక మలుపు
-
పార్సిల్స్ మాటున బాంబులు
లండన్: పార్సిల్స్ ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు బయటపడటం లండన్‌లో కలకలం సృష్టించింది. మూడు వేర్వేరు ప్రదేశాల్లో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటనల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఒకటి హీత్రూ విమానాశ్రయం సమీపంలోని గదిలో బయటపడింది. దాన్ని తెరిచిన తరువాత స్వల్పంగా మంటలు వెలువడ్డాయి. ముందస్తు చర్యగా ఆ గదిని ఖాళీచేయించారు. విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. మరొక పేలుడు పదార్థాన్ని వేరే విమానాశ్రయంలో, మూడో దాన్ని వాటర్లూ అనే రైల్వే స్టేషన్లో గుర్తించారు. మెయిలింగ్ బ్యాగుల్లో బాంబులు బయటపడటంపై ఉగ్ర వ్యతిరేక పోలీసు సిబ్బంది విచారణ జరుపుతున్నారు. పేలుడు పదార్థాలు కలిగిన పార్సిల్స్‌పై ఐర్లాండ్ స్టాంపులు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ఎవరు పంపారు, ఎక్కడి నుంచి పంపించారనే దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి ఐర్లాండ్ పోలీసులు సహకారం అందిస్తున్నారు. -
దారుణానికి ఒడిగట్టింది ఓ లెక్చరర్..
కటక్, ఒడిశా : వివాహ బహుమతిలో బాంబు పెట్టి వరుడి ప్రాణాలను బలిగొన్న కేసులో ఒడిశా పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న బొలన్‌గిరిలో సౌమ్య శేఖర్ సాహూకి రీమా అనే యువతితో వివాహం జరిగింది. వరుడు శేఖర్ సాహూ తల్లి సంజుక్త స్థానిక జ్యోతి బికాశ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కుమారుడి వివాహానికి కొద్దిరోజుల ముందు ఆమెకు ప్రమోషన్ లభించడంతో ప్రిన్సిపాల్ అయ్యారు. దీన్ని ఓర్వలేని ఆమె సహోధ్యాపకుడు పున్‌జీలాల్ మెహర్ ఎలాగైనా సంజుక్త కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నారు. ఈ లోగా తనయుడి వివాహానికి సంజుక్త.. మెహర్‌ను కూడా ఆహ్వానించారు. ఇదే అదునుగా తీసుకున్న మెహర్ వివాహం జరిగిన ఐదో రోజున నవ దంపతులకు బహుమతిని పంపారు. అందులో బాంబు ఉందని తెలీని శేఖర్ సాహూ తన నానమ్మతో కలసి తెరిచాడు. దీంతో బాంబు విస్ఫోటనం చెందడంతో ఇరువురు తీవ్రగాయాలపాలయ్యారు. వారికి చేరువలో ఉన్న వధువు రీమాకు కూడా గాయాలు అయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుడు, అతడి నాయనమ్మ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. వధువు శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు మెహర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతునట్లు పోలీసులు తెలిపారు. -
నేతకు గురిపెడితే..బాడీగార్డ్ బలయ్యాడు..
పట్నా: బీహార్ గయాలో పార్సిల్ బాంబు ద్వారా జేడీయు నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక జేడీయే నేత ఇంట్లో పార్శిల్ బాంబు పేలిన ఘటనలో బాడీగార్డ్ చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జేడీయూ అధ్యక్షుడు జిల్లా నేత అభయ్ కుశ్వాహ్కు గుర్తు తెలియని వ్యక్తులు పార్సిల్‌ను పంపారు. అయితే పార్సిల్‌ను తెరిచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాడీగార్డ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జేడీయూ నేత బంధువును ఆసుపత్రికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ పేలుడుతో మావోయిస్టులకు సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామన్నారు.