యూఎస్ నావికా స్థావరంలో కలకలం | Temporary lockdown at US naval base in Japan | Sakshi
Sakshi News home page

యూఎస్ నావికా స్థావరంలో కలకలం

Published Thu, Nov 3 2016 11:55 AM | Last Updated on Fri, Aug 24 2018 5:35 PM

యూఎస్ నావికా స్థావరంలో కలకలం - Sakshi

యూఎస్ నావికా స్థావరంలో కలకలం

టోక్యో: జపాన్‌లోని యూఎస్ నావికా స్థావరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ జపాన్‌లోని ససెబొలో ఉన్న ఈ స్థావరంలో గురువారం ఉదయం కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే నావల్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

నావల్ బేస్ భద్రతా సిబ్బందికి బిల్డింగ్ నెంబర్ 141లో కాల్పుల శబ్దం వినిపించినట్లు సమాచారం అదడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే బిల్డింగ్‌ను ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం దీనిపై వివరణ ఇస్తూ.. కాల్పులు చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఎవరికీ గాయాలు కాలేదని తెలుపుతూ లాక్‌డౌన్‌ ఎత్తేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement