సూర్యుడిని చూసొద్దామా..?
ఏంటి.. ఇది కుదిరే పనేనా అని అనుకుంటున్నారా? కాస్త ఖర్చుపెడితే కుదురుతుంది. సూర్యుడి దగ్గరకు వెళ్లడం సాధ్యంకాదు కానీ, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాటు చేసిన సోలారియం వద్దకు వెళితే సూర్యుడిని చూసేయొచ్చు. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ.. సూర్యుడిని తీసిన వేలాది చిత్రాలను నాసా క్రోడీకరించి ఓ వీడియో రూపొందించింది. దానిని మేరీల్యాండ్‌లోని నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని సందర్శకుల కేంద్రంలో ప్రదర్శిస్తోంది. అక్కడకు వెళితే మనం మాడి మసైపోకుండానే సూర్యుడు ఎలా పనిచేస్తాడో అత్యంత దగ్గర నుంచి పరిశీలించిన అనుభూతి కలుగుతుంది.