'మా ప్రధాని పాక్ను మార్చాలనుకుంటున్నారు' | There is a complete paradigm shift as far as Pakistan is concerned: Maiza Hameed | Sakshi
Sakshi News home page

'మా ప్రధాని పాక్ను మార్చాలనుకుంటున్నారు'

Published Thu, Jan 14 2016 9:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

'మా ప్రధాని పాక్ను మార్చాలనుకుంటున్నారు'

'మా ప్రధాని పాక్ను మార్చాలనుకుంటున్నారు'

ఇస్లామాబాద్: తమ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ను సమూలంగా మార్చాలనుకుంటున్నారని పాక్ అధికారిక పార్టీ పీఎంఎల్ ఎన్ నేత మైజా హమీద్ అన్నారు. భారత్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరం పై దాడి ఘటనకు సంబంధించి కొనసాగుతున్న అరెస్టులు తాము ఉగ్రవాదానికి ఎంతటి వ్యతిరేకంగా పనిచేస్తున్నామో తెలియజేస్తుందని అన్నారు.

తమ ప్రధాని షరీఫ్ ఉగ్రవాదానికి ఎంతటి బద్ధ వ్యతిరేకులో ప్రపంచానికి తప్పక చూపిస్తారని పేర్కొన్నారు. పాకిస్థాన్ గతమంతా కొంత ఆందోళనతో నిండి ఉన్నదని, ఆపరిస్థితిని మార్చాలనేది తమ ధ్యేయమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement