వాషింగ్టన్: ఫేస్‌బుక్ పేజీలో 45 మిలియన్ లైక్‌లతో భారత ప్రధాని నరేంద్రమోదీ మోస్ట్ పాపులర్ వరల్డ్ లీడర్‌గా నిలిచారు. గ్లోబల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ(బార్సన్‌చాన్& ఓల్ఫే) తాజాగా ‘వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్‌బుక్ ’ పేరుతో గురువారం ర్యాంక్‌లు ప్రకటించింది. పాపులర్ వరల్డ్ లీడర్‌గా మోదీ మొదటి స్ధానంలో నిలవగా ఇంట్రాక్షన్లలో మాత్రం మూడవస్థానంతో సరిపెట్టుకున్నారు. మోదీ తరువాతి స్థానంలో 27 మిలియన్ లైక్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. అయితే ఎక్కువ ఇంట్రాక్షన్లు జరిపిన జాబితాలో మాత్రం ట్రంప్ టాప్‌లో నిలిచారు. వీరి తరువాతి స్థానాన్ని జోర్డాన్ రాణి రాణియా(16.8 మిలియన్ లైక్‌లు)సొంతం చేసుకున్నారు. (వలసల రద్దు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం)
అయితే ట్రంప్ ఫ్రిబవరిలో భారత పర్యటనకు వచ్చే ముందు తాను ఫేస్‌బుక్‌లో నెంబర్1 స్థానంలో ఉండటంపై గొప్పగా చెప్పుకున్నారు. ‘చాలా గర్వంగా ఫీలవుతున్నారు. ట్రంప్ ఫేస్‌బుక్‌లో నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారు. తరువాత స్థానంలో భారత ప్రధాని ఉన్నారు అని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌జుకర్ బర్గ్ ప్రకటించారు. నేను మరో రెండు వారాలో ఇండియాకు వెళ్లబోతున్నాను’ అని ట్వీట్ చేశారు. (ప్రధాని మోదీ సోషల్ మీడియా సన్యాసం!)
గడిచిన సంవత్సర కాలంలో 309 మిలియన్ కామెంట్లు,లైక్‌లు, షేర్లతో ట్రంప్ ఇంటట్రాక్షన్‌లో మొదటిప్లేస్‌లో నిలిచారు. తరువాతి స్థానంలో 205 మిలియన్ సంభాషణలతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నిలిచారు. ఇక భారత ప్రధాని నరేంద్రమోదీకి 84 మిలియన్ ఇంట్రాక్షన్లతో మూడు స్థానం దక్కింది. అయితే ఇంటట్రాక్షన్ రేటు మాత్రం ట్రంప్‌తో (సరాసరి 74,521 ఇంట్రాక్షన్స్ పర్ పబ్లికేషన్) పోలీస్తే మోదీది( 202,633 ఇంట్రాక్షన్స్ పర్ పబ్లికేషన్) మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment