హెచ్‌ఐవీ భరతం పట్టే యాంటీబాడీ | New antibody to fight with HIV | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ భరతం పట్టే యాంటీబాడీ

Published Tue, Oct 3 2017 1:19 AM | Last Updated on Tue, Oct 3 2017 1:07 PM

New antibody to fight with HIV

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు అన్ని రకాల వైరస్‌లను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఫార్మా కంపెనీ సనఫీ, అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌లు సంయుక్తంగా జరిపిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ప్రయోగాల్లో భాగంగా శాస్త్రవేత్తలు 24 కోతులను మూడు గుంపులుగా విడగొట్టారు. రెండు గుంపుల్లోని కోతులకు భిన్నమైన యాంటీబాడీలు ఇచ్చారు. చివరి గుంపునకు కొత్తగా తయారు చేసిన యాంటీబాడీని అందించారు. 5 రోజుల తర్వాత అన్ని కోతులకు వేర్వేరు రకాల హెచ్‌ఐవీ వైరస్‌లను ఎక్కించారు.

అయితే కొత్త యాంటీబాడీని అందుకున్న కోతుల్లో ఏ ఒక్కటి కూడా హెచ్‌ఐవీ బారిన పడలేదు. హెచ్‌ఐవీ వైరస్‌ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకుని కొత్తదానిగా మారుతుండటం ఈ వ్యాధి చికిత్సను జటిలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వైరస్‌లను నిలువరించగల యాంటీబాడీ తయారు కావడం విశేషం. పరిశోధన వివరాలు సైన్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement