abdul basit
-
గుడ్ జాబ్ ఇండియా: పాక్‌లో రియాక్షన్
ఇస్లామాబాద్: భారత్ మరోసారి పాకిస్థాన్ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులను నిర్వహించడంపై అక్కడి పౌరులు సానూకూలంగా స్పందించారు. భారత ఆర్మీ చాలా మంచిపని చేసిందంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ చాలా గ్రేట్ అంటూ కూడా కితాబిచ్చారు. భారత్ అసలు తమ శిబిరాలపై భారత్ దాడులే నిర్వహించలేదంటూ పాకిస్థాన్ ఆర్మీ కొట్టిపారేసిందంటూ డాన్ పత్రిక వార్తను ప్రచురించగా దానికి పై విధంగా పాక్ పౌరులు కొందరు స్పందించారు. నియంత్రణ రేఖ వద్ద నుంచి చొరబాట్లు ఎక్కువై కశ్మీర్లో ఆందోళనలకు కారణం అవుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఈనెల 20, 21 తేదీలలో దాడలు జరిపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంతం సమీపంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు ముమ్మరంగా కాల్పులు జరిపి ధ్వంసం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటపెట్టింది. అయితే, భారత్ చేస్తుందంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ పాక్ అంతర్గత సేవల ప్రజాసంబంధాల డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ ఓ ట్వీట్ చేశారు. ‘నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత్ చెప్పింది. ఇదంతా కూడా అబద్ధం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ దాడులను భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా అబ్దుల్ బాసిత్ కూడా తోసిపుచ్చారు. అసలు అలాంటి సమాచారం ఏది తమకు ఇంకా పాక్ నుంచి రాలేదని అన్నారు. ఇది తమకు తాము డంబంగా చెప్పుకోవడం కాదన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే తాము గట్టిగా నొక్కి చెబుతున్నామని తెలిపారు. భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన ఈ విషయంలో అలా ఎందుకు చర్చించుకోకూడదని ప్రశ్నించారు. ఉగ్రవాదం పాక్‌కు కూడా పెద్ద సమస్య అని, తీవ్ర ఆందోళన అని చెప్పిన బాసిత్.. చర్చలకు తామేం సిగ్గుపడటం లేదని అన్నారు. అన్ని సమస్యలకు మూలం కశ్మీర్లో ఉందనే చెప్పారు. -
కుల్‌భూషణ్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలు
కుల్‌భూషణ్ జాదవ్‌ను గూఢచారి అని ప్రకటించి, అతడికి మరణశిక్ష విధించడంపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు భారతదేశంలో పాక్ రాయబారిగా ఉన్న అబ్దుల్ బాసిత్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. జాదవ్ ఉగ్రవాది అని, అతడు చేసిన దానికి తలరాత ఎలా ఉంటే అలా అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు చెందిన వార్తా చానల్ సమా టీవీతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో అరెస్టయిన జాదవ్ రా ఏజెంటు అని కూడా సమా టీవీ వ్యాఖ్యానించినా, దాన్ని భారతదేశం పదే పదే ఖండిస్తోంది. తొలుత వాళ్లు తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడతారని, ఇప్పుడు ఒక ఉగ్రవాదిని తాము శిక్షిస్తే ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని బాసిత్ అడిగారు. జాదవ్‌కు మరణశిక్ష విధించడంలో పాక్ తప్పేమీ చేయలేదని కూడా అన్నారు. తాము అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అయితే ఎటువైపు నుంచైనా తమకు ఏవైనా బెదిరింపులు వస్తే మాత్రం వాటిని దీటుగా ఎదుర్కోడానికి పాక్ దళాలకు తగిన సామర్థ్యం ఉందని, పూర్తి సన్నద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు. -
పాక్ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది
-
పాక్ కొత్త హైకమిషనర్‌ను సిద్ధం చేస్తోంది
ఇస్లామాబాద్: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్‌లోని తన హైకమిషనర్‌ను పాకిస్థాన్ మారుస్తోంది. ప్రస్తుతం పాక్ తరుపున భారత్‌లో హైకమిషనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ బాసిత్‌ను పక్కకు తప్పించి సోహెయిల్ మహ్మద్ అనే వ్యక్తిని హైకమిషనర్‌గా నియమించనుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం సోహెయిల్ టర్కీకి రాయబారిగా పనిచేస్తున్నారు. వచ్చే వారం ఆయన ఇస్లామాబాద్‌లో అడుగుపెడతారని, ఆ వెంటనే భారత్‌కు రాయబారిగా బాధ్యతలు అప్పగించి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేస్తారని పాక్ మీడియా తెలిపింది. వచ్చే నెల(మే) తొలివారం నుంచే ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని పాక్ మీడియా అంటోంది. బాసిత్ ఇప్పటికే మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నట్లు పాక్ అధికార వర్గాల సమాచారం. -
పాక్‌పై భారత్ మరో దౌత్యదాడి!
అబ్దుల్ బాసిత్‌కు సమన్లు ఉడీ దాడిపై ఆధారాలు అందజేత న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌పై భారత్ తన దౌత్య దాడిని తీవ్రతరం చేసింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు మంగళవారం సమన్లు జారీచేసింది. అంతేకాకుండా ఉడీ దాడిలో పాకిస్థాన్ హస్తాన్ని నిరూపించే ఆధారాలను అబ్దుల్ బాసిత్‌కు అందించింది. ’విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి మాట్లాడారు. సరిహద్దుల్లో (పాక్ ఉగ్రవాదుల) చొరబాట్లకు సహకరించిన ఇద్దరు గైడ్లను స్థానిక గ్రామస్తులు పట్టుకున్నారని, వారు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారని బాసిత్‌కు తెలియజేశారు’అని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం ట్వీట్ చేశారు. ’ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉడీలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడిని హఫీజ్ అహ్మద్‌గా గుర్తించారు. అతను పాకిస్థాన్ ముజఫరాబాద్‌లోని దర్భాంగ్‌కు చెందిన ఫిరోజ్ కొడుకు అని తేలింది’ అని ఆయన తెలిపారు. ఉడీలో దాడికి దిగిన మరో ఇద్దరిని మహ్మద్ కబీర్ అవాన్, బషారత్‌గా గుర్తించినట్టు తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదులు దాడులు కొనసాగించడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని బాసిత్‌కు తేల్చి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. పాక్ రాయబారి బాసిత్‌కు భారత్ సమన్లు జారీచేయడం ఇది రెండోసారి. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సెప్టెంబర్ 21న కూడా ఆయనకు విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దౌత్యపరంగా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని, ఆర్థికంగా, సైనికంగా దెబ్బకొట్టే వ్యూహాలు రచించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
పాక్ రాయబారికి భారత్ సమన్లు
న్యూఢిల్లీ/కరాచీ: భారత్ లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు భారత విదేశాంగ వ్వవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. తమ దేశ అధికారిని కార్యక్రమానికి పిలిచి చిట్టచివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయిందని చెప్పి అవమానిస్తారా అని అందులో ప్రశ్నించింది. ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారని, తమ ఆందోళన పాక్ ప్రభుత్వానికి చేరవేయాలని కోరింది. భారత్ తరుపున పాకిస్థాన్‌లో హైకమిషనర్ గా గౌతం బాంబ్వాలే పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను కరాచీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడేందుకు పాక్ అధికారులు ఆహ్వానించారు. తీరా ఆయన బయలుదేరే సమయానికి రావొద్దంటూ చివరి నిమిషంలో సమాచారం ఇచ్చారు. ఇంతటి బాధ్యత రహితంగా వ్యవహరించిన పాక్ తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమన్లు పంపించింది. కాగా, దీనిపూ వివరణ కోరగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రతినిధులు వారి కార్యక్రమాలు పూర్తి చేయాలని భారత్ కోరుకుంటుందని అందులో భాగంగానే వివరణ కోరిందని చెప్పారు. -
ఆ మ్యాచ్ పై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చోపచర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. భరోసా ప్రకటనలు వెలువడుతున్నాయి. తమ జట్టు భద్రతకు భారత ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని పాకిస్థాన్ పట్టుబడుతుండగా, లిఖిత పూర్వక హామీ ఇచ్చేది లేదని ఇండియా అంటోంది. ఈ నేపథ్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బాసిత్ విలేకరులతో మాట్లాడుతూ... తమ జట్టు భద్రతకు హోంశాఖ కార్యదర్శి హామీయిచ్చారని చెప్పారు. ఇదే విషయాన్ని తమదేశ ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు. ఇంతకుమించి వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా, తమ దేశానికి ఎవరు వచ్చినా భద్రత కల్పిస్తామని అంతకుముందు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్-పాక్ మ్యాచ్ ధర్మశాల నుంచి కోల్ కతాకు తరలిస్తామని బీసీసీఐ తనను అడగ్గా భద్రత కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలో వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న ధర్మశాలలో భారత్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను భద్రత కారణాలతో కోల్‌కతాకు మార్చిన సంగతి తెలిసిందే. -
పాక్ అభిమానిని కలిసిన సల్మాన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాకిస్థాన్ నుంచి వచ్చిన చిన్నారి అభిమాని అబ్దుల్ బాసిత్ ను కలిశాడు. కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న 11 ఏళ్ల బాసిత్ కోరిక తీర్చాడు. పాకిస్థాన్ కు చెందిన బాసిత్ పుట్టిన కొద్ది రోజులకే పచ్చకామెర్ల బారిన పడ్డాడు. దీంతో అతడికి ముంబై అపోలో ఆస్పత్రిలో ఫొటో థెరఫి ద్వారా కొద్దిరోజులు చికిత్స అందించారు. తర్వాత అతడికి కాలేయ మార్పిడి చేశారు. తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ ను కలవాలన్న కోరికను బాసిత్ ఈ సందర్భంగా వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ సోమవారం అతడిని కలిశాడు. బాసిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. -
'దావూద్ పాకిస్థాన్‌లో లేడు'
న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. దావూద్ పాక్‌లో ఉన్నాడని, అతణ్ని భారత్‌కు రప్పిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు లోక్‌సభలో ప్రకటించారు. బాసిత్ స్పందిస్తూ రాజనాథ్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. దావూద్ తమ దేశంలో లేడని చెప్పారు. -
హఫీజ్ పై కేసే లేదు: పాక్
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై ఎలాంటి కేసూ పెండింగ్‌లో లేదని, పాకిస్థాన్ పౌరుడైన హఫీజ్‌కు పాక్‌లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని పాకిస్థాన్ సోమవారం ప్రకటించింది. హఫీజ్‌తో ఎలాంటి సమస్యా లేదని భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. సయీద్ నిర్దోషిగా కోర్టులు ఇదివరకే ప్రకటించాయని ఢిల్లీలో అన్నారు. దీనిపై స్పందించిన భారత్ హఫీజ్‌ను వెంటనే అరెస్ట్ చేసి, కోర్టు విచారణకు అప్పగించాలంది.