ఇక డెంగ్యూ మహమ్మారి ఆటకట్టించనున్నారు. దీని ద్వారా మానవ శరీరంలో జరిగే వినాశనాన్ని సమర్థవంతంగా అడ్డుకోగల ప్రతి రక్షకాలను సింగపూర్ చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఒక్క నిమిషంలోనే డెంగ్యూ వైరస్ను చలనం లేకుండా చేసి కట్టిపడేస్తాయని చెప్తున్నారు. సాధరణంగా డెంగ్యూకు ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించబడిన లైసెన్స్ ఉన్న మెడిసినే లేదు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి 50 ఏళ్లవగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30కంటే ఎక్కువసార్లు విజృంభించింది.
దీనివల్ల తీవ్రమైన, రాషెష్తోపాటు తీవ్రమైన జాయింట్ పెయిన్స్, రక్తస్రావం, షాక్కు గురికావడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా .. సింగపూర్లోని డ్యూక్ నాస్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్కు చెందినవారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించారు. 200 మంది నుంచి 5 జే7 అనే ప్రతిరక్షకాలను తీసుకుని వాటిద్వారా డెంగ్యూ వైరస్పై ప్రయోగించి చూశారు. 10-9 గ్రాముల 5జే7 ప్రతిరక్షకాలతోనే డెంగ్యూ వైరస్ నాశనమైనట్లు తెలిపారు.
డెంగ్యూకు చెక్!
Published Sun, Feb 22 2015 4:38 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement