అమెరికా సుప్రీం కోర్టు వద్ద భారతీయ అమెరికన్ల ప్రదర్శన
వాషింగ్టన్: అమెరికాలో 40 లక్షల మంది అక్రమ వలసదారుల బహిష్కరణకు వ్యతిరేకంగా ఉన్న ఒబామా ప్రభుత్వ విధానాల (డీఏపీఏ)కు మద్దతిస్తున్న భారతీయ అమెరికన్లు, దక్షిణాసియా ప్రాంత ప్రజలు సోమవారం అమెరికా సుప్రీం కోర్టు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. డీఏపీఏను 26 రాష్ట్రాలు సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. డీఏపీఏతో కొంతమంది వర్ధమాన అమెరికన్లు కుటుంబాలతో కలసి ఉండటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ పేర్కొంది.
ఒబామా వలస విధానానికి మద్దతుగా ర్యాలీ
Published Wed, Apr 20 2016 3:05 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement