ఈ ట్రక్కుకు డ్రైవర్ అక్కరలేదు!
ఇప్పటి వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి విన్నాం.. అక్కడక్కడ అవి హల్‌చల్ కూడా చేసేస్తున్నాయి. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల కాలం వచ్చేసింది. అమెరికాలోని ఓ కంపెనీ డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేసే సరికొత్త ట్రక్కులను తయారుచేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కు. ట్రక్కులో ఉన్న రాడార్లు, స్కానర్లు రోడ్లపై వచ్చే వాహనాలను స్కాన్ చేసి ఎటువంటి ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసేస్తుందట. ఇటీవలే అమెరికాలోని హూవర్ బ్రిడ్జిపై టెస్ట్ డ్రైవింగ్‌లో కూడా విజయవంతంగా పాస్ అయిందట.