antibody
-
మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంగీకరించారు. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. -
Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్‌తో ఇక థర్డ్ వేవ్ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్‌తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకొని, కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్‌తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం. థర్డ్ వేవ్ వస్తుందా ? ఒమిక్రాన్ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఒమిక్రాన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా ? ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్‌ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒమిక్రాన్ ఎంత ఆందోళనకరం ? వైరస్‌లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్ఫెక్షన్లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్‌ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. కరోనా వైరస్ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్ బలహీన పడుతుంది. ఒమిక్రాన్ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వ్యక్తిలో కోవాగ్జిన్ సింగిల్ డోస్‌తో యాంటీబాడీ స్పందన(రెస్పాన్స్) కనిపిస్తుందని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. ఈ రెస్పాన్స్ ఒక్కసారి కూడా వ్యాధి సోకని, టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో వచ్చే యాంటీబాడీ రెస్పాన్స్‌కు సమానంగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. అధ్యయన వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురించారు. పరిశీలించిన అంశాలను బట్టి ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వారికి బీబీవీ152(కోవాగ్జిన్)సింగిల్‌డోస్ టీకా సరిపోతుందని భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. తాజా అధ్యయనంలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లనుంచి కొందరిని ఎంపిక చేసుకొని వారిలో డే జీరో(టీకా ఇచ్చే రోజు), 28 వరోజు, 56వరోజు యాంటీబాడీ రెస్పాన్స్‌ను నమోదు చేశారు. అంతకుముందు కోవిడ్ లేని వ్యక్తుల్లో టీకా వల్ల వచ్చిన యాంటీబాడీ స్పందనను, కోవిడ్ సోకి తగ్గిన అనంతరం సింగిల్ డోస్ తీసుకున్నవారిలో వచ్చిన యాంటీబాడీ స్పందనను మదింపు చేశారు. రెండు కేసుల్లో యాంటీబాడీ రెస్పాన్స్ దాదాపు సమానంగా ఉన్నట్లు గమనించారు. చదవండి: రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు -
యాంటీబాడీలు అందరిలో ఒకేలా ఉండవు
సింగపూర్: కరోనా వైరస్‌పై పోరాడే యాంటీ బాడీలు కొందరిలో దశాబ్దం పాటు ఉండవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ పని చేసే తీరుని బట్టి యాంటీ బాడీలు ఎన్నాళ్లు శరీరంలో ఉంటాయో ఆధారపడి ఉంటుందని లాన్సెట్ మైక్రోబ్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (ఎన్ఏబీ) తక్కువ స్థాయిలో ఉత్పత్తి అయినప్పటికీ టీ సెల్స్ , రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నప్పడు వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయినట్టుగా నివేదిక స్పష్టం చేసింది. సింగపూర్‌లోని డ్యూక్–ఎన్‌యూఎస్ మెడికల్ స్కూలుకి చెందిన శాస్త్రవేత్తలు ఆరు నుంచి తొమ్మిది నెలలు పాటు 164 మంది కోవిడ్ రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారిలో కరోనా వైరస్‌పై పోరాటంలో ఎన్ఏబీ, టీ సెల్స్, రోగ నిరోధక వ్యవస్థ పని తీరు వంటివన్నీ అంచనా వేస్తూ వచ్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారిని అయిదు కేటగిరీలుగా విభజించారు. యాంటీ బాడీలు అసలు ఉత్పత్తి కాని వారు 11.6శాత మంది ఉంటే, యాంటీ బాడీలు ఉత్పత్తి అయినప్పటికీ అవి త్వరగా క్షీణించిన వారి శాతం 26.8గా ఉంది. 29 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు నెమ్మదిగా క్షీణించడం కనిపించింది. ఇక 1.8శాతం మందిలో యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని డ్యూక్ వర్సిటీ ప్రొఫెసర్ లిన్ఫా వెల్లడించారు. -
ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకి, తగ్గిపోయినట్లు సెరోలాజికల్ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఒక నివేదిక సమర్పించింది. ఢిల్లీలో నాలుగో దశ సెరోలాజికల్ సర్వేలో భాగంగా తాజాగా 15,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతి నలుగురిలో ఒకరి శరీరంలో యాంటీ బాడీలు(ప్రతి రక్షకాలు) ఉన్నట్లు తేలింది. అంటే వీరంతా కరోనాకు గురై కోలుకున్నవారే. సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.1 మందిలో, అక్టోబర్ మూడో వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.5 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఢిల్లీ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 80% బెడ్లు కోవిడ్ బాధితులకే! ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యంపై బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ధర్మాసనం సూచించింది. 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కోవిడ్–19 రోగులకు కేటాయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కరోనా బాధితులకు రిజర్వ్ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 8,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది కోవిడ్ కారణంగా మృతిచెందారు. -
ప్రజల్లో తగ్గుతోన్న కరోనా ‘యాంటీ బాడీస్’
ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన వారు ప్రాణాలతో బయట పడాలంటే వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ‘యాంటీ బాడీస్ (రోగ నిరోధక శక్తి)’ శరీరంలో పెంచుకోవడం ఒక్కటే మార్గమని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు మొదటి నుంచి చెబుతున్న విషయం తెల్సిందే. ఎందుకంటే కరోనా చికిత్సకు సరైన మందు ఇంతవరకు లేకపోవడమే. రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో సహజ సిద్ధంగా అంటే ఆరోగ్యకరమై ఆహారంతోపాటు శారీరక వ్యాయామం చేయడం మరో మార్గమని కూడా వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. కొందరిలో సహజ సిద్ధంగానే రోగ నిరోధక శక్తి ఉంటుంది. (డిసెంబర్లో కరోనా వ్యాక్సిన్) అయితే ఈ రోగ నిరోధక శక్తి బ్రిటీష్ ప్రజల్లో క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లం అవడం ఆందోళనకరమైన విషయం. కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి కూడా ప్రజల్లో అదే శాతంలో లేదా అంతకన్నా ఎక్కువ మందిలో పెరగుతూ రావాలి. కానీ అందుకు విరుద్ధంగా తగ్గడం బ్రిటీష్ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీస్‌కు సంబంధించి గత జూన్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో బ్రిటన్ జనాభాలో ఆరు శాతం జనాభాలో యాంటీ బాడీస్ ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్ నెల నాటికి యాంటీ బాడీస్ కలిగిన వారి సంఖ్య 4.4 శాతానికి పడిపోయిందని తేలింది. దేశంలోని మొత్తం జనాభాకుగాను దేశ నలుమూలల నుంచి 3,65,000 మంది శాంపిళ్లను సేకరించడం ద్వారా ‘రియాక్ట్ 2’ పేరిట పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. (సెకండ్ వేవ్ మొదలైంది.. మళ్లీ లాక్డౌన్) ప్రజల్లో యాంటీ బాడీస్ తగ్గిపోవడం అంటే వారిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోవడం కనుక ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందడం సహజమే. కొన్ని సందర్భాంలో ప్రజల్లో యాంటీ బాడీస్ పడి పోవడం కూడా సాధారణమేనని, మెమోరీ సెల్స్‌గా పిలిచే బీ సెల్స్ పడి పోకూడదని, తాము జరిపిన పరిశోధనల్లో బీ సెల్స్ పడిపోయాయా లేదా అన్న అంశాన్ని పరిశోధించలేదని, ఈ కారణంగా యాండీ బాడీస్ పడి పోవడం పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. వ్యాక్సిన్ల వల్ల కూడా యాండీ బాడీస్ పెరగుతాయని వారు చెప్పారు. (భారత్‌లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అప్పుడే!) -
ఈ యాంటీబాడీలతో కరోనా వైరస్ ఫట్!
బెర్లిన్: కరోనా వైరస్‌పై అత్యధిక సామర్థ్యంతో పనిచేయగల యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ యాంటీబాడీలతో కోవిడ్ వైరస్ నియంత్రణకు పరోక్ష టీకాను తయారు చేయవచ్చునని అంచనా. ప్రస్తుతం వేర్వేరు కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీకా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించిన యాంటీబాడీల ద్వారా తయారయ్యే టీకా నేరుగా శరీరంలోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటుంది. ‘సెల్’జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం కొన్ని కరోనా వైరస్ యాంటీబాడీలు వేర్వేరు అవయవాల తాలూకూ కణజాలానికి అతుక్కుపోతాయి. ఫలితంగా అనవసరమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ శాస్త్రవేత్తలు సుమారు 600 యాంటీబాడీలను రోగుల నుంచి సేకరించి పరిశోధనలు చేపట్టా్టరు. వీటిల్లో వైరస్‌కు బాగా అతుక్కుపోగల వాటిని కొన్నింటిని గుర్తించారు. పోషక ద్రావణాల సాయంతో ఈ యాంటీబాడీలను కృత్రిమంగా వృద్ధి చేసి ప్రయోగించినప్పుడు వైరస్ కణంలోకి ప్రవేశించడం అసాధ్యంగా మారుతుందని తెలిసింది. దీంతోపాటు వైరస్ నకళ్లు ఏర్పరచుకోవడం కూడా వీలు కాదు. యాంటీబాడీలు వైరస్‌ను గుర్తిస్తున్న కారణంగా రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు కూడా వీటిపై దాడి చేసేందుకు వీలేర్పడుతుంది. జంతు ప్రయోగాల్లో ఈ యాంటీబాడీలు బాగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఇవి చికిత్స, రక్షణలు రెండింటికీ ఉపయోగించవచ్చునని వివరించారు. -
కరోనా వైరస్.. వచ్చివెళ్లింది ఎందరికి..?
-
కోవిడ్-19 : ఇక ఇంట్లోనే పరీక్షలు
లండన్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి రావడంతో నిమిషాల్లోనే ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్ టెస్ట్‌లను లక్షల సంఖ్యలో చేపట్టాలని బ్రిటన్ యోచిస్తోంది. వ్యక్తి వేలి నుంచి రక్తాన్ని సేకరించి తక్షణమే ఫలితాలను వెల్లడించే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలపై గోప్యంగా నిర్వహించిన ట్రయల్స్ విజవంతమయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ల్యాబ్‌లతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన హోమ్ టెస్ట్‌ల్లో కేవలం 20 నిమిషాల్లోనే ప్రాణాంతక వైరస్ వ్యక్తికి సోకిందా అనేది తెలిసిపోతుంది. జూన్‌లో నిర్వహించిన మానవ పరీక్షల ఫలితాల్లో ఇది 98.6 కచ్చితత్వం సాధించిందని తేలినట్టు ది డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఈ ర్యాపిడ్ టెస్ట్ అద్భుతమని, దీన్ని ఇంట్లోనే మనం చేయవచ్చని బ్రిటన్ ప్రభుత్వ యాంటీబాడీ పరీక్షల కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ రీజియస్ ప్రొఫెసర్ (మెడిసిన్) జాన్ బెల్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు అనుమానితుల రక్త నమూనాలను పంపడం వాటిని విశ్లేషించి ల్యాబ్‌లు ఫలితం వెల్లడించే యాంటీబాడీ పరీక్షలకే బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రక్రియ రోజుల తరబడి సాగుతుండటంతో తక్షణం ఫలితాలను వెల్లడించే ర్యాపిడ్ టెస్ట్‌లవైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ర్యాపిడ్ టెస్ట్‌లకు త్వరలో బ్రిటన్ ఆమోదముద్ర వేస్తుందనే ప్రచారంతో పెద్దసంఖ్యలో ఈ తరహా మెషీన్లను ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేపట్టారని టెలిగ్రాఫ్ తెలిపింది. కోవిడ్-19ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ స్ధాయిలను యాంటీబాడీ టెస్ట్‌లు వెల్లడిస్తాయి. అయితే కరోనా వైరస్ యాంటీబాడీలు ఈ వ్యాధి నుంచి భవిష్యత్‌లోనూ వ్యక్తికి ఇమ్యూనిటీని అందిస్తాయా అనేదానిపై స్పష్టత లేదు. చదవండి : తోపుడు బండిపై శవాన్ని తోసుకెళ్లిన భార్య.. ఇక ఈ ఏడాది చివరినాటికి బ్రిటన్ అంతటా మాస్ స్ర్కీనింగ్ కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్ డయాగ్నస్టిక్ కంపెనీల భాగస్వామ్యంతో కూడిన యూకే ర్యాపిడ్ టెస్ట్ కన్సార్షియం (యూకే-ఆర్టీసీ) నూతన యాంటీబాడీ టెస్ట్‌లను అభివృద్ధి చేశాయి. గత వారం ఉల్ట్సర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 300 మందిపై నిర్వహించిన పరీక్షలో నూతన యాంటీబాడీ టెస్ట్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని యూకే-ఆర్టీసీకి చెందిన డాక్టర్ క్రిస్ హ్యాండ్ వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలు 98.6 శాతం కచ్చితత్వం సాధించడం శుభవార్తేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది పాటు సాగే ఈ ప్రక్రియను తాము రాత్రింబవళ్లు పనిచేసి 13 వారాల్లోనే సాధించామని తెలిపారు. ప్రజలు ఇంటి నుంచే ఈ పరీక్షలు చేసుకుని ఫలితాలను సెంట్రల్ డేటాబేస్కు పంపుతారని చెప్పారు. వ్యాక్సిన్‌కు వ్యక్తుల యాంటీబాడీ రెస్పాన్స్‌ను లెక్కగట్టేందుకు మాస్ యాంటీబాడీ పరీక్షలు అవసరమవుతాయని, ఈ ప్రణాళికలో భాగంగానే ర్యాపిట్ టెస్ట్‌ల ప్రక్రియను అభివృద్ధి చేశామని డాక్టర్ హ్యాండ్ తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ర్యాపిడ్ టెస్టులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులను కూడా అంతే వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందో లేదో నిర్ధారించే యాంటీజెన్ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా గరిష్టంగా అర గంటలో ఫలితం తెలుస్తుంది. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. అనంతరం వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది విరివిగా పరీక్షలు చేయనున్నారు. వైరస్ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తారు. అప్పటికప్పుడే ఫలితం ప్రకటిస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని తక్షణమే హోం ఐసోలేషన్ లేదా అవసరాన్ని బట్టి ఆసుపత్రికి తరలిస్తారు. ముందుగా 50 వేల కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రైవేటు లేబొరేటరీలకు కూడా యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇస్తారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆర్టీ–పీసీఆర్ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ పరిధిలోనూ అదే స్థాయిలో ఖర్చు అవుతుంది. కానీ యాంటీజెన్ పరీక్షకు మాత్రం రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది. ముందుగా జీహెచ్ఎంసీ సహా వివిధ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. నమూనాలు సేకరించిన గంటలో పరీక్ష చేయాల్సిందే...రాష్ట్రంలో కరోనా వైరస్ నమూనాలు సామర్థ్యానికి మించి వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీలపై తీవ్ర భారం పడుతోంది. దీంతో శాంపిళ్లు ఇచ్చిన తర్వాత ఒక్కోసారి 4–5 రోజుల వరకు కూడా ఫలితం రావడంలేదు. దీంతో తీవ్రమైన లక్షణాలున్న వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఎక్కువ శాంపిళ్లు పేరుకుపోవడం, శాంపిళ్ల సేకరణ అనంతరం వాటిని లేబొరేటరీకి తరలించడం వల్ల సమయం వృథా అవుతోంది. దీంతో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాంటీజెన్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్‌లను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటికీ పరికరాలు, జీవ భద్రత, బయో సెక్యూరిటీపరంగా ప్రత్యేకమైన లేబొరేటరీల్లో సౌకర్యాలు అవసరం. నమూనాల సేకరణ, తదనంతరం వాటి రవాణాకు ఆయా ప్రాంతాలను బట్టి కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు పడుతుంది. దీంతో ఎక్కువ పరీక్షలు చేయడానికి ఇవి ఆటంకంగా మారుతున్నాయి. అందుకే యాంటీజెన్ పరీక్షలపై సర్కారు దృష్టి సారించింది. పైగా యాంటీజెన్ పరీక్షకు నమూనా సేకరించిన తర్వాత తప్పనిసరిగా గంటలోనే పరీక్ష చేయాలి. లేకుంటే నమూనా వృథా అయిపోతుంది. లేబొరేటరీలకు నమూనాలను రవాణా చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల శాంపిళ్లు సేకరించిన ఆరోగ్య కేంద్రంలోనే అప్పటికప్పడు పరీక్షలు నిర్వహించాలి. దీనికోసం ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. సాధారణ లేబొరేటరీ సౌకర్యం ఉంటే చాలు. నెగెటివ్ వస్తే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష తప్పనిసరి... కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ పరీక్ష కీలకమైంది. కరోనా పాజిటివ్ రోగులను వేగంగా గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. వేగంగా పరీక్షించడానికి, ట్రాక్ చేయడానికి, చికిత్స చేయడానికి దీనివల్ల వీలు కలుగుతుంది. ఈ పరీక్ష కచ్చితత్వం 99.3 నుంచి 100 శాతం ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే ఈ పరీక్షకు ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే అనుమానిత వ్యక్తి నమూనాలను పరీక్షించాక ఫలితం పాజిటివ్ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. కానీ ఒకవేళ నెగెటివ్ వస్తే మాత్రం ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో మరోసారి పరీక్ష చేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే తీవ్ర లక్షణాలున్న వారికి, కేసులు అధికంగా నమోదవుతున్న చోట యాంటీజెన్ టెస్టులు మరింత ఉపయోగపడతాయని ఐసీఎంఆర్ తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు, తీవ్ర వైరస్ లక్షణాలున్న వారు, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, నాడీ సంబంధిత రుగ్మతలు తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి ఈ యాంటీజెన్ పరీక్షల వల్ల వేగంగా కరోనా వైరస్ నిర్ధారణ చేయడానికి వీలు కలుగుతుంది. 65 ఏళ్లు పైబడినవారు, తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు, 100.4 డిగ్రీలకు పైబడి జ్వరం, దగ్గుతో తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు ఉన్నవారికి దీనిద్వారా పరీక్షించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
యాంటీబాడీల తయారీకి భారత్ బయోటెక్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కారక వైరస్ నియంత్రణకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్‌తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. న్యూమిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కోవిడ్–19 రోగుల నుంచి సేకరించిన యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఇండోర్‌లోని ఐఐటీతోపాటు గురుగావ్‌లోని ప్రెడోమిక్స్ టెక్నాలజీస్‌లు కూడా ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయం అందిస్తాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం టీకాలు, మందుల తయారీకి ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతున్నా ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే కాకుండా.. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్‌ను ఎదుర్కోగల మోనోక్లోనల్ యాంటీబాడీల తయారీకి ప్రాజెక్టు సిద్ధమైంది. ఇప్పటికే వైరస్ బారిన పడ్డవారికి చికిత్స కల్పించేందుకు యాంటీబాడీలు ఉపయోగపడతాయని, భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు. -
కోవిడ్‌పై పోరులో ఇజ్రాయెల్ ముందంజ!
జెరూసలెం: కరోనా వైరస్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీబాడీ తయారీలో విజయం సాధించారు. ఈ అంశంపై పేటెంట్లు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టామని, త్వరలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి నఫ్టాలీ బెన్నెట్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోవిడ్ టీకా అభివృద్ధి బాధ్యతలు అప్పగించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలోనే ఈ సంస్థ వైరస్‌కు సంబంధించిన కీలకమైన విషయాలను అర్థం చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే దానికీ.. తాజా పరిణామానికి మధ్య సంబంధం ఉందా? లేదన్నది స్పష్టం కాలేదు. కొత్తగా తయారు చేసిన యాంటీబాడీని మనుషులపై ప్రయోగించిన విషయం కూడా రూఢి కాలేదు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ మాత్రం నడిచినట్లు సమాచారం. యూరప్ శాస్త్రవేత్తలూ తయారు చేశారు.. కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని యూరప్ శాస్త్రవేత్తలూ గుర్తించారు. 47డీ11 అని పిలుస్తున్న ఈ యాంటీబాడీ వైరస్ కొమ్మును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. 2003 నాటి సార్స్ వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీల్లో ఒకటైన 47డీ11 తాజా వైరస్‌ను నిర్వీర్యం చేయగలదని వీరు గుర్తించారు. ఇప్పటివరకూ వైరస్ సోకని వ్యక్తులకు ఈ యాంటీబాడీ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఈ యాంటీబాడీ వైరస్ కణానికి అతుక్కోకుండా అడ్డుకొని వైరస్ పనిచేయకుండా చేయగలిగిందని తెలుస్తోంది. టీకా తయారీలో ఇటలీ పురోగతి కరోనా వైరస్ టీకా తయారీలో ఇటలీ గణనీయ ప్రగతి సాధించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసినట్లు ఇటలీ ప్రకటించింది. రోమ్‌లోని స్పాల్లంజనీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా తయారైన యాంటీబాడీలు మానవ కణాలపై ప్రభావవంతంగా పనిచేసినట్లు ‘అరబ్ న్యూస్’ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించి చూడగా వాటిలో కరోనా వైరస్‌ను నివారించే యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తయ్యాయి. త్వరలో మరిన్ని ప్రయోగాలు జరపనున్నారు. కరోనా వైరస్‌లో సంభవించే ఎలాంటి మార్పులనైనా తట్టుకునే సామర్థ్యం ఈ యాంటీబాడీలకు ఉంది. ఇప్పటి వరకు తయారయిన టీకాలన్నీ డీఎన్ఏ ప్రొటీన్ ఆధారంగా చేసుకుని రూపొందించినవే. ‘ఇటలీ తయారు చేసిన టీకా అత్యంత అధునాతనమైనది’ అని ఈ టీకా తయారు చేస్తున్న టకిస్ కంపెనీ సీఈవో లూయిగి ఔరిసిషియో అన్నారు. మరికొద్ది నెలల్లోనే మనషులపై టీకా ప్రయోగాలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. -
కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పరీక్షలకు ఉపయోగించే ‘యాంటీ బాడీ టెస్ట్ కిట్ల’ కోసం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మార్చి 25వ తేదీన బిడ్డింగ్‌లకు ఆహ్వానించింది. విదేశాల్లో మాత్రమే దొరికే ఈ కిట్ల సరఫరా కోసం బిడ్డింగ్ వేసే కంపెనీలకు ‘దిగుమతి లైసెన్స్’ ఉండాలనే షరతును విధించలేదు. దాంతో దిగుమతి లైసెన్స్‌లేని ఢిల్లీకి చెందిన ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ కంపెనీతోపాటు చైనా నుంచే కాకుండా యూరప్ నుంచి కూడా మందులను, వైద్య పరికరాలను దిగుమతి చేసుకునే లైసెన్స్ ఉన్న కొన్ని కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. భారత వైద్య పరిశోధనా మండలి మార్చి 27వ తేదీన ఆశ్చర్యంగా 30 కోట్ల రూపాయల విలువైన ‘టెస్ట్ కిట్ల’ను సరఫరా చేయాల్సిందిగా ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’కు అప్పగించింది. ఈ వ్యవహారం ఒకానొక దశలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. కిట్‌కు 600 రూపాయల చొప్పున చైనాకు చెందిన ‘గ్వాంజౌ వాండ్ఫో బయోటెక్’ తయారు చేసిన టెస్ట్ కిట్లను సరఫరా చేస్తామని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్ కంపెనీ, భారత వైద్య పరిశోధనా మండలితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్క్ ఫార్మా ష్యూటికల్స్కు దిగుమతి లైసెన్స్ లేకపోవడమే కాకుండా చైనా కంపెనీతో ఎలాంటి ఒప్పందం లేదు. గ్వాంజౌ అనే చైనా కంపెనీతో చెన్నైకి చెందిన ‘మ్యాట్రిక్స్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉంది. ఆ కంపెనీకి దిగుమతి లైసెన్స్ ఉంది. కనీసం మ్యాట్రిక్స్తోని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు ఎలాంటి ఒప్పందం లేదు. మ్యాట్రిక్స్‌కు ఆలిండియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ఢిల్లీలోని ‘రేర్ మెటబాలిక్స్ లైవ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీతో కరోనా టెస్ట్ కిట్ల సరఫరాకు ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ ఒప్పందం చేసుకుంది. దీంతో చైనా నుంచి మ్యాట్రిక్స్ కంపెనీ 245 రూపాయల చొప్పున కిట్లను దిగుమతి చేసుకొని రేర్ మెటబాలిక్స్కు సరఫరా చేయగా, ఆ కంపెనీ వాటిని 420 రూపాయలకు చొప్పున ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు సరఫరా చేసింది. ఆ కంపెనీ భారత వైద్య పరిశోధనా మండలితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వాటిని 600 రూపాయలకు సరఫరా చేసింది. ఇంతవరకు లావాదేవీలు గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. (వైరస్ మూలాలపై గందరగోళం..) ఆ తర్వాత 50 వేల కిట్లను సరఫరా చేసేందుకు మ్యాట్రిక్స్ కంపెనీ నేరుగా తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐసీఎంఆర్‌కు సరఫరా చేసినట్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా తమకు వాటా ఇవ్వాలంటూ ఆర్క్ ఫార్మాష్యూటికల్స్, రేర్ మెటబాలిక్స్ మ్యాట్రిక్స్‌ను డిమాండ్ చేశాయి. అందుకు ఆ కంపెనీ అంగీకరించక పోవడంతో రెండు కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ 245 రూపాయల కిట్లు, 420 రూపాయలుగా మారడం, ఆ తర్వాత 600 రూపాయలుగా మారిన బాగోతం వెలుగులోకి వచ్చింది. కోర్టు విచారణ జరిగి ఏప్రిల్ 17వ తేదీ నాటికి ఐసీఎంఆర్‌కు 2.76 లక్షల కిట్లు సరఫరాకాగా, ఇంకా 2.34 లక్షల కిట్లను సరఫరా చేయాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న వాటిని 420 రూపాయల చొప్పునే సరఫరా చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. కరోనా టెస్ట్ కిట్లను తయారుచేసే చైనాకు చెందిన ‘గెటైన్ బయోటెక్ ఇన్కార్పొరేషన్’ కంపెనీతో ఢిల్లీకి చెందిన ‘సోవర్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉండడమే కాకుండా ఆ కంపెనీకి ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ మంజూరు చేసిన దిగుమతి లైసెన్స్ కూడా ఉంది. ‘600 రూపాయలకు తక్కువగా కిట్ల సరఫరాకు ఐసీఎంఆర్‌లో బిడ్లను దాఖలు చేశాం. మమ్మల్ని కాదని ఆర్క్ ఫార్మాష్యూటిక్స్కు ఎలా బిడ్డింగ్ ఖరారు చేశారో మాకు అర్థం కావడం లేదు’ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ విజేంద్ర జైస్వాల్ మీడియా ముందు వాపోయారు. (మాస్క్ మాటున నిశ్శబ్దంగా ఏడ్చాను) చెన్నైలోని ‘ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్’ కంపెనీకి కరోనా కిట్లను తయారు చేసే మూడు చైనా కంపెనీలతో ఒప్పందం ఉండడంతోపాటు దిగుమతి ఒప్పందం ఉంది. ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తుందనడానికి గుర్తుగా ఆ కంపెనీకి ‘యూరోపియన్ సర్టిఫికేషన్’ కూడా ఉంది. తాము కూడా 600 రూపాయలకు లోపే బిడ్డింగ్ వేశామని, అయినా తమకు రాలేదని, ఈ విషయమై ఐసీఎంఆర్ అధికారులను అడిగితే వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని కంపెనీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్కే వేలు మీడియా ముందు ఆరోపించారు. కరోనాలో కొత్తగా ఆరు లక్షణాలు -
సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం పీసీఆర్ ఆర్సీటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొంతు, ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల్లో వైరస్ తాలూకు డీఎన్ఏ పోగులను గుర్తించడం ఈ పరీక్షల పద్ధతి. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పరీక్షల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైలీ అనే సంస్థ యాంటీబాడీ పరీక్ష ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని గుర్తించడం వీలవుతుండగా యాంటీబాడీ లేదా రక్త పరీక్షలు తొలిదశలోనే వైరస్‌ను గుర్తించగలవు. అంతేకాకుండా వైరస్ ఎంతమేరకు విస్తరించింది, ఒక్కో వ్యక్తి యాంటీబాడీ ప్రతిస్పందన ఎలా ఉంది? మరోసారి వైరస్ బారిన పడకుండా ఉండగలిగే సామర్థ్యం ఎందరికి ఉంది? అన్నది ఈ కొత్త యాంటీబాడీ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కరోనా వైరస్‌లోని కీలకమైన ప్రొటీన్ భాగాలను ఉపయోగించడం ద్వారా వైరస్‌ను అడ్డుకునేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసిన యాంటీబాడీలను గుర్తించడం ఈ కొత్త పరీక్ష పద్ధతి విశేషం. లక్షణాలు లేని వారితోపాటు, కొద్దిపాటి తీవ్రత ఉన్నవారిలోనూ వైరస్ వ్యాప్తి ఎంతనేది ఈ పరీక్షల్లో స్పష్టంగా తెలుస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌ను తట్టుకోగల రోగ నిరోధకశక్తి ఉన్న వ్యక్తులను గుర్తించడం కూడా ఈ పరీక్ష ద్వారా సాధ్యమవుతుంది. దీనివల్ల కరోనా వైరస్ సోకని వ్యక్తులనే రోగుల చికిత్సలో ఉపయోగించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ కొత్త పరీక్ష ఎలా నిర్వహించాలనేది కరెంట్ ప్రొటోకాల్స్ ఇన్ మైక్రోబయాలజీలో విశదీకరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఊపు కరోనా నేపథ్యంలో ఐటీతోపాటు ఇతర ఉద్యోగాల్లోనూ ఇంటి నుంచే పనిచేయడమనే సంస్కృతి రానుంది. ఇప్పటివరకూ ఉద్యోగులు కంపెనీల ఐటీ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుని పనులు చేస్తుంటే.. ఇప్పుడు ఇళ్లలోని ఇంటర్నెట్ కనెక్షన్లను వాడాలి. దీంతో బ్యాండ్‌విడ్త్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వైఫై ప్రొటోకాల్ అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. ఇది అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్‌పై బోలెడన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను జోడించుకుని నడిపించవచ్చు. ఇంట్లోని వారంతా హైస్పీడ్ వీడియోగేమ్‌లు, ఇతర సాఫ్ట్వేర్లు వాడుతున్నా ఇంటర్నెట్ వేగం ఏమాత్రం తగ్గదన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వైఫై ప్రొటోకాల్‌ను వాడుకోగల స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వైఫైతో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, ఆన్లైన్ క్లాసుల వంటివి బ్యాండ్‌విడ్త్ సాఫీగా నడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
హెచ్ఐవీ భరతం పట్టే యాంటీబాడీ
సాక్షి, హైదరాబాద్: దాదాపు అన్ని రకాల వైరస్‌లను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఫార్మా కంపెనీ సనఫీ, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లు సంయుక్తంగా జరిపిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ప్రయోగాల్లో భాగంగా శాస్త్రవేత్తలు 24 కోతులను మూడు గుంపులుగా విడగొట్టారు. రెండు గుంపుల్లోని కోతులకు భిన్నమైన యాంటీబాడీలు ఇచ్చారు. చివరి గుంపునకు కొత్తగా తయారు చేసిన యాంటీబాడీని అందించారు. 5 రోజుల తర్వాత అన్ని కోతులకు వేర్వేరు రకాల హెచ్ఐవీ వైరస్‌లను ఎక్కించారు. అయితే కొత్త యాంటీబాడీని అందుకున్న కోతుల్లో ఏ ఒక్కటి కూడా హెచ్ఐవీ బారిన పడలేదు. హెచ్ఐవీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకుని కొత్తదానిగా మారుతుండటం ఈ వ్యాధి చికిత్సను జటిలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వైరస్‌లను నిలువరించగల యాంటీబాడీ తయారు కావడం విశేషం. పరిశోధన వివరాలు సైన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
డెంగ్యూకు చెక్!
ఇక డెంగ్యూ మహమ్మారి ఆటకట్టించనున్నారు. దీని ద్వారా మానవ శరీరంలో జరిగే వినాశనాన్ని సమర్థవంతంగా అడ్డుకోగల ప్రతి రక్షకాలను సింగపూర్ చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఒక్క నిమిషంలోనే డెంగ్యూ వైరస్‌ను చలనం లేకుండా చేసి కట్టిపడేస్తాయని చెప్తున్నారు. సాధరణంగా డెంగ్యూకు ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించబడిన లైసెన్స్ ఉన్న మెడిసినే లేదు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి 50 ఏళ్లవగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30కంటే ఎక్కువసార్లు విజృంభించింది. దీనివల్ల తీవ్రమైన, రాషెష్తోపాటు తీవ్రమైన జాయింట్ పెయిన్స్, రక్తస్రావం, షాక్‌కు గురికావడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా .. సింగపూర్‌లోని డ్యూక్ నాస్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్‌కు చెందినవారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించారు. 200 మంది నుంచి 5 జే7 అనే ప్రతిరక్షకాలను తీసుకుని వాటిద్వారా డెంగ్యూ వైరస్‌పై ప్రయోగించి చూశారు. 10-9 గ్రాముల 5జే7 ప్రతిరక్షకాలతోనే డెంగ్యూ వైరస్ నాశనమైనట్లు తెలిపారు.