సాక్షి, సిటీబ్యూరో: మీకు తెలుసా? బీర్‌కూ ఓ రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ బీర్ డే. ప్రతిఏటా ఆగస్టు తొలి శుక్రవారం దీన్ని నిర్వహిస్తారు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన బీర్ డే వేడుకలు నగరంలోనూ ఊపందుకున్నాయి. నిన్న సిటీలో ఉత్సాహంగా బీర్ డేసెలబ్రేట్ చేసుకున్నారు. హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్లు అందించాయి. విభిన్న ఫ్లేవర్లను అందుబాటులో ఉంచాయి. ఓవైపు చిరుజల్లులు, మరోవైపు వీకెండ్ కావడంతో సిటీజనులు ఎంచక్కా బీర్‌తో చీర్ అన్నారు. బీర్ డే సందర్భంగా కింగ్‌ఫిషర్ ‘బీర్‌ను ఎందుకు ఇష్టపడతారు?’ అనే దానిపై చిన్న వ్యాఖ్యలు రాసి బహుమతి గెలుచుకోండంటూ ట్విట్టర్ వేదికగా పోటీ నిర్వహించింది. మెట్రో నగరాలైన బెంగుళూర్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పుణెలలో ఈ పోటీ నిర్వహించగా... నగరానికి చెందిన జి.తనూజ, హర్షవర్ధన్ సోలంకి విజేతలుగా నిలిచారు. ఈ మేరకు కింగ్‌ఫిషర్ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది.
ఇదీ ప్రత్యేకత..
స్నేహితులతో బీర్ కొట్టడం, బీరు తయారీదారులకు థ్యాంక్స్ చెప్పడం, వివిధ దేశాల బీర్‌లను టేస్ట్ చేయడం ఈ రోజు ప్రత్యేకత. వాస్తవానికి 2007 నుంచి ఆగస్టు 5న ఇంటర్నేషన్ బీర్ డే నిర్వహించారు. అయితే 2012 నుంచి ఆగస్టు తొలి శుక్రవారం జరుపుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
పెరుగుతున్న విక్రయాలు..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీర్ల వినియోగం ప్రతిఏటా పెరుగుతోంది. గణంకాలను గమనిస్తే ప్రతిఏటా 10 శాతం విక్రయాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment