సింగపూర్ విమానం అత్యవసర ల్యాండింగ్
సింగపూర్: ముంబై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానాన్ని మలేసియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆదివారం ముంబై నుంచి బయల్దేరిన సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగినట్టు ఫైర్ అలారమ్ మోగింది. దీంతో కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దించి తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రతినిధి చెప్పారు. తనిఖీల అనంతరం విమానం సింగపూర్ బయల్దేరి వెళ్లింది.