ఒక్కోసారి కొన్ని ఫోటోలు వెంటనే చూడగానే అర్థం కావు. ఆ ఫొటోను మరోసారి అంతర్లీనంగా చూస్తేనే కానీ అసలు విషయం అంతుచిక్కదు. తాజాగా అలాంటి ఫోటోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో ఎక్కడ తీశారో తెలియదుగాని నెట్టింట్లో మాత్రం తెగ వైరల్‌గా మారింది. అంతలా ఆకట్టుకోవడానికి ఆ ఫోటోలో ఏముందనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. వలెస్కా అనే వ్యక్తి తన ట్విటర్లో ఒక ఫోటోను షేర్ చేశాడు. సాధారణంగా చూస్తే ఒక పెద్ద కుర్చీలో చిన్న పురుగులాగా కనిపిస్తుంది. అయితే ఫోటోను నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఆ కుర్చీ మీద ఉన్నది పురుగు కాదు.. చిన్న పక్షి అని. గ్రే, బ్లాక్, రెడ్ కలర్ కలగలసిన ఒక చిన్న పక్షి కుర్చీపై ఉంది. పక్షితో పోలిస్తే కుర్చీ నాలుగింతలు పెద్దదిగా కనిపించింది.' సారీ.. ఈ కుర్చీని ఆల్రెడీ ఒకరు బర్తీ చేశారు' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇప్పటికే ఈ ఫోటోను దాదాపు 2.6 మిలియన్ మంది వీక్షించారు. చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
sorry, the seat is occupied pic.twitter.com/IQqz0yawsT
— valeska (@iatemuggles) May 29, 2020
Comments
Please login to add a commentAdd a comment