పాక్ అభిమానిని కలిసిన సల్మాన్ ఖాన్ | Salman Khan meets fan from Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ అభిమానిని కలిసిన సల్మాన్ ఖాన్

Published Wed, Dec 9 2015 7:38 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

పాక్ అభిమానిని కలిసిన సల్మాన్ ఖాన్ - Sakshi

పాక్ అభిమానిని కలిసిన సల్మాన్ ఖాన్

ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాకిస్థాన్ నుంచి వచ్చిన చిన్నారి అభిమాని అబ్దుల్ బాసిత్ ను కలిశాడు. కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న 11 ఏళ్ల బాసిత్ కోరిక తీర్చాడు. పాకిస్థాన్ కు చెందిన బాసిత్ పుట్టిన కొద్ది రోజులకే పచ్చకామెర్ల బారిన పడ్డాడు. దీంతో అతడికి ముంబై అపోలో ఆస్పత్రిలో ఫొటో థెరఫి ద్వారా కొద్దిరోజులు చికిత్స అందించారు. తర్వాత అతడికి కాలేయ మార్పిడి చేశారు.

తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ ను కలవాలన్న కోరికను బాసిత్ ఈ సందర్భంగా వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ సోమవారం అతడిని కలిశాడు. బాసిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement