అమెరికా వర్సిటీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు | telugu doctor gets place in us versity hall of fame | Sakshi
Sakshi News home page

అమెరికా వర్సిటీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు

Published Thu, Apr 13 2017 7:42 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

అమెరికా వర్సిటీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు - Sakshi

అమెరికా వర్సిటీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఆంధ్రుడు

అమెరికా ఓహియో రాష్ట్రంలోని టోలెడో మెడికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో తెలుగు వైద్యుడు వాడ్రేవు రాజుకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజు 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ఆ తరువాత భారత్‌లోనే ఇంటర్న్‌షిప్‌, రెసిడెన్సీ పూర్తి చేసిన ఆయన ఇంగ్లండ్‌లోని సర్రేలోని ఓ ఆసుపత్రిలో అత్యవసర విభాగం అధికారిగా పనిచేశారు.

లండన్‌లోని రాయల్‌ కంటి ఆసుపత్రుల గ్రూప్‌లో ఆప్తల్మాలజీ రెసిడెన్సీ, ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు. ఆ తరువాత పశ్చిమ వర్జీనియా వర్సిటీ ఆప్తల్మాలజీ విభాగంలో సుమారు 8 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేశారు. 1984 నుంచి క్లినికల్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఐ ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా(ఈఎఫ్‌ఏ)కు రాజు వ్యవస్థాపకుడు, మెడికల్‌ డైరెరక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వెస్ట్‌ వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే 14 దేశాల్లో తన సేవలను ప్రారంభించడంతో పాటు భారత్‌లో కంటి ఆసుపత్రులను స్థాపించింది. తన సేవలకు గుర్తింపుగా రాజు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement