'అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు' | Police respond to domestic violence call, discover opera singer | Sakshi
Sakshi News home page

'అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు'

Published Thu, Jan 28 2016 12:35 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

'అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు' - Sakshi

'అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు'

ఆమ్స్టర్డ్యామ్: కొందరు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ తెగపాడేస్తుంటారు. కొంతమంది పాడుతుంటే వినేవాళ్లకు కర్ణకఠోరంగా ఉంటుందనేది వాస్తవం. అయితే తమ గాత్ర మాధుర్యం ఎంత అసహ్యంగా ఉంటుందనేది ఆ పాడేవారికి తెలియదు. నెదర్లాండ్స్లో ఇలాంటి ఓ వ్యక్తి గొంతు విన్న ఇరుగుపొరుగు వారు ఏకంగా ఇంట్లో గృహహింస జరుగుతోందని భావించి పోలీసులకు ఫోన్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్ వాసులకు మంగళవారం రాత్రి ఓ భయంకరమైన గొంతు వినిపించింది. ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయా అని గమనించిన వారు ఓ ఫ్లాట్లో నుండి వస్తున్నట్లు గుర్తించారు. అంతే.. అక్కడ గృహహింస జరుగుతున్నట్లు భావించి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలివారు ఎంతకీ ఫ్లాట్ డోర్ తీయకపోవటంతో.. డోర్ బద్దలు కొట్టి మరీ లోపలకు ప్రవేశించి అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వ్యక్తి ఓ రేంజ్లో పాటలు పాడుతూ కనిపించాడు.

పోలీసులు లోపలికి వచ్చింది కూడా గమనించకుండా ఆ గానామృతం కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు పోలీసులు కనిపించడంతో ఏం జరిగిందో తెలుసుకున్న ఆ వ్యక్తి తన గాన మాధుర్యానికి లోలోపల నవ్వుకున్నాడు. ఆ వ్యక్తిపై ఇంతకు ముందు ఎలాంటి ఫిర్యాదులు, కేసులూ లేవు. ఇరుగుపొరుగులు ఇచ్చిన సమాచారంతో హంగామా సృష్టించిన పోలీసులూ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తలుపులు విరగ్గొట్టి మరీ పాటలు పాడుకుంటున్న వ్యక్తిని పట్టుకున్నందుకు కొద్దిసేపు నవ్వుకుని ..వెనుదిరిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement