ఆ నరమేధానికి వారే కారణం: ఒబామా
వాషింగ్టన్: సిరియాలోని అలెప్పోలో జరుగుతున్న నరమేధానికి అక్కడి బషర్ అల్ అసద్ ప్రభుత్వం, రష్యా, ఇరాన్‌లే కారణమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అయితే అక్కడ యుద్దాన్ని నిలిపివేయడానికి వాషింగ్టన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
అలెప్పో నగరంలో అసద్ ప్రభుత్వం, రష్యా, ఇరాక్‌లు కలిసి చేస్తున్న దురాగతాల విషయంలో ప్రపంచ దేశాలు సమైక్యంగా ఉన్నాయన్నారు. ఈ విధమైన విధానాల ద్వారా అసద్ తన పాలనను చట్టబద్ధం చేసుకోలేరని ఒబామా స్పష్టం చేశారు. అలెప్పోలో జరుగుతున్న అకృత్యాలకు అసద్, అతని అనుకూల రష్యా, ఇరాన్‌లదే బాధ్యతని శుక్రవారం న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఒబామా అన్నారు.