ఫ్యాన్స్ను కోర్టుకీడ్చింది | Singer Lana Del Rey has obtained restraining orders against two fans | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్ను కోర్టుకీడ్చింది

Published Mon, Jan 4 2016 11:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

ఫ్యాన్స్ను కోర్టుకీడ్చింది

ఫ్యాన్స్ను కోర్టుకీడ్చింది

అభిమానుల అతి ప్రేమకి ప్రముఖ అమెరికా పాప్ గాయకురాలు లనా డెల్ రే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇద్దరు రష్యాకు చెందిన మహిళలు, అభిమానులమనే పేరుతో విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారని డెల్ రే వాపోయారు. వాళ్ల బాధ భరించలేక ఆమె ఇంటిని కూడా మార్చారు.

కానీ, కొత్త అడ్రస్ కూడా కనుగొని అక్కడకు కూడా వచ్చి ఇంటి ముందే పడుకొని అర్థ రాత్రి సమయంలో ఆమె పేరుతో బిగ్గరగా అరుస్తుండటంతో చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ల భయంతో ఒక బాడీగార్డును కూడా పెట్టుకోవాల్సి వచ్చిందని, తనకు ప్రాణహాని ఉన్నట్టు కోర్టుకు విన్నవించారు. దీంతో అభిమానులం అని చెప్పుకుంటున్న సదరు ఇద్దరు మహిళలని డెల్ రే ఇంటికి, అమెకు దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement