13 వందల కోట్లు దాటిన 'పోకెమాన్ గో' ఆదాయం..!
ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఆటగాళ్ళను అమితంగా ఆకట్టుకున్న 'పోకెమాన్ గో' గేమ్ రెవెన్యూ 13 వందల కోట్ల మార్క్ దాటిపోయింది. గేమ్ ను ప్రారంభించి ఒక్క నెల దాటక ముందే ఆదాయం... వందల కోట్లకు చేరిపోయింది. అయితే గేమ్ పై అనేక ఫిర్యాదులు, అవరోధాలు ఉన్నప్పటికీ ఈ స్టార్ పవర్ ఫీచర్.. భారీ లాభాలను తెచ్చిపెట్టేందుకు దోహదపడింది. ఈ గేమ్ ను ముఖ్యంగా జపాన్ లో ప్రారంభించిన అనంతరం భారీ లాభాలను లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
పోకెమాన్ గో గేమ్ కు ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఏర్పడుతున్నా వినియోగదారుల్లో ప్రతికూల ప్రభావం తోడవ్వడంతో గేమ్.. లాభాల బాటలో నడుస్తోంది. యాప్ అనలటిక్స్ ప్లాట్ ఫాం సెన్సార్ టవర్ అంచనాలను బట్టి గేమ్.. ఆటగాళ్ళ ఆధారంగా 200 మిలియన్ డాలర్లు అంటే సుమారు 13,34,90,00,000 కోట్ల రూపాయల.. నికర ఆదాయం పొందగల్గినట్లు తెలుస్తోంది. మిగిలిన యాప్ ఆధారిత గేమ్స్ తో పోలిస్తే ఈ సంవత్సరం పోకెమాన్ కు అత్యంత ఆదరణ లభించడంతోపాటు.. దాదాపుగా రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చినట్లు నివేదికలు చెప్తున్నాయి. అంతకు ముందు ఎంతో ఆకర్షించిన కాండీ క్రష్ సోడా సాగా వంటి గేమ్స్ తో పోలిస్తే నాలుగు రెట్లు అధిక లాభాలను పొందినట్లు అంచనాలను బట్టి తెలుస్తోంది. జూలై మధ్యలో జపాన్ లో గేమ్ ప్రారంభించిన అనంతరం లాభాలు అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు డేటా సెన్సార్ టవర్ ఆధారంగా తెలుస్తోంది. ఆన్ లైన్ గేమ్ పోకెమాన్ కు జపాన్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీనికి తోడు ఆసియాలోని మరో 15 దేశాల్లో కూడా ఆటకు అమితమైన ఆదరణ లభించడం రెవెన్యూ రెట్టింపయ్యేందుకు దోహదపడింది.
స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా ఆడే పోకెమాన్ గో.. జీపీఎస్ ఆధారంగా ఆడాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే దగ్గరలో ఉన్న పోకెమాన్ లను చూపించడంతో వాటిని పోకే బాల్ ద్వారా కొట్టి సొంతం చేసుకోవడమే పోకె మాన్ గో ఆట విధానం. మొదట్లో అమెరికాలో విడుదల చేసిన రెండు వారాల్లోనే అద్భుత విజయాన్ని సాధించిన పోకెమాన్ గో.. ఇప్పుడు అనేక దేశాల్లో విడుదలవ్వడంతో పాటు.. లాభాల మార్కెట్లో దూసుకుపోతోంది.