restraining orders
-
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
‘మోదీ.. మా నాన్నను తిరిగి విధుల్లోకి తీసుకోండి’
లక్నో : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ఎనిమిదో తరగతి బాలుడు తన తండ్రిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 37 లేఖలు రాశాడు. సర్థాక్ త్రిపాఠి అనే బాలుడి తండ్రి ఉత్తరప్రదేశ్ స్టాక్ ఎక్సెంజ్ కార్యాలయంలో అధికారిగా పని చేస్తుండేవాడు. 2016లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సదరు బాలుడు తన తండ్రికి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతూ మోదీకి లేఖలు రాశాడు. ఈ ఉత్తరాల్లో తన తండ్రిని బలవంతంగా ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపాడు. తండ్రి ఉద్యోగం పోవడం వల్ల తమ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోయాడు. తన తండ్రికి తిరిగి ఉద్యోగాన్ని ఇప్పించాల్సిందిగా కోరాడు. అంతేకాక మోదీ ఉంటే సాధ్యమే అనే నినాదాన్ని తాను నమ్ముతున్నానని తెలిపాడు. తనకు సాయం చేసి.. న్యాయం చేయాల్సిందిగా కోరాడు. ఇలా ఇప్పటి వరకూ 37 ఉత్తరాలు రాశాడు. కానీ ఒక్కదానికి కూడా ప్రత్యుత్తరం రాలేదని తెలిపాడు. -
ఫ్యాన్స్‌ను కోర్టుకీడ్చింది
అభిమానుల అతి ప్రేమకి ప్రముఖ అమెరికా పాప్ గాయకురాలు లనా డెల్ రే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇద్దరు రష్యాకు చెందిన మహిళలు, అభిమానులమనే పేరుతో విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారని డెల్ రే వాపోయారు. వాళ్ల బాధ భరించలేక ఆమె ఇంటిని కూడా మార్చారు. కానీ, కొత్త అడ్రస్ కూడా కనుగొని అక్కడకు కూడా వచ్చి ఇంటి ముందే పడుకొని అర్థ రాత్రి సమయంలో ఆమె పేరుతో బిగ్గరగా అరుస్తుండటంతో చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ల భయంతో ఒక బాడీగార్డును కూడా పెట్టుకోవాల్సి వచ్చిందని, తనకు ప్రాణహాని ఉన్నట్టు కోర్టుకు విన్నవించారు. దీంతో అభిమానులం అని చెప్పుకుంటున్న సదరు ఇద్దరు మహిళలని డెల్ రే ఇంటికి, అమెకు దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది.