రేప్‌లు, నేరాలు జరుగతాయనే భయంతో.. | Scrapped Malaysian Beer Festival Faced Threat From Militants : Police | Sakshi
Sakshi News home page

రేప్‌లు, నేరాలు జరుగతాయనే భయంతో..

Published Thu, Sep 21 2017 4:13 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

రేప్‌లు, నేరాలు జరుగతాయనే భయంతో..

రేప్‌లు, నేరాలు జరుగతాయనే భయంతో..

కౌలాలంపూర్‌ : మలేషియాలో ప్రతియేటా నిర్వహించే బీర్‌ ఫెస్టివల్‌ను రద్దు చేసినట్లు కౌలాలంపూర్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్‌ లక్ష్యంగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉండటంతోపాటు పార్టీ పేరిట, నేరాలు, లైంగిక దాడులు, స్వేచ్ఛాయుత లైంగిక కార్యక్రమాలకు ఆస్కారం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.

రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 6000మంది హాజరవుతారని అంచనా. ఈ పార్టీకి దాదాపు 11 దేశాల నుంచి ఉత్సాహవంతులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల మేరకు ఈ ఫెస్టివల్‌ నిర్వహించ వద్దని నిర్వాహకులకు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement