Bana alabed
-
ఆకలి అంటే తెలుసా?
ట్రంప్‌ను ప్రశ్నించిన సిరియా బాలిక డమాస్కస్: శరణార్థులను అమెరికాలోకి ప్రవేశించ నీయకూడదన్న నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్‌ను సిరియాకు చెందిన ఓ చిన్నారి ట్విటర్ ద్వారా నిలదీసింది. అలెప్పోలో తమ దుర్భర జీవితం గురించి ట్వీట్ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఏడేళ్ల బానా అలాబెద్ తాజాగా ఓ వీడియో ద్వారా ట్రంప్‌ను ప్రశ్నించింది. ‘మిస్టర్ ట్రంప్.. మీరెప్పుడైనా 24 గంటలపాటు ఆహారం తీసుకోకుండా, నీరు తాగకుండా ఉన్నారా?.. ఒక్కసారి సిరియా శరణార్థులు, చిన్నారుల గురించి ఆలోచించండి’ అని అలాబెద్ ప్రశ్నించింది. అయితే నిషేధాన్ని సమర్థించుకుంటూ చెడ్డవారిని అమెరికాకు బయటే ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ గతంలో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన అలాబెద్.. ‘నేను ఉగ్రవాదినా?’ అని ట్వీటర్ ద్వారా ట్రంప్‌ను ప్రశ్నించింది. ‘డియర్ ట్రంప్.. శరణార్థులను నిషేధించడం చాలా చెడు విషయం. సరే.. ఒకవేళ ఇది మంచిదే అయితే.. నా దగ్గర ఓ ఆలోచన ఉంది. ఇతర దేశాలన్నింటినీ శాంతియుతంగా మార్చండి’ అంటూ అలాబెద్ ట్విటర్లో సూచించింది. అలెప్పోలో తమ దుర్భర పరిస్థితిని తన తల్లి ఫాతిమా సహాయంతో ట్విటర్ ద్వారా ప్రపంచానికి అలాబెద్ తెలియజేస్తోంది. -
‘ప్రియమైన ప్రపంచమా మళ్లీ కలుద్దాం.. సెలవు’
అలెప్పో: ఏడేళ్ల ప్రాయంలోనే తన ట్వీట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కంటతడి పెట్టించిన అలెప్పో చిన్నారి బనా అలాబెడ్(7) జాడ కనిపించకుండా పోయింది. తన ట్విట్టర్ ఖాతా ఆదివారం నుంచి కనుమరుగైంది. అనతి కాలంలోనే దాదాపు లక్షమంది ఫాలోవర్స్‌ను సంపాధించుకుని వాళ్ల హృదయాలను ద్రవించజేసిన అలాబెడ్ ఆదివారం రాత్రి నుంచి ట్విట్టర్లో మాయమైంది. సిరియాకు చెందిన ప్రముఖ నగరం అలెప్పో నగరంలో ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు, అమెరికా సంయుక్త సిరియా బలగాలకు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల చెర నుంచి అలెప్పోను విముక్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ బలగాలు ముందుకు సాగుతుండగా బాంబుల వర్షం కురుస్తోంది. బాంబు శబ్దం, విస్పోటనాలు లేని రాత్రి అక్కడ లేదంటే ఆశ్చర్యం కాదు. అలాంటి పరిస్థితులను, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దౌర్భాగ్యాన్ని అలాబెడ్ గత సెప్టెంబర్ నుంచి తన తల్లి ఫతేమా క్రియేట్ చేసిన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. ‘మేమింకా బ్రతికే ఉన్నాం. ప్రపంచమా గుడ్ మార్నింగ్’ అంటూ ఈ మధ్యే ఓ ట్వీట్ చేసి గుండెలు పిండేసింది. అలాంటి అలాబెడ్ గత నెల(నవంబర్) 27న ‘ఈ రోజు రాత్రి మాకు ఇల్లు లేదు. బాంబు దాడిలో అది ధ్వంసమైంది. నేను ఎంతోమంది మరణాలు చూశాను. నేను కూడా దాదాపు చనిపోయినట్లే’ అని ట్వీట్ చేయడంతోపాటు ఇప్పటకీ బాంబుల వర్షం కురుస్తోంది. మేం చావుకు బ్రతుకుకు మధ్య పోరాడుతున్నాం. మాకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేసింది. ఇక చివరిసారిగా ‘కచ్చితంగా మమ్మల్ని ఆర్మీ అదుపులోకి తీసుకుంటుంది. ప్రియమైన ప్రపంచమా త్వరలోనే మనం మరోసారి కలుసుకుంటాం. ఇక సెలవు’ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి నుంచి అలాబెడ్ ట్విట్టర్ ఖాతా నుంచి కనిపించకుండా పోయింది. పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా ఆమె సురక్షితంగా ఉండాలని వేడుకుంటున్నారు. భద్రతా బలగాలు వారిని ఏదో ఒక చోట భద్రంగా ఉంచి ఉంటారని, కుదురుకున్నాక అలాబెడ్ తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తుందని అనుకుంటున్నామని చెబుతున్నారు. May Allah keep you safe, Bana and family. Please let us know you're safe when you're able. #BanaAlabed — Lil Yum Yum (@ScribeShelly) 5 December 2016 God be with Bana Alabed and her family. Praying they're safe and will have an opportunity to live a better life elsewhere. #Aleppo — Dan Jones (@djonesvi) 5 December 2016 -
'గుడ్ మార్నింగ్.. మేమింకా బతికే ఉన్నాం'
అలెప్పో: అలెప్పో..సిరియాలోని ఒక ప్రముఖ నగరం.. అయితే, నిత్యం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ప్రభుత్వ బలగాలకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఏక్షణం ఏ ఇంటి మీద బాంబు పడుతుందో ఎవరూ ఏ రాత్రి అనూహ్యంగా శిథిలాల కింద పడి ప్రాణాలుకోల్పోతారో తెలియని పరిస్థితి. ఎలాగైనా తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలని సిరియా ప్రభుత్వం ఓ పక్క.. ఏమైనా సరే పట్టు విడవొద్దని ఉగ్రవాదులు మరోపక్క.. మొత్తానికి పరస్పరం విసురుకుంటున్న బాంబుల ధాటికి అక్కడి సామాన్యుల ప్రాణాలు మాత్రం గాల్లో దీపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఉగ్రవాదులు దాడులు ఆపేయాలని అలెప్పోను ప్రశాంతంగా విడిచిపెట్టాలని కోరుకుంటూ ఓ చిన్నారి ట్విట్టర్ ద్వారా తన విన్నపాలు వినిపిస్తోంది. ఏడేళ్ల వయసున్న బనా అలబెడ్ అనే చిన్నారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మనసును కదిలించే చిత్రాలతోపాటు స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోలు కూడా ట్విట్టర్ లో పెడుతూ ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఖాతాను ఆమె తల్లి నిర్వహిస్తోంది. ట్విట్టర్ ద్వారా తాను చెబుతున్న మాటలు, వివరాలు వింటుంటే ఎవరికైనా జాలి కలగాల్సిందే. అవేంటో ఒక్కసారి గమనిస్తే.. 'మీరేందుకు ప్రతి రోజు అమాయకులైన మాపై బాంబులు వేస్తున్నారు' అంటూ విషాదంతో చూస్తున్నట్లుగా ఒక ఫొటో పోస్ట్ చేయగా మరో చోట.. 'ఫ్రెండ్స్ ఇది జాబిలి కాదు.. మా నగరంపై బాంబు దూసుకొస్తుంది' అంటూ ఓ బాంబు అలెప్పోపై పడుతున్న ఛాయా చిత్రాన్ని పెట్టింది. అలాగే, రాత్రి బాంబు దాడి అనంతరం ఉదయాన్నే ఆ ప్రాంతాన్ని తాను పరిశీలిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. 'అలెప్పో నుంచి మేం శుభోదయం చెబుతున్నాం.. మేం ఇంకా బతికే ఉన్నాం' అని ఆశ్చర్యపోయినట్లుగా ఓ బాంబు వలన రేగిపోయిన దుమ్ము ఫొటో పెట్టింది. 'నా ప్రియమైన ప్రపంచమా నేను ఈ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా మిత్రురాలు బాంబు దాడిలో చనిపోయింది. నేను ఏడుపు అపలేకపోతున్నాను'. 'ఎవరైనా దయచేసి నన్ను రక్షించరా ప్లీజ్ అంటూ తన బెడ్ వెనుకాల దాచుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో' 'శుభ మధ్యాహ్నవేళ.. నేను యుద్ధాన్ని మర్చిపోయేందుకు చదువుతున్నాను' అంటూ ఇలా ప్రతిరోజు అలెప్పోలోని పరిస్థితులు ప్రపంచానికి అర్థమయ్యేలా ఈ చిన్నారి తన ఖాతాలో వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. Why would they bomb us and kill innocent people everyday?. - Bana #Aleppo pic.twitter.com/XeF3Q7HKZ9 — Bana Alabed (@AlabedBana) 21 November 2016 checking in the morning after a night of bombing #Aleppo #StandWithAleppo pic.twitter.com/vcbJ3vbD91 — Bana Alabed (@AlabedBana) 22 November 2016 My friends this is not the moon, this is bomb falling now. Please pray for us tonight. I am afraid. - Bana #Aleppo pic.twitter.com/1jpy87rSrn — Bana Alabed (@AlabedBana) 23 November 2016 Good morning from #Aleppo. We are still alive. - Bana pic.twitter.com/hw0XyaXBKA — Bana Alabed (@AlabedBana) 24 November 2016 Oh dear world, I am crying tonight, this is my friend killed by a bomb tonight. I can't stop crying. - Bana #Aleppo pic.twitter.com/WpmCrEDTIa — Bana Alabed (@AlabedBana) 24 November 2016 I swear I am crying tonight. My student, her father were killed in rocket tonight. The bombs becoming louder. - Fatemah #Aleppo — Bana Alabed (@AlabedBana) 24 November 2016