మాడ్రిడ్: మహమ్మారి కరోనాకు స్పెయిన్ యువరాణి మారియా థెరీసా బలయ్యారు. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్ రాజు ఫెలిప్-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్ ప్రిన్సెస్’గా పేరు సంపాదించారు.
ఇక ఇటీవల జరిగిన వైరస్ నిర్ధారణ పరీక్షల్లో కింగ్ ఫెలిప్-6కు నెగెటివ్ అని వచ్చింది. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్, ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రికి కోవిడ్–19 సోకిన సంగతి తెలిసిందే. కాగా, స్పెయిన్‌లో ఇప్పటివరకు 73 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 5982 మంది ప్రాణాలు విడిచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 60 వేల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడగా.. 30 వేల మందికి పైగా మరణించారు. మృతుల్లో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం.
చదవండి ►
ఒక్కరోజులో 738 మంది మృతి
ఇటలీలో ఆగని విలయం
Comments
Please login to add a commentAdd a comment