దాదాపు 9.7 మిలియన్ల ఏళ్ల నాటి ఓ జత శిలాజ దంతాలు మానవ పుట్టు పూర్వొత్తరాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. రైన్ నదీ పరివాహాక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజిస్టులకు ఈ దంతాలు లభ్యమయ్యాయి. పరిశోధకులకు లభ్యమైన దంతాలు.. 3.2 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన లూసీ అనే మహిళ పుర్రెకు సరిపోలుతున్నాయి. లూసీ పుర్రె ఇథియోపియాలో లభ్యమైంది. అయితే, దంతాలు కచ్చితంగా లూసీవేనా? అనే విషయంపై స్పష్టత లేదు.
దీనిపై మాట్లాడిన డా.హర్బట్ లట్జ్ అనే పరిశోధకుడు.. నదీ పరివాహక ప్రాంతంలో లభ్యమైన దంతాలు ఒకే వ్యక్తి(స్త్రీ లేదా పురుషుడు అన్న విషయం తెలియదు)కి చెందినవని చెప్పారు. అయితే, లూసీ పుర్రెకు మినహాయించి మరే ఇతర వ్యక్తులకు దంతాలు సూట్ కాకపోవడమే సమస్యగా మారినట్టు చెప్పారు.
మానవులను పోలిన జీవులు(హోమినిన్) పూర్వకాలంలో ఉండేవనే వాదనలు ఉన్నాయి. అయితే, వాదనలకు తగిన ఆధారాలు మాత్రం లేవు. తాజాగా పరిశోధకులకు దొరికిన దంతాలు మానవులను పోలిన జీవులవని తేలితే మానవజాతి పుట్టుపూర్వొత్తరాల్లో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అంటే రెండు నుంచి నాలుగు లక్షల సంవత్సరాల క్రితం తొలి దశ ఆదిమ మానవులు ఆఫ్రికా ఖండం నుంచి వచ్చారని ప్రస్తుతం మనం చదువుకుంటున్న థియరీ మారుతుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment