అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి..
20 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని సుప్రీంకోర్టు ఆవరణలో ఓ వ్యక్తి మంగళవారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఘటనలో 20 మంది మృతిచెందగా, 41 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మహిళలు సహా చిన్నారులు ఉన్నారని ఆరోగ్య శాఖ ప్రతినిధి వహీద్ మజ్రో తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లే సమయంలో పార్కింగ్ స్థలం వద్ద ఈ దాడి జరిగింది. గత నెలలో కాబూల్‌లోని పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో తాలిబన్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.