sohail mahmood
-
దౌత్యాధికారిని పిలిపించుకున్న పాక్
-
దౌత్యాధికారిని పిలిపించుకున్న పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లో పాక్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పాక్ వెనక్కు పిలిపించుకుంది. న్యూఢిల్లీలోని పాక్ దౌత్యకార్యాలయంలోని ఉద్యోగులను భారత అధికారులు వేధిస్తున్నారని, అందుకే చర్చలకోసం పిలిపించినట్లు పాక్ తెలిపింది. పాక్ దౌత్యవేత్తలు, వారి కుటుంబీకులు, కార్యాలయ ఉద్యోగులపై నిఘా సంస్థల వేధింపులు ఎక్కువయ్యాయని భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముహ్మద్ ఫైజల్ ఇస్లామాబాద్‌లో ఆరోపించారు. కాగా, పాక్ తన దౌత్యాధికారిని స్వదేశానికి చర్చలకోసం పిలిపించుకోవటం సహజంగా జరిగేదేనని దీనిపై పెద్ద వివాదమేమీ లేదని భారత్ స్పష్టంచేసింది. పాక్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఇంతకన్నా చాలా సమస్యలు ఎదురవుతున్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ తెలిపారు. -
పాక్ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది
-
పాక్ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది
ఇస్లామాబాద్: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్‌లోని తన హైకమిషనర్‌ను పాకిస్థాన్ మారుస్తోంది. ప్రస్తుతం పాక్ తరుపున భారత్‌లో హైకమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ బాసిత్‌ను పక్కకు తప్పించి సోహెయిల్ మహ్మద్ అనే వ్యక్తిని హైకమిషనర్‌గా నియమించనుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం సోహెయిల్ టర్కీకి రాయబారిగా పనిచేస్తున్నారు. వచ్చే వారం ఆయన ఇస్లామాబాద్‌లో అడుగుపెడతారని, ఆ వెంటనే భారత్‌కు రాయబారిగా బాధ్యతలు అప్పగించి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేస్తారని పాక్ మీడియా తెలిపింది. వచ్చే నెల(మే) తొలివారం నుంచే ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని పాక్ మీడియా అంటోంది. బాసిత్ ఇప్పటికే మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నట్లు పాక్ అధికార వర్గాల సమాచారం.