షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం | Pilot, 4 U.S. tourists killed in Australia plane crash | Sakshi
Sakshi News home page

షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం

Published Tue, Feb 21 2017 7:50 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం - Sakshi

షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఐల్యాండ్‌కు బయల్దేరిన చిన్న విమానం మార్గం మధ్యలో కూలిపోయింది. ఆస్ట్రేలియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఐల్యాండ్‌లో గోల్ఫ్‌ ఆడేందుకు నలుగురు అమెరికన్లు మెల్‌బోర్న్‌ నుంచి చిన్న విమానంలో బయల్దేరారు. కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి ఓ షాపింగ్‌ మాల్‌లోకి దూసుకెళ్లింది.

దీంతో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు అమెరికన్లతో పాటు విమాన పైలట్‌ కూడా దుర్మరణం చెందారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో షాపింగ్‌మాల్‌ మూసేసి ఉంది. దీనిపై స్పందించిన విక్టోరియా అధికారి గత 30 ఏళ్లలో ఇదే భారీ దుర్ఘటనని చెప్పారు. కాగా, ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ల కుటుంబాలకు సమాచారం చేరవేసేందుకు ఆస్ట్రేలియాలోని అమెరికన్‌ ఎంబసీకి అధికారులు పూర్తి సమాచారాన్ని అందించారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని యూఎస్‌ ఎంబసీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement