రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి దుర్మరణం | Reality TV star Ashley Ross died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి దుర్మరణం

Published Wed, Apr 29 2020 11:24 AM | Last Updated on Wed, Apr 29 2020 11:24 AM

Reality TV star Ashley Ross died In Road Accident - Sakshi

ఆప్లే రాస్

అట్లాంటా : బుల్లితెర నటి, రియాలిటీ టెలివిజన్‌ స్టార్‌ ఆప్లే రాస్‌(34) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గత ఆదివారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆప్లే రాస్‌ను అట్లాంటాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత సోమవారం ఉదయం ఆమె మరణించారు.  ఈ విషయాన్ని ఆమె కుటుంభ సభ్యులు ధృవీకరించారు. 

ఆష్లే రాస్, ‘లిటిల్ ఉమెన్: అట్లాంటా’ రియాలిటీ షోలో ‘మిన్నీ’గా అందరికి సుపరిచితం. 2016లో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పటి వరకు 5 సిరీస్‌లను పూర్తి చేసుకుంది. త్వరలో ఆరో సిరీస్‌ కూడా రాబోతుంది. మహిళల జీవిత సమస్యలను డ్రామా రూపంలో చూపిస్తున్న ఈ రియాలిటీ షో.. అట్లాంటాలో మంచి ఆదరణ పొందుతుంది. ఇక మిన్నీ పాత్రలో ఆష్లే రాస్‌ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆరో సిరీస్‌ షూటింగ్‌లో ఆష్లే పాల్గొన్నారని, ఎపిసోడ్‌ విడుదలకాక ముందే ఆమె మృతి చెందడం బాధకరమని ‘లిటిల్‌ ఉమెన్‌ : అట్లాంటా’ టీమ్‌ విచారం వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement