పేషెంట్పై డాక్టర్ పిడిగుద్దులు.. పేషెంట్ మృతి
రష్యా: అతడొక పేషంట్.. వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. సాధరణంగా జబ్బుబాగా చేసి నయంకానీ పరిస్థితుల్లో ఉంటేనే తప్ప వైద్యులు ఎంత శ్రమించైనా ప్రాణం పోకుండా చూస్తారు. కానీ, రష్యాలో మాత్రం రోగి సరిగానే ఉన్నా అతడి ప్రాణంపోయింది.. కాకపోతే జబ్బువల్ల కాదు.. డాక్టర్ వల్ల.. అదెలాగా అని అనుకుంటున్నారా.. రష్యాలోని ఓ ఆస్పత్రికి ఓ వ్యక్తి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్లాడు. అయితే, అలా వెళ్లిన అతడు అక్కడి నర్సులతో తప్పుడుగా ప్రవర్తించాడట.
వెంటనే ఆ నర్సు వెళ్లి సదరు వైద్యుడికి చెప్పడంతో ఆగ్రహావేశంతో వచ్చిన వైద్యుడు ఒక్కసారిగా బాక్సర్ అవతారమెత్తాడు. మరో నర్సు అతడి స్టెతస్కోప్ పెట్టి చెక్ చేస్తుండగా అక్కడికి వచ్చిన వైద్యుడు అమాంతం అతడిని బయటకు లాగి వరుసగా పంచ్ లు ఇచ్చాడు. దీంతో ఆ పేషెంట్ కాస్త పరీక్షలకు వచ్చి ప్రాణాలుకోల్పోయినట్లయింది. ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుండటంతో ఆ వైద్యుడికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.