peshavar
-
తాలిబన్ నేతను పట్టిస్తే భారీ రివార్డు
వాషింగ్టన్: నోబెల్ శాంతి గ్రహీత మలాలాపై దాడికి కారణమైన తాలిబన్ నేత మౌలానా ఫజలుల్లా తలపై అమెరికా ప్రభుత్వం భారీ రివార్డు ప్రకటించింది. అతడిని పట్టించిన వారికి 5 మిలియన్ డాలర్లు(దాదాపు 32.49 కోట్లు) నజరానాగా ఇస్తానని తెలిపింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అధినేత ఫజలుల్లాను పలు దాడులకు సూత్రధారిగా అమెరికా అనుమానిస్తోంది. 2014లో పెషావర్ పాఠశాలపై తెహ్రిక్–ఇ– తాలిబన్ జరిపిన దాడిలో 150 మంది చనిపోయారు. వీరి లో ఎక్కువ మంది విద్యార్థులే. బాలికా విద్య కోసం కృషి చేస్తున్న మలాలాపై 2012లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడింది. -
పెషావర్ మృతులకు పార్లమెంట్ శ్రద్ధాంజలి
-
ఇస్లాం రాజ్యస్థాపనే.. తాలిబన్ల లక్ష్యం..!
-
ఉగ్రదాడిలో 160 మంది విద్యార్థుల మృతి
-
పెషావర్ లో పాశవికం
-
ముగిసిన ఆపరేషన్.. ఉగ్రవాదులంతా హతం
పాకిస్థాన్‌లోని పెషావర్ సైనిక్ స్కూలు ఆపరేషన్ జర్బే అజబ్ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో నలుగురు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకుని చనిపోయారు.మిగిలిన ఇద్దరిని పాకిస్తాన్ ఆర్మీ మట్టుబెట్టింది. మొత్తం ఉగ్రవాదులంతా ఆత్మాహుతి దళానికి చెందినవారే. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 160కి చేరింది. వీరిలో 125మంది వరకు విద్యార్థులున్నారు. మరో 122 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. పలు ఆసుపత్రుల్లో గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. పిల్లలను నిలబెట్టి తలలపై కాల్చినట్టు తెలుస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, చిన్న పిల్లల జోలికి పోకుండా కేవలం పెద్ద పిల్లలనే టార్గెట్ చేయమని తమ వారికి చెప్పినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపాడు. వాస్తవానికి చిన్నపిల్లలు కూడా దాడిలో గాయపడ్డారు. ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక చర్యలకు ప్రతీకారంగా ఈ దారుణానికి తెగబడినట్టు ఉగ్రవాదులు చెప్పారు. స్కూలును చుట్టుముట్టిన భద్రతాదళాలు ఆరుగురు తాలిబన్లనూ హతమార్చారు. ఈ దుశ్చర్యను జాతీయ విషాదంగా పేర్కొన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. పెషావర్‌లో ఆయన సైనిక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ దాడిని భారత ప్రదాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్లో తాలిబన్ల దాడిని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
పెషావర్ స్కూల్లో ఏం జరిగిందంటే...
-
పెషావర్ స్కూల్లో ఏం జరిగిందంటే...
పెషావర్ ఉగ్రవాద ఘటన ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఉగ్రవాదులు అభంశుభం తెలియని చిన్నారులను పొట్టనపెట్టుకున్నారు. సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.మంగళవారం పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన ఉగ్రవాద దాడి వివరాలిలా ఉన్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు వెనుక గేటు నుంచి స్కూల్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో స్కూల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు స్కూల్లోకి వెళ్లగానే ఓ వాహనాన్ని పేల్చివేశారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఒక్కో తరగతిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. చిన్నారులను ఉగ్రవాదులు మానవ కవచంగా చేసుకున్నారు. స్కూల్లో 15 పేలుళ్లు సంభవించాయి. పిల్లలతో సహా ఇప్పటిదాకా 130 మంది మరణించారు. దాదాపు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఓ టీచర్ ను సజీవ దహనం చేశారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన అరగంటకు సైన్యం స్కూలును చుట్టుముట్టింది. పిల్లలను రక్షించేందుకు సైన్యం ప్రతిదాడి ఆరంభించింది. సైన్యం దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. స్కూలు నుంచి పిల్లలను తరలిస్తున్నారు. పెషావర్‌లో ఇంకా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం 45 మంది విద్యార్థులను రక్షించింది. ఉగ్రవాద చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పెషావర్ చేరుకున్నారు. పాక్‌లో మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పెషావర్ ఘటన పట్ల తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్య అత్యంత హేయమని చర్యని మోదీ అభివర్ణిస్తూ, తీవ్రంగా ఖండించారు. -
ఉన్మాదానికి సమాధానం.. తుపాకులే!
-
మాపై దాడులకు ప్రతీకారంగానే.. ఈ దాడి!
-
మా బాధ వాళ్లకూ తెలియాలనే దాడి: తాలిబన్లు
ఆర్మీ వాళ్లు తమ కుటుంబాలపై దాడులు చేస్తున్నారని, అందుకే తాము ఆర్మీ స్కూలును లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు. తమకు కలిగిన బాధేంటో వాళ్లూ తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. దాడిలో 126 మంది పిల్లలు మరణించగా, 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పెషావర్ చేరుకున్నారు. అక్కడ ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు పాక్ స్కూల్లో మూడు సార్లు భారీపేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు స్కూల్లోకి చొరబడగా, వాళ్లలో ముగ్గురిని సైనికులు హతమార్చారు. అయితే, కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉండొచ్చని కూడా చెబుతున్నారు. పిల్లలను కొన్నిచోట్ల మానవ బాంబులుగా ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. అయితే, తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని తాలిబన్ ప్రతినిధులు చెబుతున్నారు. -
పెషావర్ : తాలిబన్ల దాడిలో 100మంది మృతి
-
133 మంది విద్యార్థుల మృతి
పాకిస్థాన్ ఉగ్రవాద దాడిలో దాదాపు 133 మంది విద్యార్థులు మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మరో 200 మంది వరకు గాయాల పాలయ్యారు. పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలలో జరిగిన ఈ దాడిలో వంద మంది మరణించినట్లు ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. తొలుత కేవలం 23 మంది మాత్రమే మరణించినట్లు భావించినా, లోపలున్న ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపి, ముగ్గురిని హతమార్చడంతో ఉగ్రవాదులు మరింతగా రెచ్చిపోయారు. మొత్తం 133 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు ఈ ఉగ్రదాడిలో మరణించినట్లు జాతీయ మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి. 960 మందిని భద్రతా బలగాలు రక్షించాయి. 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దుర్ఘటన విషయం తెలియగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయల్దేరారు. కాగా, భారీ సంఖ్యలో గాయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వస్తుండటంతో పెషావర్‌లోని ఆస్పత్రిలో రక్తానికి తీవ్ర కొరత ఏర్పడింది. -
నాలుగో పీరియడ్ జరుగుతుండగా కాల్పులు
కాల్పులు జరిగే సమయానికి పాకిస్థాన్ లోని ఆర్మీ స్కూల్లో నాలుగో పీరియడ్ జరుగుతున్నట్లు వెనక గేటు నుంచి తప్పించుకుని వచ్చిన ఓ విద్యార్థి చెప్పాడు. తొలుత ఏం జరిగిందో తమకు తెలియలేదని, తర్వాత మమ్మల్ని వెనక గేటు నుంచి పారిపోవాల్సిందిగా ఓ ఆర్మీ అధికారి చెప్పారని అన్నాడు. ఇక పాక్ స్కూలు వద్ద ఇప్పటికీ ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ వర్గాలకు, లోపలున్న ఉగ్రవాదులకు మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ముగ్గురు ఫిదాయీ ఉగ్రవాదులను సైనికులు హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కేవలం నలుగురు పిల్లలు మాత్రమే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉగ్రవాదులు లోపలకు వెళ్లీ వెళ్లగానే విద్యార్థులు, ఉపాధ్యాయుల మీద విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. సుమారు 20 మంది వరకు మరణించారు. ఉగ్రవాదుల్లో ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. స్కూలు లోపల నుంచి భారీస్థాయిలో కాల్పుల శబ్దాలు వినిపించాయని సంఘటన స్థలంలో ఉన్న రాయిటర్స్ విలేకరి ఒకరు తెలిపారు. స్కూల్లోకి తొలుత 800 మంది వరకు విద్యార్థులు వెళ్లారని, అయితే కొంతమందిని మాత్రం ఎలాగోలా బయటకు తీసుకురావడంతో లోపల సుమారు 500 మంది వరకు ఉండొచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. -
పెద్ద పిల్లలనే కాల్చాలని చెప్పాం: పాక్ తాలిబన్లు
పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో ఘాతుకానికి పాల్పడింది, 20 మంది పిల్లలను హతమార్చింది తామేనని తెహరీక్- ఎ- తాలిబన్- పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే తాము పెద్ద పిల్లలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని, పిల్లలను వదిలేయాలని సూచించామని ఆ ఉగ్రవాద సంస్థ తెలిపింది. సుమారు 500 మందికి పైగా విద్యార్థులతో పాటు అక్కడున్న ఉపాధ్యాయులు కూడా ఉగ్రవాదుల చెరలో ఉన్నారు. కేవలం ఆరుగురు ఉగ్రవాదులే అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి సుమారు 20 మంది పిల్లలను ఉగ్రవాదులు హతమార్చారు. ఇది కేవలం ప్రతీకార చర్య అని , ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో సైనిక చర్యకు ప్రతీకారంగానే ఇలా చేశామని టీటీపీ నేతలు చెప్పారు. దాడికి పాల్పడిన వాళ్లు ఎవరైనా సహించేది లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు.