ఆర్మీ వాళ్లు తమ కుటుంబాలపై దాడులు చేస్తున్నారని, అందుకే తాము ఆర్మీ స్కూలును లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు. తమకు కలిగిన బాధేంటో వాళ్లూ తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. దాడిలో 126 మంది పిల్లలు మరణించగా, 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పెషావర్ చేరుకున్నారు. అక్కడ ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు పాక్ స్కూల్లో మూడు సార్లు భారీపేలుడు శబ్దాలు కూడా వినిపించాయి.
మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు స్కూల్లోకి చొరబడగా, వాళ్లలో ముగ్గురిని సైనికులు హతమార్చారు. అయితే, కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉండొచ్చని కూడా చెబుతున్నారు. పిల్లలను కొన్నిచోట్ల మానవ బాంబులుగా ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. అయితే, తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని తాలిబన్ ప్రతినిధులు చెబుతున్నారు.
మా బాధ వాళ్లకూ తెలియాలనే దాడి: తాలిబన్లు
Published Tue, Dec 16 2014 4:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement
Advertisement