పాక్‌ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది | Sohail Mahmood likely to replace Abdul Basit as Pakistan envoy to India | Sakshi
Sakshi News home page

పాక్‌ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది

Published Mon, Apr 10 2017 7:00 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

పాక్‌ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది

పాక్‌ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది

ఇస్లామాబాద్‌: ఇరు దేశాల మధ్య ఉ‍ద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్‌లోని తన హైకమిషనర్‌ను పాకిస్థాన్‌ మారుస్తోంది. ప్రస్తుతం పాక్‌ తరుపున భారత్‌లో హైకమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ బాసిత్‌ను పక్కకు తప్పించి సోహెయిల్‌ మహ్మద్‌ అనే వ్యక్తిని హైకమిషనర్‌గా నియమించనుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.

ప్రస్తుతం సోహెయిల్‌ టర్కీకి రాయబారిగా పనిచేస్తున్నారు. వచ్చే వారం ఆయన ఇస్లామాబాద్‌లో అడుగుపెడతారని, ఆ వెంటనే భారత్‌కు రాయబారిగా బాధ్యతలు అప్పగించి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆమోద ముద్ర వేస్తారని పాక్‌ మీడియా తెలిపింది. వచ్చే నెల(మే) తొలివారం నుంచే ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని పాక్‌ మీడియా అంటోంది. బాసిత్‌ ఇప్పటికే మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నట్లు పాక్‌ అధికార వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement