Beer Festival
-
అక్టో ‘బీరు’ ఫెస్ట్
సిటీ నుంచి పండుగ ప్రయాణాలు షురూ అవుతున్నాయి. అయితే..సెలవులొచ్చాయని స్వంత ఊర్లకూ, చుట్టు పక్కల ఉన్న టూరిస్ట్ స్పాట్స్కీ వెళ్లొచ్చేయడం లాంటి మనలాంటి మిడిల్ క్లాస్ టూర్లు కావవి. సిటీ ఇప్పుడు చాలా రిచ్ గురూ... అందుకే హాట్ హాట్ టూర్స్ కోసం కాస్ట్లీ ఫెస్టివల్స్‌ని వెతుక్కుంటోంది. స్పెయిన్‌లో జరిగే లా టమాటినా ఫెస్టివల్ కావచ్చు చైనాలో జరిగే స్నో అండ్ ఐస్ ఫెస్టివల్ కావచ్చు జర్మనీలో జరిగే అక్టోబరు ఫెస్ట్ కావచ్చు... సిటీ నుంచి పర్యాటకులు మేము సైతం అంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మతాచారాల ప్రకారం ఎవరి పండుగలు వారికి ఉంటాయి. అయితే కుల మతాలకు, ప్రాంతాలకు, దేశాలకు కూడా అతీతంగా జరుపుకునే కొన్ని పండుగలు ఉంటాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటైన అక్టోబరు ఫెస్ట్‌కి ఇప్పుడు నగరం నుంచి రాకపోకలు ఊపందుకున్నాయి. అక్టో ‘బీరు’ ఫెస్ట్ బీరు ప్రియులకూ ఓ నెలుంది. అదే అక్టోబరు. జర్మనీలోని రాయల్ వెడ్డింగ్‌ను సాధారణ ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడం అనే మూలకథతో ముడిపడి ఉన్న ఈ పండుగ 1810లో మొదలై తర్వాత తర్వాత మరిన్ని ఆకర్షణలు అద్దుకుంటూ ప్రపంచమంతా విస్తరించింది. ప్రస్తుతం బీర్, ట్రావెలింగ్ల మేలు కలయికగా జరిగే ప్రపంచపు అతిపెద్ద పండుగ ఇది. దీనిని జర్మనీలోని మ్యునిక్‌లో పెద్దయెత్తున నిర్వహిస్తారు. సెప్టెంబరు 21న మ్యునిక్ నగర మేయర్ చేతుల మీదుగా ప్రారంభమై అక్టోబరు తొలి ఆదివారం వరకూ కొనసాగే 16 రోజుల పండుగకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60–70 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా నడిచే పండుగలో లైవ్ బ్యాండ్స్, ఫుడ్, మ్యూజిక్, డ్యాన్స్ఫ్లోర్స్, లోకల్ ఆర్టిస్ట్సతో పాటు ఇంటర్నేషనల్ బ్యాండ్స్ అన్నీ కలగలిసి ఉంటాయి. ఇక్కడ లభించే బీరు మగ్ వెయిట్ కిలో బరువుంటుందట. దానిలో బీరు పోశాక మరింత బరువనిపించినా.. అదేమీ అక్కడి వారి ఉత్సాహాన్ని ఆపలేదు. పూర్తిగా డ్రాట్ బీర్ కావడం వల్ల ఎంత తాగినా పెద్దగా మత్తు ఇవ్వదు. స్ట్రాంగ్ బీర్స్ మాత్రమే కాదు మరే లిక్కర్ ఈ పండుగలో లభించదు. 14 మందిమి వెళ్లొచ్చాం... ఈ అక్టోబరు ఫెస్ట్‌కి 14 మంది వెళ్లాం. మొత్తం 4 రోజులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నాం. పనిలో పనిగా మ్యునిక్ సిటీ మొత్తం చూశాం. అలాగే పక్కనే ఉన్న ఆస్ట్రియాకి ట్రైన్ మీద వెళ్లొచ్చాం. Ðð ఫాల్స్ బర్గ్ ఫోర్ట్ చూశాం. జర్మన్ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంది. చర్చిలు, ప్యాలెస్‌లు చూసి తీరాల్సిందే. తరాలకు అతీతంగా కట్టడాలను కాపాడుకుంటున్నారు. జర్మనీలో ముఖ్యంగా చెప్పుకోదగినంది కాలుష్యం అసలు ఉండదు. పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్.... అన్నీ ఎలక్రిక్ వాహనాలే. మరోవైపు జర్మన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అద్భుతమైన అతిధ్యం ఇచ్చారు. పీస్ ఫుల్ కంట్రీ. అంత పెద్ద ఈవెంట్‌కి అన్ని దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనా... ఎక్కడా ఎటువంటి సమస్యా రాకుండా నిర్వహించడం గొప్ప విషయం. – తులసిరెడ్డి, కోకాపేట్ -
సిటీలో ఇంటర్నేషనల్ బీర్ డే
సాక్షి, సిటీబ్యూరో: మీకు తెలుసా? బీర్కూ ఓ రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ బీర్ డే. ప్రతిఏటా ఆగస్టు తొలి శుక్రవారం దీన్ని నిర్వహిస్తారు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన బీర్ డే వేడుకలు నగరంలోనూ ఊపందుకున్నాయి. నిన్న సిటీలో ఉత్సాహంగా బీర్ డేసెలబ్రేట్ చేసుకున్నారు. హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్లు అందించాయి. విభిన్న ఫ్లేవర్లను అందుబాటులో ఉంచాయి. ఓవైపు చిరుజల్లులు, మరోవైపు వీకెండ్ కావడంతో సిటీజనులు ఎంచక్కా బీర్‌తో చీర్ అన్నారు. బీర్ డే సందర్భంగా కింగ్‌ఫిషర్ ‘బీర్‌ను ఎందుకు ఇష్టపడతారు?’ అనే దానిపై చిన్న వ్యాఖ్యలు రాసి బహుమతి గెలుచుకోండంటూ ట్విట్టర్ వేదికగా పోటీ నిర్వహించింది. మెట్రో నగరాలైన బెంగుళూర్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పుణెలలో ఈ పోటీ నిర్వహించగా... నగరానికి చెందిన జి.తనూజ, హర్షవర్ధన్ సోలంకి విజేతలుగా నిలిచారు. ఈ మేరకు కింగ్‌ఫిషర్ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. ఇదీ ప్రత్యేకత.. స్నేహితులతో బీర్ కొట్టడం, బీరు తయారీదారులకు థ్యాంక్స్ చెప్పడం, వివిధ దేశాల బీర్లను టేస్ట్ చేయడం ఈ రోజు ప్రత్యేకత. వాస్తవానికి 2007 నుంచి ఆగస్టు 5న ఇంటర్నేషన్ బీర్ డే నిర్వహించారు. అయితే 2012 నుంచి ఆగస్టు తొలి శుక్రవారం జరుపుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పెరుగుతున్న విక్రయాలు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీర్ల వినియోగం ప్రతిఏటా పెరుగుతోంది. గణంకాలను గమనిస్తే ప్రతిఏటా 10 శాతం విక్రయాలు పెరుగుతున్నాయి. -
రేప్‌లు, నేరాలు జరుగతాయనే భయంతో..
కౌలాలంపూర్ : మలేషియాలో ప్రతియేటా నిర్వహించే బీర్ ఫెస్టివల్‌ను రద్దు చేసినట్లు కౌలాలంపూర్ పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్ లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉండటంతోపాటు పార్టీ పేరిట, నేరాలు, లైంగిక దాడులు, స్వేచ్ఛాయుత లైంగిక కార్యక్రమాలకు ఆస్కారం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 6000మంది హాజరవుతారని అంచనా. ఈ పార్టీకి దాదాపు 11 దేశాల నుంచి ఉత్సాహవంతులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల మేరకు ఈ ఫెస్టివల్ నిర్వహించ వద్దని నిర్వాహకులకు తెలియజేశారు.