ఆకలి అంటే తెలుసా? | Syria girl questioning Trump | Sakshi
Sakshi News home page

ఆకలి అంటే తెలుసా?

Published Fri, Feb 3 2017 1:23 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఆకలి అంటే తెలుసా? - Sakshi

ఆకలి అంటే తెలుసా?

ట్రంప్‌ను ప్రశ్నించిన సిరియా బాలిక
డమాస్కస్‌: శరణార్థులను అమెరికాలోకి ప్రవేశించ నీయకూడదన్న నిర్ణయంపై డొనాల్డ్‌ ట్రంప్‌ను సిరియాకు చెందిన ఓ చిన్నారి ట్విటర్‌ ద్వారా నిలదీసింది. అలెప్పోలో తమ దుర్భర జీవితం గురించి ట్వీట్‌ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఏడేళ్ల బానా అలాబెద్‌ తాజాగా ఓ వీడియో ద్వారా ట్రంప్‌ను ప్రశ్నించింది. ‘మిస్టర్‌ ట్రంప్‌.. మీరెప్పుడైనా 24 గంటలపాటు ఆహారం తీసుకోకుండా, నీరు తాగకుండా ఉన్నారా?.. ఒక్కసారి సిరియా శరణార్థులు, చిన్నారుల గురించి ఆలోచించండి’ అని అలాబెద్‌ ప్రశ్నించింది. అయితే నిషేధాన్ని సమర్థించుకుంటూ చెడ్డవారిని అమెరికాకు బయటే ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్‌ గతంలో ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన అలాబెద్‌.. ‘నేను ఉగ్రవాదినా?’ అని ట్వీటర్‌ ద్వారా ట్రంప్‌ను ప్రశ్నించింది. ‘డియర్‌ ట్రంప్‌.. శరణార్థులను నిషేధించడం చాలా చెడు విషయం. సరే.. ఒకవేళ ఇది మంచిదే అయితే.. నా దగ్గర ఓ ఆలోచన ఉంది. ఇతర దేశాలన్నింటినీ శాంతియుతంగా మార్చండి’ అంటూ అలాబెద్‌ ట్విటర్‌లో సూచించింది. అలెప్పోలో తమ దుర్భర పరిస్థితిని తన తల్లి ఫాతిమా సహాయంతో ట్విటర్‌ ద్వారా ప్రపంచానికి అలాబెద్‌ తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement