ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లో పాక్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పాక్ వెనక్కు పిలిపించుకుంది. న్యూఢిల్లీలోని పాక్ దౌత్యకార్యాలయంలోని ఉద్యోగులను భారత అధికారులు వేధిస్తున్నారని, అందుకే చర్చలకోసం పిలిపించినట్లు పాక్ తెలిపింది.
పాక్ దౌత్యవేత్తలు, వారి కుటుంబీకులు, కార్యాలయ ఉద్యోగులపై నిఘా సంస్థల వేధింపులు ఎక్కువయ్యాయని భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముహ్మద్ ఫైజల్ ఇస్లామాబాద్‌లో ఆరోపించారు. కాగా, పాక్ తన దౌత్యాధికారిని స్వదేశానికి చర్చలకోసం పిలిపించుకోవటం సహజంగా జరిగేదేనని దీనిపై పెద్ద వివాదమేమీ లేదని భారత్ స్పష్టంచేసింది. పాక్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఇంతకన్నా చాలా సమస్యలు ఎదురవుతున్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment