PMLN
-
మా పార్టీ గెలిస్తే మా అన్నే పీఎం: షెహబాజ్
ఇస్లామాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్–ఎన్) మరోసారి విజేతగా నిలిచిన పక్షంలో తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడతారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. లండన్‌లో గడుపుతున్న నవాజ్ çస్వదేశానికి త్వరలో వస్తారన్నారు. సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా తటస్థుడిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేస్తామన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరనే విషయమై భాగస్వామ్య పార్టీలతోపాటు, పీఎంఎల్–ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపాక నిర్ణయిస్తామని తెలిపారు. -
షరీఫా మజాకా.. !
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలను బతికించుకున్నారు. అక్రమాస్తులు, అవినీతి కేసులో ఇరుక్కొని పదవిని కోల్పోయిన ఆయన తిరిగి ఆ బాధ్యతల్లోకి వెళ్లేందుకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఆయనను మరోసారి పాక్ అధికార పార్టీ అధ్యక్షుడిగా(పీఎంఎల్ ఎన్) నియమిస్తూ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పాక్ పార్లమెంటు ఓ వివాదాస్పద బిల్లును పాస్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కోల్పోయిన నవాజ్.. తాజాగా పార్లమెంటు చేసిన చట్ట సవరణ బిల్లుతో ఆయనకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కల్పించింది. పీఎంఎల్ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా తాము షరీఫ్‌ను ఎన్నుకుంటున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన పత్రాలను పాక్ ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ నేత తారిఖ్ ఫజల్ చౌదరీ అందించారు. మరో వ్యక్తి ఈ పదవికి పోటీపడటం లేదని స్పష్టం చేశారు. దీంతో 1976నాటి పాకిస్థాన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం రాజకీయాల నుంచి వేటును ఎదుర్కొంటున్న నవాజ్‌కు మరోసారి ప్రవేశించే అవకాశం దక్కింది. -
'మా ప్రధాని పాక్‌ను మార్చాలనుకుంటున్నారు'
ఇస్లామాబాద్: తమ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ను సమూలంగా మార్చాలనుకుంటున్నారని పాక్ అధికారిక పార్టీ పీఎంఎల్ ఎన్ నేత మైజా హమీద్ అన్నారు. భారత్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరం పై దాడి ఘటనకు సంబంధించి కొనసాగుతున్న అరెస్టులు తాము ఉగ్రవాదానికి ఎంతటి వ్యతిరేకంగా పనిచేస్తున్నామో తెలియజేస్తుందని అన్నారు. తమ ప్రధాని షరీఫ్ ఉగ్రవాదానికి ఎంతటి బద్ధ వ్యతిరేకులో ప్రపంచానికి తప్పక చూపిస్తారని పేర్కొన్నారు. పాకిస్థాన్ గతమంతా కొంత ఆందోళనతో నిండి ఉన్నదని, ఆపరిస్థితిని మార్చాలనేది తమ ధ్యేయమని చెప్పారు.