కుట్రతో ఒట్జి హత్య!
లండన్: కుట్రపూరితంగానే ఐస్ మాన్ ఒట్జిని హత్యకు గురై ఉంటారని నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రియా పర్వత ప్రాంతంలో దాదాపు 5,300 ఏళ్ల ఒట్జి మమ్మీ లభ్యమయిందని దాని ఆధారంగా ఈ వివరాలు తెలిసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ఒట్జి హత్యకు సంబంధించిన ఆధారాలు తెలుసుకునేందుకు సౌత్ టైరోల్ మ్యూజియం పురావస్తు శాస్త్రవేత్తల సాయంతో ఇటలీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ అలెగ్జాండర్ హార్న్ పరిశోధన చేశారు. ఒట్జి ఎడమ భుజానికి బాణంతో గాయపరిచి హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయన్నారు. అతను భోజనం చేస్తున్న సమయంలోనే ప్రాణాంతక బాణంతో దాడి చేశారని, ఇది కుట్ర పూరితంగా జరిగి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.