లండన్: భారీ భూకంపాలు నిర్ణీత సమయంలో పునరావృతం అవుతాయా... అంటే అవును అంటున్నారు శాస్త్రవేత్తలు. అస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్‌బ్రూక్‌కు చెందిన శాస్త్రవేత్తలు చిలీలోని పలు సరస్సులను పరిశోధించారు. భూకంపాల కారణంగా సరస్సులోని అడుగు భాగంలో భారీగా కొండచరియలు ఏర్పడినట్లు వారి గుర్తించారు. వీటిని విశ్లేషించి 5 వేల ఏళ్ల నాటి భూకంపాల సమాచారాన్ని రూపొందించారు. అంతేకాకుండా భారీ భూకంపాలు (9.5 తీవ్రత పైగా) ప్రతి 292 ఏళ్లకు, తక్కువ తీవ్రత (8) కలిగిన భూకంపాలు ప్రతి 139 ఏళ్లకు పునరావృతం అవుతున్నట్లు గుర్తించారు.
దక్షిణమధ్య చిలీలో 1960 ప్రాంతాల్లో 9.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని, దీని వల్ల చిలీ కోస్తా తీరంలో సునామీ ఏర్పడిందని వర్సిటీకి చెందిన జస్పర్ మోర్నాట్ అనే అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు. ఈ సునామి కారణంగా జపాన్‌లో సుమారు 200 మంది మరణించారని పేర్కొన్నారు. భూకంపాల వల్ల భారీస్థాయిలో శక్తి బయటకు వస్తుందని, ఆ శక్తి ఏర్పడేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందన్నారు. ఈ వివరాలు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
భారీ భూకంపాలు పునరావృతం
Published Thu, Feb 1 2018 4:26 AM | Last Updated on Thu, Feb 1 2018 4:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment