'గుడ్‌ మార్నింగ్‌.. మేమింకా బతికే ఉన్నాం' | Seven year old girl takes to Twitter to depict life in Aleppo | Sakshi
Sakshi News home page

'గుడ్‌ మార్నింగ్‌.. మేమింకా బతికే ఉన్నాం'

Published Fri, Nov 25 2016 12:09 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

'గుడ్‌ మార్నింగ్‌.. మేమింకా బతికే ఉన్నాం'

'గుడ్‌ మార్నింగ్‌.. మేమింకా బతికే ఉన్నాం'

అలెప్పో: అలెప్పో..సిరియాలోని ఒక ప్రముఖ నగరం.. అయితే, నిత్యం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు ప్రభుత్వ బలగాలకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఏక్షణం ఏ ఇంటి మీద బాంబు పడుతుందో ఎవరూ ఏ రాత్రి అనూహ్యంగా శిథిలాల కింద పడి ప్రాణాలుకోల్పోతారో తెలియని పరిస్థితి. ఎలాగైనా తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలని సిరియా ప్రభుత్వం ఓ పక్క.. ఏమైనా సరే పట్టు విడవొద్దని ఉగ్రవాదులు మరోపక్క.. మొత్తానికి పరస్పరం విసురుకుంటున్న బాంబుల ధాటికి అక్కడి సామాన్యుల ప్రాణాలు మాత్రం గాల్లో దీపాలవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఉగ్రవాదులు దాడులు ఆపేయాలని అలెప్పోను ప్రశాంతంగా విడిచిపెట్టాలని కోరుకుంటూ ఓ చిన్నారి ట్విట్టర్‌ ద్వారా తన విన్నపాలు వినిపిస్తోంది. ఏడేళ్ల వయసున్న బనా అలబెడ్‌ అనే చిన్నారి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా మనసును కదిలించే చిత్రాలతోపాటు స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోలు కూడా ట్విట్టర్‌ లో పెడుతూ ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఖాతాను ఆమె తల్లి నిర్వహిస్తోంది. ట్విట్టర్ ద్వారా తాను చెబుతున్న మాటలు, వివరాలు వింటుంటే ఎవరికైనా జాలి కలగాల్సిందే. అవేంటో ఒక్కసారి గమనిస్తే..

'మీరేందుకు ప్రతి రోజు అమాయకులైన మాపై బాంబులు వేస్తున్నారు' అంటూ విషాదంతో చూస్తున్నట్లుగా ఒక ఫొటో పోస్ట్ చేయగా మరో చోట.. 'ఫ్రెండ్స్‌ ఇది జాబిలి కాదు.. మా నగరంపై బాంబు దూసుకొస్తుంది' అంటూ ఓ బాంబు అలెప్పోపై పడుతున్న ఛాయా చిత్రాన్ని పెట్టింది. అలాగే, రాత్రి బాంబు దాడి అనంతరం ఉదయాన్నే ఆ ప్రాంతాన్ని తాను పరిశీలిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. 'అలెప్పో నుంచి మేం శుభోదయం చెబుతున్నాం.. మేం ఇంకా బతికే ఉన్నాం' అని ఆశ్చర్యపోయినట్లుగా ఓ బాంబు వలన రేగిపోయిన దుమ్ము ఫొటో పెట్టింది. 'నా ప్రియమైన ప్రపంచమా నేను ఈ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను.

ఎందుకంటే నా మిత్రురాలు బాంబు దాడిలో చనిపోయింది. నేను ఏడుపు అపలేకపోతున్నాను'. 'ఎవరైనా దయచేసి నన్ను రక్షించరా ప్లీజ్‌ అంటూ తన బెడ్‌ వెనుకాల దాచుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో' 'శుభ మధ్యాహ్నవేళ.. నేను యుద్ధాన్ని మర్చిపోయేందుకు చదువుతున్నాను' అంటూ ఇలా ప్రతిరోజు అలెప్పోలోని పరిస్థితులు ప్రపంచానికి అర్థమయ్యేలా ఈ చిన్నారి తన ఖాతాలో వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement